షర్మిలకు విజయసాయి ఇన్ డైరెక్ట్ వార్నింగ్…? ట్వీట్ ఉద్దేశం ఏంటీ…?
“నా ప్రియమైన జెండా కూలీల్లారా. మీలో నేనొకడ్ని. మనం ముందుగా పోరాటం చేయాల్సింది బానిసత్వం నుంచి విముక్తి కోసం...ఎందుకంటే లాభాల్లో వాటా మన కూలీలకు ఇవ్వరుగా..??! కూలీలకు కూలీ మాత్రమే గిడుతుంది. ఎంత కొట్టుకున్న ఉపయోగం లేదు.
“నా ప్రియమైన జెండా కూలీల్లారా. మీలో నేనొకడ్ని. మనం ముందుగా పోరాటం చేయాల్సింది బానిసత్వం నుంచి విముక్తి కోసం…ఎందుకంటే లాభాల్లో వాటా మన కూలీలకు ఇవ్వరుగా..??! కూలీలకు కూలీ మాత్రమే గిడుతుంది. ఎంత కొట్టుకున్న ఉపయోగం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు, శకుని. వైస్సార్సీపీ జగన్ గారు అధికారంలోకి వచ్చి అయన ఆశీస్సులతో నేను కేంద్రంలో మంత్రినయితే చట్టసవరణ చేసి కార్మికులను/కూలీలను లాభాల్లో భాగస్వాముల్ని చేస్తూ లాభాల్లో 10% వాటా ఇస్తూ, దాన్ని తప్పనిసరి చేస్తూ, దానిపై పన్ను మినహాయింపు చేస్తాం.”
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆదివారం చేసిన ట్వీట్ ఇది. ఆ ట్వీట్ లో ఎవరికి ఏం అర్ధమైందో తెలియదు గాని విజయసాయి గురించి అవగాహన ఉన్న వాళ్లకు ఒక విషయం క్లియర్ కట్ గా అర్ధమైంది. “జగన్ గారు అధికారంలోకి వచ్చి అయన ఆశీస్సులతో నేను కేంద్రంలో మంత్రినయితే” ఈ లైన్ వెనుక చాలానే అర్ధం ఉండి ఉండవచ్చు. ఆ లైన్ ను ఇంకోరకంగా రాయవచ్చు. వైసీపీ అధికారంలోకి వస్తే కేంద్రాన్ని డిమాండ్ చేసి మీకు లాభాల్లో పది శాతం వాటా ఇప్పిస్తా అని చేసి ఉండవచ్చు. కానీ నేను కేంద్ర మంత్రి అయితే అని ట్వీట్ చేసారు.
ఇది కచ్చితంగా సాదా సీదా లైన్ అయితే కాదు. కచ్చితంగా జగన్ పై ఆస్తుల కోసం పోరాటం చేస్తున్న షర్మిలకు పక్కా వార్నింగ్ అనే టాక్ వినపడుతోంది. అర్ధం కాలేదా…? బీజేపి ఇప్పుడు టీడీపీకి దూరమయ్యే ఛాన్స్ లేదు. జగన్ నిలబడాలి అంటే ఢిల్లీలో జాతీయ పార్టీ మద్దతు కావాలి. వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందా రాదా అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. కాని షర్మిల అడ్డం పడుతున్నారు.
తెలంగాణా, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో కూడా ఇండియా కూటమి అధికారంలో ఉంది. జగన్ కు ఇప్పుడు సౌత్ లో అనుకూల వాతావరణం కచ్చితంగా లేదు. జగన్ కు కాంగ్రెస్ కు దగ్గర కావడం మినహా మరొక ఆప్షన్ లేదు. అందుకే ఇప్పుడు షర్మిల కూడా పట్టుదలగా ఉండి… జగన్ ను కాంగ్రెస్ కు దగ్గర కానీయడం లేదు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నారు. ఆయన నుంచి కూడా జగన్ కు తలనొప్పి ఉండవచ్చు. అందుకే జగన్ జాతీయ స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పదే పదే బెంగళూరు వెళ్ళే జగన్… అక్కడి నుంచే కాంగ్రెస్ అధిష్టానానికి గాలం వేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ తో పొత్తు కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి దాదాపుగా ఫలించే దిశగానే వెళ్తున్నాయి. అందుకే ఇప్పుడు విజయసాయి తాను కేంద్ర మంత్రి అనే మాట మాట్లాడారు. వైసీపీ, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే… కచ్చితంగా విజయసాయి కేంద్రంలో కీలక పదవిలో ఉండే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు షర్మిలకు ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు అనే టాక్ వినపడుతోంది. నీ సపోర్ట్ లేకపోయినా కాంగ్రెస్ కు దగ్గరవుతున్నాం అనే సిగ్నల్స్ ఇచ్చినట్టే ఆ ట్వీట్ ఉంది అంటున్నాయి రాజకీయ వర్గాలు.