Chiranjeevi: చిరంజీవిని ట్వీట్‌తో కొట్టిన విజయసాయి
సినిమాను అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదని.. వీలైతే సహకరించాలి అంటూ చిరు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇక అటు ఎంపీ విజయసాయి కూడా చిరును టార్గెట్ చేశారు. సినిమారంగం ఆకాశం నుంచి ఊడిపడిందా అంటూ చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Chiraneevi: చిరు మాటల ప్రకంపనలు ఏపీ రాజకీయాల్లో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సినిమాను అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదని.. వీలైతే సహకరించాలి అంటూ చిరు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇక అటు ఎంపీ విజయసాయి కూడా చిరును టార్గెట్ చేశారు. సినిమారంగం ఆకాశం నుంచి ఊడిపడిందా అంటూ చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జనాలు ఆదరిస్తేనే ఏ రంగానికైనా మనుగడ ఉంటుందని అన్నారు.
ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకూ ప్రభుత్వాలే రక్షణ.. మీకెందుకు, మాకెందుకు అంటే కుదరదు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు విజయసాయి. మా తిప్పలు మేము పడతాం.. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు చేస్తున్నాం.. దాని వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. సినిమా అనేది రాజకీయాలతో పోల్చుకుంటే చాలా చిన్నది అంటూ చిరు చేసిన వ్యాఖ్యలు విజయసాయికి కోపం తెప్పించాయి. సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదని, ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా జనాలు ఆదరిస్తేనే మనుగడ అంటూ కౌంటర్ ఇచ్చారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత ప్రభుత్వానిది. వాళ్ళూ మనుషులే.. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. అందరి యోగక్షేమాలు పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందంటూ కౌంటర్ ఇచ్చారు.
సినీ కార్మికుల కష్టాలపై రాజ్యసభలో గతంలో మాట్లాడారు ఎంపీ విజయసాయి. కార్మికులకు తగిన ఫలితం అందడం లేందంటూ సినిమాటోగ్రాఫ్ బిల్లును లేవనెత్తారు. చలన చిత్ర రంగంలో హీరోలకు చెల్లించే పారితోషికాలు కోట్లలో ఉంటే.. చిత్ర నిర్మాణం కోసం వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల వేతనాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయని చెప్పారు. దీనికి కౌంటర్‌గా వాల్తేరు వీరయ్య 200 డేస్ పంక్షన్‌లో చిరంజీవి మాట్లాడారు. ఇప్పుడు చిరుకు కౌంటర్ ఇస్తూ విజయసాయి ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం ఇంకెన్ని మలుపు తిరుగుతుందోననే ఆసక్తి కనిపిస్తోంది.