షర్మిల వైఎస్ కూతురుగానా లేక… విజయసాయి సంచలన కామెంట్స్
ఆస్తి పంపకాల విషయంలో వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ షర్మిలకు విజయసాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు. షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా అంటూ మండిపడ్డారు.

ఆస్తి పంపకాల విషయంలో వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ షర్మిలకు విజయసాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు. షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా అంటూ మండిపడ్డారు. 95శాతం షర్మిల ప్రెస్ మీట్లు జగన్ను తిట్టడానికి పెట్టినవే అన్నారు. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసమే జగన్ పై షర్మిల పోరాటం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ మరణానికి కారణమైన కాంగ్రెస్, చంద్రబాబుతో షర్మిల చేతులు కలపటం బాధాకరం అని మండిపడ్డారు.
తండ్రి మరణానికి చంద్రబాబు కారణమని గతంలో అనేకసార్లు షర్మిల చెప్పలేదా? అని నిలదీశారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోకూడదని షర్మిల భావిస్తున్నారన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు.. కానీ జగన్ మళ్ళీ సీఎం కావొద్దని షర్మిల కంకణం కట్టుకుందని… శత్రవులకు మేలు చేయటం కోసం.. సొంత అన్నకు అన్యాయం చేసే వాళ్ళని ఎవర్నీ చూడలేదు అని ఆయన ఆరోపించారు. వైఎస్ చనిపోవడానికి కారకులు ఎవరో గుండెపై చేయి వేసుకుని షర్మిల చెప్పాలి అని డిమాండ్ చేసారు.
చంద్రబాబు అజెండాను షర్మిల అమలు చేస్తున్నారన్నారు. శంకర్రావు, ఎర్రన్నాయుడు, అశోకగజపతిరాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డిని ఉపయోగించి చంద్రబాబు జగన్ను జైలుకు పంపారని ఆమె మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షురాలిగా.. వైఎస్ తనయగానా? జగన్ చెల్లిగా మాట్లాడుతున్నారో షర్మిల చెప్పాలి అని డిమాండ్ చేసారు. కాంగ్రెస్ కోసమా? చంద్రబాబు కోసం పనిచేస్తున్నారా? షర్మిల చెప్పాలి అన్నారు విజయసాయి. లక్షల మంది అక్కచెల్లెళ్ళకు.. తన హాయాంలో జగన్ మేలు చేశాడు అని జగన్ మోచేతి నీళ్ళు తాగి లబ్ధి పొందానని షర్మిల నా పేరు వాడినందునే స్పందిస్తున్నానన్నారు విజయసాయి.