Vijayashanti: కేసీఆర్‌‌పై కమలదళం విజయాస్త్రం..! పోటీకి రాములమ్మ సై..!

అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటం, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీకి దిగుతుండటాన్ని విజయశాంతి అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. గెలుపును పక్కన పెట్టేసినా కామారెడ్డిలో కేసీఆర్‌కు పోటీ ఇవ్వాలంటే.. ఒక స్ధాయి ఉన్న నేత కావాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 25, 2023 | 06:31 PMLast Updated on: Aug 25, 2023 | 6:31 PM

Vijayashanti Will Contest Opposite To Cm Kcr In Kamareddy

Vijayashanti: ప్రత్యర్థులను పదునైన వాగ్బాణాలతో కడిగి పారేయగల విజయశాంతి నెక్స్ట్ స్టెప్ ఏమిటి..? వచ్చే అసెంబ్లీ పోల్స్‌లో రాములమ్మ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు..? అనే దానిపై ఇప్పుడు అంతటా హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఆమెను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలనే దానిపై బీజేపీ సైతం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్లా పోటీ చేస్తున్నందున.. ఈ రెండింటిలో ఏదో ఒకచోటు నుంచి రాములమ్మను బరిలోకి దింపితే టైట్ ఫైట్ ఇవ్వొచ్చని కమలదళం భావిస్తోందట. కామారెడ్డి అయితే.. విజయశాంతిని పోటీకి నిలిపేందుకు కరెక్ట్ ప్లేస్ అని బీజేపీ సీనియర్ నేతలు అనుకుంటున్నారట. విజయశాంతి రాజకీయ నేపథ్యంలోకి వెళితే.. ఆమె తొలుత బీజేపీలో చేరి, ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. అనంతరం తన పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేసి, మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి.. మెదక్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె మళ్లీ బీజేపీలో ఉన్నారు.

రాబోయే ఎన్నికల్లో తాను నిజామాబాద్ జిల్లా కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయటానికి రెడీగా ఉన్నానని తెలుపుతూ బీజేపీ అగ్రనేతలకు విజయశాంతి లెటర్ రాసినట్టు తెలుస్తోంది. ఇంతకీ రాములమ్మకు కామారెడ్డి నియోజకవర్గంలో పోటీచేయాలనే పట్టుదల ఎందుకు..? అంటే.. అక్కడ పోటీచేస్తున్నది కేసీఆర్ కాబట్టే. వాస్తవానికి విజయశాంతి చాలాకాలంగా బీజేపీలో యాక్టివ్‌గా లేరు. తనకు పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వటంలేదన్న అసంతృప్తితో ఆమె ఉన్నారు. ఇలాంటి సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటం, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీకి దిగుతుండటాన్ని విజయశాంతి అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. గెలుపును పక్కన పెట్టేసినా కామారెడ్డిలో కేసీఆర్‌కు పోటీ ఇవ్వాలంటే.. ఒక స్ధాయి ఉన్న నేత కావాలి. అందుకనే విజయశాంతి అక్కడి నుంచి పోటీకి రెడీ అవుతున్నారని చెబుతున్నారు.

కామారెడ్డి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఏర్పడింది. ఇటీవలి కాలంలో బీఆర్‌ఎస్‌లోని సెకండ్‌ క్యాడర్‌ నాయకులు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉండడం, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు సహకరించరనే ప్రచారం జరిగింది. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్‌ సైతం గంప గోవర్ధన్‌తో పాటు పలువురు నేతలపై సర్వే చేయించినా ఓడిపోతారని తేలింది. కేసీఆర్‌ అక్కడ పోటీచేస్తే ఎలా ఉంటుందనే దానిపై సర్వే చేయించగా సానుకూల రిపోర్టు వచ్చింది. దీంతో కేసీఆర్‌ అక్కడి నుంచి కూడా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. ఇక కామారెడ్డి నుంచి కాంగ్రెస్ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ బరిలో నిల్వనున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో షబ్బీర్‌ అలీ ఓటమి పాలయ్యారు. ఈ విధంగా క్యాడర్ పరంగా బలంగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను తట్టుకొని విజయశాంతి పెద్దగా ఫలితం సాధించలేరని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.