జగన్‌కు విజయసాయి వెన్నుపోటు తప్పదా…? షర్మిల ముందుంచిన సాక్ష్యాలు ఏంటీ…?
మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం సెన్సేషన్ అయింది. పార్టీ అంతర్గత విభేదాలతో విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పకుండా అనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. జగన్ తో కంటే జగన్ పక్కన ఉన్న వారితో విజయసాయిరెడ్డికి
మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం సెన్సేషన్ అయింది. పార్టీ అంతర్గత విభేదాలతో విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పకుండా అనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. జగన్ తో కంటే జగన్ పక్కన ఉన్న వారితో విజయసాయిరెడ్డికి ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయని పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా వాళ్లే తనను ఇబ్బంది పెట్టారని కోపం విజయసాయిలో బాగా ఉందని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఇక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత విజయసాయిరెడ్డి వ్యవసాయం చేస్తానంటూ ప్రకటించి కొంత భూమి కూడా కొన్నారని నెల్లూరు తమిళనాడు సరిహద్దుల్లో దాదాపు 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం మొదలుపెట్టారని రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది.
ఇక ఇదిలా ఉంటే వైయస్ కుటుంబానికి విజయ సాయి రెడ్డికి ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. వైయస్ కుటుంబ ఆస్తి వ్యవహారాలకు సంబంధించి విజయసాయిరెడ్డి ముందు నుంచి ప్రతి వ్యవహారాన్ని చక్కబెడుతూ ఉంటారు. ఆ తర్వాత జగన్ రాజకీయాల్లో కూడా విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి కీలక పాత్ర అప్పగించారు. ఇక జగన్కు ఎక్కువగా దగ్గరైన విజయసాయిరెడ్డి ఆ తర్వాత వైఎస్ షర్మిల తో దూరం పాటించారు. జగన్ తో షర్మిల విభేదించిన సమయంలో విజయసాయిరెడ్డి పై కూడా ఆమె ఆరోపణలు చేశారు. ఆస్తి పంపకాల విషయంలో విజయ్ సాయి రెడ్డి న్యాయం చేయాలని అప్పట్లో వైయస్ విజయమ్మ కూడా ఒక లేఖ రాశారు.
విజయసాయి రెడ్డికి ప్రతి విషయం తెలుసని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఇక విజయ సాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత వైఎస్ షర్మిల కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టే నైజం విజయసాయిరెడ్డిదని అలాంటి వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకోవడం నమ్మశక్యంగా లేదన్నారు. ఇక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రెండు రోజుల క్రితం వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైయస్ జగన్కు పంపించారు విజయసాయిరెడ్డి.
అయితే వైసీపీకి రాజీనామా చేసే ముందు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ షర్మిలతో భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. విజయసాయిరెడ్డి తో షర్మిల రెండు రోజుల క్రితం లోటస్పాండ్ లో భేటీ అయ్యారట. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా ప్రముఖ మీడియా పత్రికల్లో దీని గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే జగన్తో ఉన్న విభేదాల కారణంగానే విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేయడంతో షర్మిల ఆయనతో మాట్లాడాలనుకున్నారని జరిగిన విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆస్తి పంపకాలకు సంబంధించి తన వాటా గురించి వైయస్ షర్మిల విజయసాయిరెడ్డి తో మాట్లాడినట్లుగా కూడా సమాచారం.
ముఖ్యంగా సరస్వతి సంస్థల గురించి వీళ్లిద్దరి మధ్య చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే సాక్షి ఛానల్ లో వైఎస్ షర్మిలకు ఉన్న వాటాలు విషయంలో కూడా విజయసాయిరెడ్డికి వైయస్ షర్మిలకు మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే బెంగళూరు కడపలో ఉన్న కొన్ని ఆస్తులకు సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రస్తావన వచ్చిందట. అదేవిధంగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన సమయంలో.. వైయస్ షర్మిల వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డిని అలాగే వైయస్ జగన్ ను విజయసాయిరెడ్డి కాపాడడానికి చాలా కష్టపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయని మీడియా వర్గాలు అంటున్నాయి. అలాగే వైయస్ కుటుంబానికి తమ ఇద్దరిని దూరం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కూడా ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. 2019 తర్వాత కొన్ని కీలక పరిణామాలు వైసీపీలో చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో వైఎస్ కుటుంబంలో కూడా విభేదాలు బయటపడ్డాయి. షర్మిలను పార్టీకి దూరం చేసే విషయంలో కొంతమంది కీలకంగా వ్యవహరించారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆస్తి పంపకాల విషయంలో తనకు జగన్ అన్యాయం చేయడం పట్ల షర్మిల పట్టుదలగానే ఉన్నారు. అయితే జగన్ కున్న ఆస్తులకు సంబంధించి త్వరలోనే వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2004 తర్వాత కొనుగోలు చేసిన ఆస్తులు ఏర్పాటుచేసిన వ్యాపారాల విషయంలో షర్మిల చాలా పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. వాటికి సంబంధించి విజయసాయిరెడ్డి ప్రత్యక్షంగా సాక్షిగా ఉన్నారు. అందుకే ఈ సమయంలో విజయసాయిరెడ్డి మద్దతు కోసం షర్మిల ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ భేటీలో వైయస్ సునీత కూడా పాల్గొన్నట్లు సమాచారం.