Vivek Venkata Swamy : బీజేపీకి V6 అధినేత రాజీనామా.. కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి

బీజేపీ మాజీ ఎంపీ V6 అధినేత వివేక్ వెంకటస్వామి బీజేపీ పార్టీకి రాజీనామా.. ఇక చెన్నూరు నుంచి వివేక్ కుమారుడు వంశీ ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దింపి తాను తిరిగి మళ్లీ ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ మాత్రం చెన్నూర్ నుంచి వివేక్ ను పోటీ దించాలని.. పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కుమారుడు వంశీ కి ఎంపీ టికెట్ ఇస్తామనట్లు సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 1, 2023 | 12:38 PMLast Updated on: Nov 01, 2023 | 12:39 PM

Vivek Venkata Swamy Who Joined The Congress Resigned As The V6 Head Of The Bjp

తెలంగాణ బీజేపీకి భారీ షాక్ ..  బీజేపీ మాజీ ఎంపీ V6 అధినేత వివేక్ వెంకటస్వామి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ పార్టీ సభ్యత్వానికి, పార్టీ మేనిఫెస్టో కమిటీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రిజైన్ లేఖ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఇక తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని సందిగ్ధంలో ఉండగా.. తాజాగా హైదరాబాద్ లోని నోవా హోటల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ భేటి అయ్యారు. రేవంత్ రెడ్డి వివేక్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించారు. ఇక చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల భరిలో దిగనున్నట్లు వార్తులు వస్తున్నాయి. వివేక్ ప్రతిపాదనను కాంగ్రెస్ కూడా చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు సమాచారం నిజానికి చెన్నూరు టికెట్ కాంగ్రెస్ తో పొత్తు లో ఉన్న సిపిఐ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నప్పట్టికి వివేక్ చేరికతో సిపిఐ కు ఇవ్వడానికి సుముకంగా లేదు అని కాంగ్రెస్ భావిస్తుంది.

ఇక చెన్నూరు నుంచి వివేక్ కుమారుడు వంశీ ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దింపి తాను తిరిగి మళ్లీ ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ మాత్రం చెన్నూర్ నుంచి వివేక్ ను పోటీ దించాలని.. పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కుమారుడు వంశీ కి ఎంపీ టికెట్ ఇస్తామనట్లు సమాచారం.

వివేక్ గత రాజకీయ ప్రస్థానం..

కాంగ్రెస్ పార్టీ నుంచి 2009 లో వివేక్ పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు వివేక్. ఆ తర్వాత మళ్లి బీఆర్ఎస్ లోకి చేరి .. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి నిన్నటి వరకు బీజేపీలో కొనసాగుతు వచ్చారు. వివేక్ పార్టీ మార్పులు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు కొట్టి పారేసారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు వివేక్ బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చారు.

బీజేపీకి, బీజేపీ కార్యకర్తలకు వరుస షాక్..

బీజేపీలో వరుస మార్పుతో కార్యకర్తలే కాకుండా బీజేపీ ముఖ్య నేతలు కూడా చాలా అసత్పంతితో ఉన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ లో చేరినప్పటి నుంచి బీజేపీలో చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించాలని కొందరు పార్టీ నేతలు బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయగా.. ఆ దిశగానే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించడం.. దీంతో బీజేపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవ్వడం బీజేపీ గ్రాఫ్ దెబ్బతీసింది. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామ చేసి మళ్లి సోంత గుడికి వెల్లడం.. ఇదే తరహాలో తాజాగా వివేక్ వెంకట స్వామి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఇల పార్టీకి చాలా డ్యామెజ్ జరుగుతూనే వస్తుంది. ఇంత వరకు బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ కూడా విడుదల కాకపోవడం ఇలా నేతలు పార్టీని వీడటం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీకి హ్యాండ్ ఇవ్వడం బీజేపీ పార్టీకి మరింత నష్టం చేకూరేలా ఉంది అంటు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

SURESH