రేవంత్ కు ప్రభాస్ భయపడ్డాడా…? వర్క్ మొదలెట్టిన రెబల్ స్టార్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను సినిమా వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు. తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఆరు నెలల నుంచి తీవ్రంగా కష్టపడుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను సినిమా వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు. తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఆరు నెలల నుంచి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో గాని రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే డ్రగ్స్ అనే న్యూస్ వస్తే చిన్న సమాచారం వచ్చినా సరే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు.
అలాగే గంజాయి ఇతర మత్తు పదార్థాల విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ఉండటంతో వీటికోసం ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు గాలింపు చేపడుతున్నాయి. ఇదే సమయంలో ఇటీవల సినిమా వాళ్ళ ద్వారా కూడా డ్రగ్స్ రహిత ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టి ఆలోచన చేశారు. ఇటీవల కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన సమావేశంలో సినిమా వాళ్లు డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా మార్చేందుకు ప్రచారం చేయాలంటూ ముఖ్యమంత్రి కోరడంతో ఇప్పుడు ఒక్కొక్కరు రంగంలోకి దిగి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం మొదలుపెట్టారు.
అడివి శేషు అలాగే ప్రభాస్ సహా మరి కొంత మంది నటులు ఈ మేరకు వీడియోలు విడుదల చేస్తున్నారు. డ్రగ్స్ కి దూరంగా ఉండాలంటూ ప్రజలకు సందేశాలు ఇవ్వటం మొదలుపెట్టారు. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న హీరోలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని బుట్టలో వేసుకునేందుకు… కాస్త తీవ్రంగానే కష్టపడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి వారం రోజులు కూడా గడవకముందే ప్రభాస్ సహా మరి కొంతమంది డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అసలు సినిమా వాళ్ళ నుంచే రాష్ట్రంలోకి డ్రగ్స్ వస్తున్నాయి అని ఆరోపణలు ఉన్నాయి. మరి ఇతరులను సినిమా వాళ్ళ ప్రచారాన్ని సామాన్య ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు అనేది చూడాలి.