Top story :మండలి చైర్మన్ పై అవిశ్వాసానికి రెడీ, రాజీనామాలు ఆమోదించకపోతే తాడోపేడు తేల్చుకుందాం…..

వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ నంబర్ 5కి చేరింది. పార్టీకి, పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్‌ మోషేనురాజును కలిసి రాజీనామా పత్రాని అందజేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2025 | 04:55 PMLast Updated on: Mar 22, 2025 | 4:55 PM

We Are Ready To Vote No Confidence In The Council Chairman And If The Resignations Are Not Accepted We Will Decide The Fate

వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ నంబర్ 5కి చేరింది. పార్టీకి, పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్‌ మోషేనురాజును కలిసి రాజీనామా పత్రాని అందజేశారు. ఆయన పదవీకాలం 2029 వరకు ఉంది. వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి ఇప్పటికే కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, జయ మంగళం రాజీనామాలు చేశారు. కానీ వాళ్ల రాజీనామాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి.

మర్రి రాజశేఖర్ రాజీనామాతో మొత్తం ఎమ్మెల్సీల రాజీనామాలు ఐదుకు చేరాయి. ఈ సంఖ్య 10 దాటవచ్చని వదంతులు వినిపిస్తున్నాయి. రాజీనామా చేసిన ఈ ఐదుగురు ప్రస్తుతం టీడీపీతో టచ్‌లో ఉన్నారు. జై మంగళం వెంకటరమణ పదవిని జనసేన నేత బాలినేని కి ఇవ్వాలని కూడా డిసైడ్ అయిపోయింది. కానీ మోషన్ రాజు ఈ రాజీనామాలు ఆమోదించకపోవడంతో అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో మండలి చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో అధికారపార్టీ ఉందని సమాచారం. ప్రస్తుతం మండలి సభ్యులు 58 మంది. అవిశ్వాస తీర్మానం పెడితే కావలసిన నెంబర్ 30. ఒకవేళ ఈ ఐదుగురు రాజీనామాలు ఆమోదిస్తే 53 మందితోనే అవిశ్వాసం పెట్టాలి. అప్పుడు కూటమి నెగ్గాలి అంటే 28 మంది అవసరం. అందుకే రాజీనామాల ఆమోదాన్ని ఎంతవీలైతే అన్నిరోజులు పెండింగ్‌లో ఉంచడానికే మండలి చైర్మన్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. రాజీనామాలకు ఆమోదం తెలుపుతూ పోతే టీడీపీ బలం ఆటోమేటిగ్గా పెరుగుతుంది. ఆ ఛాన్స్ ఎందుకివ్వాలనే ఉద్దేశంతో పెండింగులో పెట్టారు మండలి చైర్మన్.

సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటేనే ఓ రేంజ్ లో వాడి వేడిగా చర్చలు ఉంటాయి ..కానీ ఏపీ శాసనసభలో ప్రతిపక్ష వైసిపికి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 11 మంది కూడా సభ కు రావటం మానేశారు…ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని డిమాండ్ చేస్తున్నారు. ఇక శాసనసభలో ఉన్నదంతా కూటమి సభ్యులే. దీంతో అసెంబ్లీలో వాడి వేడి చర్చలు లేకుండా పోయాయి ..కానీ శాసన మండలి మాత్రం ప్రతిపక్షంలో వైసిపి ఉండటంతో రక్తి కట్టింది. బడ్జెట్ చర్చల్లో వైసిపి డామినేషన్ ఎక్కువగా కనపడింది. అందుకే మండలిలో వైసిపి బలం తగ్గించి, చాటాలని ఆలోచనలో టిడిపి ఉంది. ఎంతమందిని వీలైతే
అంతమంది ఎమ్మెల్సీలను ,

శాసనమండలి బలాబలాలు ఒకసారి పరిశీలిస్తే శాసనమండలి లో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు.. అందులో 20 మంది ఎమ్మెల్యే కోటలో ..మరో 20 మంది స్థానిక సంస్థల కోటా లో ఎన్నికవుతారు. ఐదుగురు టీచర్లు, ఐదుగురు గ్రాడ్యుయేట్ కోటా లో ఉంటారు… మిగిలిన ఎనిమిది మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు…

ఒకవేళ శాసనమండలిలో మండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే సగం మంది సభ్యుల కన్నా ఒకటి ఎక్కువ ఉండాలి… అంటే 58 లో సగం 29 దీనికి ఒకటిఆదనంగా ఉండాలి… 30 మంది సభ్యులు ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది..ప్రస్తుతం మండలి బలాబలాలు చూస్తే వైసీపి కి 43 ఉన్నాయి…వీరిలో ఐదుగురు రాజీనామా చేశారు ..ఇంకా ఆమోదం పొందలేదు…. 36 మంది వైసీపీ సభ్యులకు ముగ్గురు టీచర్ ఎమ్మెల్సీల మద్దతు ఉంది…దీంతో రాజీనామా చేసిన ఐదుగురిని మినహాయిస్తే వైసిపి కి 38 మంది ఉంటారు..ఇక కూటమి లో టీడీపీ కి 10 జనసేన రెండు ఉన్నాయి. అప్పుడు వైసీపీ కి రాజీనామా చేసిన ఐదుగురితో కలిసి. 43. టీడీపీ కి 10 జనసేన 2 బీజేపీ 1 ఇద్దరు ఇండిపెండేట్ లు ఉంటారు. .

ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం పెట్టినా నెగ్గే పరిస్థితి వైసీపీకి ఉంది.. కానీ కూటమి విషయంలో కూడా ఈ బలాబలాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. వైసీపీ కి రాజీనామా చేసిన ఐదుగురు. కూటమి వైపు వస్తే కూటమి బలం 20 అవుతుంది.. ఇంకో 10 మంది అవసరం ఉంటుంది..ఒక వేళ ఐదుగురు ఎమ్మెల్సీ సభ్యుల రాజీనామా ఆమోదం పొందితే. 53 సభ్యుల తోనే మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలి.. అప్పుడు 26 మంది అవసరం అవుతారు……ఎటు చూసినా ఒక పది మంది సభ్యులు కూటమికి అవసరం…ఇప్పటికే మండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖనం టీడీపీ తో టచ్ లో ఉన్నారు.. మరి కొందరు ఎమ్మెల్సీలు కుడి టీడీపీ తో చర్చల్లో ఉన్నట్టు సమాచారం…

మరి ఇలాంటి పరిస్థితి లో కూటమి ,మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెడుతుందా అనే చర్చ జరుగుతోంది.. దీంతో ఓటు మండలి చైర్మన్ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కనుక అనవసర ఇబ్బందులు వస్తాయా అనే ఆలోచన కూడా కూటమి లో ఉన్నట్టు తెలుస్తోంది.. మరి మండలి ఇలా మాటలతో మండుతుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.