రఘురామ అరుపులు విన్నాం: రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణమ రాజును కస్టడీలో వేధించిన కేసులో అప్పటి సిఐడీ అధికారి విజయ్ పాల్ కు కోర్ట్ రిమాండ్ విధించింది. ఇక రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2024 | 08:46 PMLast Updated on: Nov 27, 2024 | 8:46 PM

We Heard Raghuramas Screams Sensational Things In The Remand Report

ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణమ రాజును కస్టడీలో వేధించిన కేసులో అప్పటి సిఐడీ అధికారి విజయ్ పాల్ కు కోర్ట్ రిమాండ్ విధించింది. ఇక రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. రఘురామకృష్ణరాజు అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదంటూ రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. ఆర్ఆర్ఆర్ అరెస్టు సమయంలో ఉన్న కుటుంబ సభ్యులను దర్యాప్తులో భాగంగా విచారించామన్నారు. విజయ్ పాల్ దురుసుగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.

కస్టడి సమయంలో ఉన్న పోలీసులు వాంగ్మూలం రికార్డ్ చేసిన అధికారులు… అరుపులు, కేకలు విన్నట్లు నాటి సిఐడి కానిస్టేబుల్స్ చెప్పారని రిపోర్ట్ లో ప్రస్తావించారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్… కస్టడీ సమయంలో జరిగిన విషయాలను బయటకు వెల్లడించవద్దని హెచ్చరించారని పేర్కొన్నారు. ముఖానికి కర్చీఫ్ లు కట్టుకొని నలుగురు వచ్చినట్లు సిఐడి సిబ్బంది తెలిపారాట. జిజిహెచ్ వైద్యులపై ఒత్తిడి తెచ్చి రిపోర్ట్ తయారు చేసినట్లు చెప్పిన వైద్యులు… ఆర్మి వైద్యశాల ఇచ్చిన రిపోర్ట్ లో ఆర్ఆర్ఆర్ కాళ్ళపై ప్రాక్చర్స్ ఉన్నాయని రిపోర్ట్ లో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారిగా విజయ్ పాల్ నిబంధనలు పాటించకపోవడమే కాకుండా తప్పుడు రిపొర్ట్ ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారని రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు.