CM Revanth Fire on KCR : నీ అంగీ ఊడబీకి పంపుతాం… ఏం పీకనీకి పోయినవ్ అంటవా ?:అసెంబ్లీలో రేవంత్ ఫైర్

నల్లగొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) మాట్లాడిన భాషపై మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). మేడిగడ్డకు (Medigadda Project) ఏం పీకనీకి పోయినవ్ అంటూ... కేసీఆర్ చేసిన కామెంట్స్ పై అసెంబ్లీలో ఫైర్ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2024 | 01:05 PMLast Updated on: Feb 14, 2024 | 1:52 PM

We Will Send Your Cloak To Udabi What Do You Mean Revanth Fire In Assembly

 

 

 

నల్లగొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) మాట్లాడిన భాషపై మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). మేడిగడ్డకు (Medigadda Project) ఏం పీకనీకి పోయినవ్ అంటూ… కేసీఆర్ చేసిన కామెంట్స్ పై అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి (Telangana Assembly) రాకుండా ఎందుకు తప్పించుకుంటునావని ప్రశ్నించారు సీఎం. నన్ను చంపుతవా అని కేసీఆర్ అంటున్నడు… కేసీఆర్ అనే పాము సచ్చింది… సచ్చిన పామును మళ్ళీ చంపుతాడా ఎవడన్నా అన్నారు రేవంత్. మూడు రోజులుగా సభలో అన్ని విషయాలు చర్చించాలని అనుకున్నాం. మేడిగడ్డ వెళ్ళి వచ్చాక… చర్చ చేద్దాం అనుకున్నాం. కేసీఆర్ నిన్న సభలో ఏం మాట్లాడారు ? ఆయన భాష గురించి మాట్లాడదామా ? పీకనీకి పోయినవ్ అంటాడా… నీ ప్యాంట్ ని జనం ఊడబీకారు… మేం నీ అంగీని కూడా ఊడబీకి పంపుతామని అన్నారు సీఎం రేవంత్.

మేడిగడ్డలో నీళ్ళు నింపే పరిస్థితి ఉందా ? హరీష్ కి పెత్తనం ఇస్తాం… ఎలా నింపుతాడో నింపమనండి అని సవాల్ చేశారు సీఎం రేవంత్. నీళ్ళు నిలిచే పరిస్థితే లేకుండా ఉంది. సభకు రా రేపటి వరకూ చర్చిద్దాం… జైలుకు పోవాల్సి వస్తుందని కేసీఆర్ ను రేవంత్ హెచ్చరించారు. బయట సభలో మాట్లాడటం కాదు… అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. కాళేశ్వరం మీద లేదంటే మేడిగడ్డ మీద … దేనిమీద అయినా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు సీఎం రేవంత్.

అంతకుముందు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం నడిచింది. రాజ్ గోపాల్ కి మంత్రి పదవి రాదని బుధవారం కడియం అన్న కామెంట్స్ పై మాట్లాడారు రాజ్ గోపాల్ రెడ్డి. తాటికొండ రాజయ్యను దగా చేసి… ఆ సీటు కొట్టేసిన నువ్వా నా గురించి మాట్లాడేది… నాకు మంత్రి పదవి వస్తదో… రాదో గానీ… బీఆర్ఎస్ లో నువ్వు జన్మలో మంత్రివి కావని రాజ్ గోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. అలాగే మంత్రి పొన్నం మాట్లాడుతుంటే కేటీఆర్ (KTR) కూర్చోమని చెప్పడంపైనా మండిపడ్డారు. నీకు ఎంత అహంకారం కేటీఆర్… జనం ఓడగొట్టినా నీకు బుద్ధి రాలేదా అన్నారు రాజ్ గోపాల్ రెడ్డి (Raj Gopal Reddy).