Ambati : మరి ఆ సినిమాల సంగతేంటి.. అంబటి గారూ..!?
రియల్ లైఫ్ స్టోరీలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన వాళ్లు ఎవరూ ఉండరు. ఆయన తీసిన సినిమాలన్నీ పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ లాంటి వాళ్లను టార్గెట్ చేసినవే. వాళ్లను ఏ స్థాయిలో ఎండగట్టారో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయినా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ రామ్ గోపాల్ వర్మ జోలికి వెళ్లలేదు.
బ్రో సినిమాలో తనను కించపరిచేలా శ్యాంబాబు క్యారెక్టర్ డిజైన్ చేశారని మంత్రి అంబటి రాంబాబు ఫుల్ ఫైర్ లో ఉన్నారు. అందుకే తాను కూడా పవన్ కల్యాణ్ బయోపిక్ తీయబోతున్నట్టు ప్రకటించారు. అందుకోసం పలు సినిమాల పేర్లను కూడా ఆయన వెల్లడించారు. అంబటి అలా ప్రకటించారో లేదో.. జనసైనికులు కూడా రంగంలోకి దిగిపోయారు. తాము కూడా సినిమా తీస్తున్నట్టు చెప్పారు. వెంటనే సందులో సంబరాల శ్యాంబాబు – SSS టైటిల్ తో సినిమాకు క్లాప్ కొట్టేశారు. ఒక డ్యాన్స్ సన్నివేశాన్ని ముహూర్తపు షాట్ గా చిత్రీకరించారు. అంతేకాక.. పలు వెబ్ సిరీస్ లు కూడా చిత్రీకరించే ఆలోచనలో ఉన్నామంటూ పలు టైటిళ్లను మీడియా ముందు ప్రకటించారు జనసేన నేత పోతిన మహేశ్.
అంబటి రాంబాబు తేనె తుట్టెను కదిల్చారు. సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన ఒక క్యారెక్టర్ తనను పోలినట్లు ఉందనేది అంబటి రాంబాబు ఆరోపణ. తాను గతంలో సంక్రాంతి సందర్భంగా చేసిన ఓ డ్యాన్స్ ను అందులో వాడారని.. అలాగే తను వేసుకున్న టీషర్ట్ ను పోలిన టీషర్ట్ ధరించారని చెప్పారు. ఇవన్నీ సింక్ అవుతున్నాయి. అయితే ఇలాంటి రియల్ లైఫ్ క్యారెక్టర్లను సినిమాల్లో కొన్ని వందల సార్లు చూస్తుంటాం. హీరో రాజశేఖర్ ను ఇమిటేట్ చేసేవాళ్లు ఇప్పటికీ వందల మంది ఉన్నారు. అంతెందుకు.. వైస్సాఆర్, చంద్రబాబు, జగన్.. ఇలా ఎంతో మంది పొలిటీషియన్లను సినిమా వాళ్లు వాడేసుకుంటూ ఉంటారు.
అయినా రియల్ లైఫ్ స్టోరీలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన వాళ్లు ఎవరూ ఉండరు. ఆయన తీసిన సినిమాలన్నీ పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ లాంటి వాళ్లను టార్గెట్ చేసినవే. వాళ్లను ఏ స్థాయిలో ఎండగట్టారో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయినా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ రామ్ గోపాల్ వర్మ జోలికి వెళ్లలేదు. ఇప్పుడు అంబటి రాంబాబు మాత్రం తన క్యారెక్టర్ ను పోలి ఉందంటూ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్స్ ఇస్తున్నారు. మరి రామ్ గోపాల్ వర్మతో వైసీపీ నేతలే సినిమాలు తీయిస్తున్నారని.. వాటిలో తమ నేతలను కించపరిచినప్పుడు అంబటి రాంబాబు ఏమైపోయారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. మరి అంబటి రాంబాబు దగ్గర వీటికి సమాధానం ఉందా..?