లడ్డు కల్తీ కేసులో తేలేదేమిటి?

తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు ఉందంటూ, దాని కారణం వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన హడావుడి రాజకీయంగా వాళ్లకు ఉపయోగపడిందేమో తప్ప ఈ కేసులో చివరికి ఏది తేలదు .

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 27, 2024 | 09:12 PMLast Updated on: Sep 27, 2024 | 9:12 PM

What Can Be Found In The Laddu Adulteration Case

తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు ఉందంటూ, దాని కారణం వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన హడావుడి రాజకీయంగా వాళ్లకు ఉపయోగపడిందేమో తప్ప ఈ కేసులో చివరికి ఏది తేలదు . కేవలం జగన్ ని డామేజ్ చేయడానికి ఈ ఆరోపణలు ఉపయోగపడతాయి తప్ప ఫైనల్ గా ఫలితం ఏమీ ఉండదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి వేలు పెట్టారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై నీకు తేల్చాలని ఏకంగా సుప్రీంకోర్టుకు ఎక్కారు. సుప్రీంకోర్టు కేసుని ఆమోదిస్తే చంద్రబాబు పని అయిపోయినట్లే. సుబ్రహ్మణ్య స్వామి అల్లాటప్ప నాయకుడు కాదు. ఆర్థిక, న్యాయపరమైన అంశాలపై చాలా పట్టునవాడు. గతంలో తమిళనాడు మాజీ సీఎం జయ లలిత పై కేసులు వేసి, ఆమెను ముప్పు తిప్పలు పెట్టాడు సుబ్రహ్మణ్యస్వామి. చంద్రబాబు సర్కారు కనుక తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని, అది జనం తిన్నారని నిరూపించ లేకపోతే దేశం మొత్తం ఆయన అభాసపాలు కాక తప్పదు. సుబ్రహ్మణ్యస్వామి, విషయ పరిజ్ఞానం ఉన్నవాడు. ముక్కు సూటిగా పోతాడు. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశాడు అనే ఒక అవగాహన కొచ్చిన తర్వాతే సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం లో కేసు వేశాడు. ఇప్పుడు ఇది లాక్కోలేక పీక్కోలేక చంద్రబాబు కోర్టులో తన పలుకుబడి అంతా ఉపయోగించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ కేసులో తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని నిరూపించిన ఏ ఆర్ కంపెనీపై చర్య తీసుకుంటారే తప్ప, టీటీడీ బోర్డు సభ్యులపై కానీ, చైర్మన్ పై కానీ, అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై కానీ చర్యలు తీసుకోలేరు.2024 మార్చి లో తిరుమలలో నెయ్యికి టెండర్లు పిలిచారు. 2024 మే లో AR కంపెనీ కి టెండర్ ఇచ్చారు. జూన్ 12 న AR సప్లై ప్రారంబించింది. AR తో పాటు 5 కంపెనీలు నెయ్యి సప్లై చేశాయి. జూలై 17 న శాంపిల్ టెస్ట్ కి nddb కి పంపారు. జూలై 23 న నివేదిక వచ్చింది. అదే రోజు EO శ్యామల రావు ప్రెస్మీట్ పెట్టి నెయ్యి లో వెజిటబుల్ ఫ్యాట్ ( వనస్పతి) కలసినట్లు రిపోర్ట్ వచ్చిందని అందువల్ల కాంట్రాక్టర్ పై నిషేధం పెడుతున్నట్లు చెప్పారు. కానీ మిగిలిన నలుగురు ని కూడా రద్దు చేశారు. అంతేకాదు ప్రాథమికంగా చేసిన పరీక్షలో నెయ్యిలో క్వాలిటీ లేదని, కల్తీ జరిగిందని గుర్తించి నెయ్యి టాంకర్స్ ని వెనక్కి పంపించారు. ఆ నెయ్యితో తిరుమలలో లడ్డూలు చేయనే లేదు. కల్తీ నెయ్యి లడ్డూలు భక్తులు తిన్నారన్న ప్రశ్న తలెత్తలేదు.జూలై 23 న రిపోర్ట్ వస్తే చంద్రబాబు sep 18 న నెయ్యి లో జంతువుల కొవ్వు ఉన్నట్లు చెప్పారు. EO ఏమో వెజిటబుల్ ఫ్యాట్ అంటాడు. చంద్రబాబు అనిమల్ ఫ్యాట్ అంటాడు. ఏది నిజం?

కల్తీ నెయ్యి లడ్డూలకి వాడలేదు అని ఈవో చెప్తున్నారు. కాబట్టి భక్తులకు కల్తీ లడ్డులు సరఫరా చేయలేదనేది తేలిపోయింది.
సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ఒక దర్యాప్తు సంస్థకు, లేదా ఏజెన్సీకి అప్పగిస్తే ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ బయటకు వస్తాయి. ఏది ఎలా జరిగినా నీ సప్లై చేసిన సంస్థ పనే శరీరం ఉంటాయి కానీ, బోర్డు సభ్యులపై గాని ముఖ్యమంత్రి పై గానీ ఎటువంటి చర్యకు ఆస్కారం ఉండదు. ఇక
చర్యలు ఎవరిపై తీసుకుంటారు. ఎవర్రిపైన తీసుకోలేరు. మెటీరియల్ సప్లై, రిపోర్ట్ వచ్చింది చంద్రబాబు బాబు హయాం లోనే. అసలు ఈ కల్తీ వ్యవహారం మొత్తం జరిగిందంతా చంద్రబాబు సర్కార్ హయాం లో. మరి దీనికి ఎవరిపై చర్య తీసుకోగలుగుతారు. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ మొత్తం పొలిటికల్ గా టీడీపీ కి ఉపయోగపడుతుండే తప్పా ఇంకేం తేలదు. ఒకవేళ ఇదంతా ఎన్నికలకు ముందు జరిగి ఉంటే వైసిపి ఎన్నికల్లో మరింత డామేజ్ అయిపోయింది. ఇప్పుడు సాంకేతికంగా వైసిపి కి ఏ సంబంధం ఉండదు. రాజకీయంగా మాత్రం టిడిపి జగన్ని, అతని పార్టీ వైసీపీని డామేజ్ చేయగలిగింది.