అక్కడ అయితలే సార్‌.. నేనొచ్చేస్తా! కేసీఆర్‌తో మహిపాల్‌ భేటీలో ఏం జరిగిందంటే..

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు.. ఈసారి మరింత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయ్. ఇన్నాళ్లు సభకు దూరంగా ఉన్న కేసీఆర్.. చాలా రోజుల తర్వాత కనిపించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2025 | 09:15 PMLast Updated on: Mar 12, 2025 | 9:15 PM

What Happened In Mahipals Meeting With Kcr

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు.. ఈసారి మరింత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయ్. ఇన్నాళ్లు సభకు దూరంగా ఉన్న కేసీఆర్.. చాలా రోజుల తర్వాత కనిపించారు. ఆయన సభలో ఉన్నంతసేపు కాంగ్రెస్‌లో చాలామంది ఆయన్నే అలా చూస్తూ కనిపించారు. ఇక కేసీఆర్ ఒక్కరోజుకే పరిమితం అవుతారా.. సమావేశాలకు పూర్తిగా హాజరువుతారా అనే చర్చ సాగుతున్న టైమ్‌లోనే.. అసెంబ్లీ వేదికగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్‌ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కారుకు హ్యాండ్ ఇచ్చారు. అలా జంపింగ్ జపాంగ్ అన్న లిస్ట్‌లో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు.

కాంగ్రెస్‌లో అయితే చేరారు కానీ.. అక్కడ ఆయన అడ్జస్ట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య మహిపాల్‌ రెడ్డి వెళ్లి.. అసెంబ్లీలో కేసీఆర్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు గంట ముందే వచ్చిన కేసీఆర్.. ఆయన ఛాంబర్‌లో కూర్చున్న సమయంలో వెళ్లి కలిశారు మహిపాల్ రెడ్డి. కొంతకాలంగా మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. ఐతే కేసీఆర్‌ను కలవడానికి పొలికల్ రీజన్స్ ఏమీ లేదని మహిపాల్ అనుచరులు చెప్తున్నారు. తన తమ్ముడి కొడుకు పెళ్లికి ఆహ్వానించడం కోసమే కేసీఆర్‌ను కలిశారని చెప్తున్నారు. ఐతే రాజకీయ నాయకులు అడుగు తీసి అడుగు వేస్తే.. రాజకీయమే ఉంటుంది. అలాంటిది కేసీఆర్‌ను కలవడం వెనక అలాంటి రాజకీయమే ఉండి ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

కాంగ్రెస్ అడ్జస్ట్ కాలేకపోతున్నానని.. తిరిగి వచ్చేస్తానంటూ కేసీఆర్ ముందు ఆయన చెప్పారనే టాక్ కూడా నడుస్తోంది. ఇది నిజమా.. అబద్దామా అన్న సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌లో చేరాక మహిపాల్‌కు పటాన్‌చెరులో కష్టంగానే ఉంది. కాట శ్రీనివాస్ వర్గీయులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన ఆఫీస్‌లో కేసీఆర్ ఫోటో బరాబర్ పెట్టుకుంటానని గూడెం చెప్పిన మాటలు.. హస్తం పార్టీలో కొత్త చర్చకు దారి తీశాయ్. ఆఫీస్‌లో ఫొటో పెట్టుకుంటానని కాంగ్రెస్‌ వాళ్లకు మొహం మీద చెప్పిన గూడెం.. కేసీఆర్‌ను నార్మల్‌గా కలుస్తారా.. ఈ భేటీవెనక రాజకీయం లేకుండా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.