PAVAN MUDRAGADA  : ముద్రగడ జనసేన ఎంట్రీ లేనట్టే? పవన్ కాపు ముద్ర తప్పించుకున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల (Andhra Pradesh politics) కు దూరంగా, కాపు సామాజిక వర్గ అంశాలకే పరిమితమవుతూ వస్తున్న కాపునేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) త్వరలోనే జనసేనలో చేరతారని అందరు అనుకున్నారు. అందుకు నలుగురు... ఐదుగురు జనసేన నేతలు రాయబారం కూడా చేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ ముద్రగడ దగ్గరికి వెళ్లి స్వయంగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారని, ఆ తర్వాత ముద్రగడ జనసేనలో చేరుతారని ప్రచారం బాగా జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 17, 2024 | 01:16 PMLast Updated on: Feb 17, 2024 | 1:16 PM

What If Mudragada Janasena Has No Entry Has Pawan Kapu Escaped

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల (Andhra Pradesh politics) కు దూరంగా, కాపు సామాజిక వర్గ అంశాలకే పరిమితమవుతూ వస్తున్న కాపునేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) త్వరలోనే జనసేనలో చేరతారని అందరు అనుకున్నారు. అందుకు నలుగురు… ఐదుగురు జనసేన నేతలు రాయబారం కూడా చేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ ముద్రగడ దగ్గరికి వెళ్లి స్వయంగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారని, ఆ తర్వాత ముద్రగడ జనసేనలో చేరుతారని ప్రచారం బాగా జరిగింది. ప్రచారం జరిగినంత వేగంగా పవన్ కళ్యాణ్ ముద్రగడను కలవను లేదు, ముద్రగడ జనసేన (Janasena) లో చేరను లేదు. తనకు ఎంపీ టికెట్, కుమారుడు గిరికి పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్నారు. దాంతో ప్రస్తుతానికి ఆయన ఎంట్రీ అంశాన్ని జనసేన పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అసలు విషయం వేరు. ముద్రగడ జనసేనలో చేరితే ఆ పార్టీకి పూర్తిగా కాపు ముద్ర వచ్చేసినట్లే. అలా కాపు ముద్ర వేయించుకుంటే అసలకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో కోస్తా జిల్లాల్లో కాపులు అంటే వ్యతిరేకత లేకపోలేదు. వాళ్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో వాళ్లను వ్యతిరేకించే వాళ్ళూ అంతే ఎక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి, జనసేనకి కాపు ముద్రపడితే… వెంటనే ఎస్సీలు, బీసీలు దూరమైపోతారు. 2009లో పీఆర్పీ పోటీ చేసినప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. అధికారంలోకి వస్తే కాపుల ఆధిపత్యాన్ని భరించలేమనే భయంతో చాలా కులాలు PRPకు వ్యతిరేకంగా ఓట్లేశాయి. ప్రధానంగా ఎస్సీలు అడ్డం తిరిగిపోయారు. PRPకు వ్యతిరేకంగా ఓట్లేశారు. ఇప్పుడు జనసేన కూడా కాపు ముద్ర వేయించుకుంటే అదే ప్రమాదం మళ్లీ రావచ్చు. దీనికి తోడు చేగొండి హరి రామ జోగయ్య కాపుల తరపున పవన్ కళ్యాణ్ కి రోజుకో లేఖ రాసి… అన్ని సీట్లు అడుగు, ఇన్ని సీట్లు అడుగు… సీఎం కుర్చీ అడుగు… ఇలా రకరకాల డిమాండ్లతో పవన్ కి టెన్షన్ పుట్టిస్తున్నారు. రేపు ముద్రగడ చేరితే తనకు కులం టెన్షన్ ఇంకా ఎక్కువవుతుందని పవన్ భయపడుతున్నారు.

ఇక రెండో విషయం ముద్రగడ మహా మొండి. ఆయనతో వ్యవహారం మామూలుగా ఉండదు. ఆయన చెప్పింది జరగాల్సిందే. పార్టీలో చేరిన తర్వాత కాపులకు ఏమాత్రం ప్రాధాన్యం లేకపోయినా…ఆయన పవన్ కళ్యాణ్ కి చెమటలు పట్టిస్తారు. ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకుని కూర్చుని దీక్ష చేస్తారు. కొత్తగా అదో తలనొప్పిని పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నిటి కంటే ముఖ్యమైనది… జనసేనలో ఇప్పటివరకు ఒకటి నుంచి పది వరకు అన్నీ పవన్ మాత్రమే ఉన్నారు. అసలు సిసలైన ప్రాంతీయ పార్టీలాగే జనసేన నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫేస్ తప్ప… మరొకటి ఆ పార్టీలో కనిపించదు. నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్ నాయకుడు ఉన్నా ఏదో బ్యాగ్రౌండ్ వర్క్ చేయడానికి తప్ప మనోహర్ ఫేసు పార్టీ పనికిరాదు.

రేపు ముద్రగడ చేరితే పరిస్థితి అలా ఉండదు. ఆయనది కూడా దాదాపు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర. కొద్దో గొప్పో ఫేస్ వాల్యూ కూడా ఉన్న నేత. అలాంటి ముద్రగడ జనసేనలో చేరితే జనంలో తనపై అటెన్షన్ తగ్గే ప్రమాదం ఉందని కూడా పవన్ భయపడుతున్నారట. ఇప్పుడు అనవసరంగా పార్టీకి కులం టెన్షన్ ని తగిలించుకోవడమే అవుతుందని సేనాని ఆలోచన. దీనికి తోడు కుటుంబంలో తనకు ఎంపీ సీటు, కొడుక్కి ఎమ్మెల్యే సీటు ఇవ్వాల్సిందేనని ముద్రగడ పట్టుబట్టడంతో… ఇవన్నీ జరిగేవి కాదని జనసేన ముద్రగడ పైన ఆశలు వదులుకుంది. ఒక రకంగా మౌనంగా ఉండటం ద్వారా పార్టీకి ముద్రగడ అవసరం లేదని చెప్పేసింది. కులం పార్టీగా ముద్రయించుకోవడం కన్నా కొన్నాళ్లు ముద్రగడను దూరంగా ఉంచడమే మంచిదని పవన్ భావిస్తూ ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో ముద్రగడ జనసేనలో చేరనట్లే.