Former CM KCR : కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నారు?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారం కోల్పోయి దాదాపు నాలుగు వారాలు అయిపోయింది. 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉండి.. ఒక ప్రజాస్వామ్య దేశంలో రాజరికాన్ని అనుభవించాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన, పొగరుబోతు వ్యవహార శైలి భారతదేశంలోని మరే ముఖ్యమంత్రి అనుభవించలేనంత కేసీఆర్ అనుభవించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారం కోల్పోయి దాదాపు నాలుగు వారాలు అయిపోయింది. 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉండి.. ఒక ప్రజాస్వామ్య దేశంలో రాజరికాన్ని అనుభవించాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన, పొగరుబోతు వ్యవహార శైలి భారతదేశంలోని మరే ముఖ్యమంత్రి అనుభవించలేనంత కేసీఆర్ అనుభవించారు. కేవలం తెలంగాణ ప్రజల భావోద్వేగాలు మాత్రమే పెట్టుబడిగా కేసీఆర్ రాజకీయం నడిచింది. కెసిఆర్ అహంకారం ఏ స్థాయిలో ఉంటుందంటే ఓడిపోయిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజల్ని ప్రస్తావిస్తూ ఒక ముక్క కూడా మాట్లాడలేదు. నామ్ కే వాస్తేగా కేటీఆర్ వచ్చి తన అహంకార ధోరణిలోనే ప్రెస్ మీట్ నిర్వహించారు. కానీ BRSకు ఫేస్ కేసీఆర్ . ఆయన పేరు చెప్పుకొని TRS ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
అందుకే జనాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడితే బాగుండేది. కానీ ప్రజలకు తన అవసరం ఉంది తప్ప.. తనకు వాళ్ళతో పనేంటి అనేది మొదటి నుంచి కేసీఆర్ అభిప్రాయం. ఆయన ఇప్పటికీ అదే పంథా కొనసాగిస్తున్నారు. డిసెంబర్ మూడు నాటి ఫలితాల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లో కాలుజారి తుంటి వెముక విరగొట్టుకున్నారు. యశోదా హాస్పిటల్లో శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లో బంజరా హిల్స్ నందినగర్ లో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ ఎక్కువగా ఇప్పుడు ఎవర్నీ కలవట్లేదు. గతంలో ఆయన తా 90 వేల పుస్తకాలు చదివానని జనం చెవిలో పువ్వులు పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం వీలున్నప్పుడు పుస్తకాలు చదువుతున్నారు. చిన్నచిన్నగా అడుగులు వేస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ కేసీఆర్ తో ఎక్కువసేపు ఇంట్లోనే నడిపిస్తున్నారు. కేసీఆర్ సిగరెట్లు మానేసినా మందు మానలేదు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమైన వాళ్ళు మాత్రమే ఆయన్ని కలుస్తున్నారు. టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నట్లుగా లక్షల మంది జనం పరుగులు పెడుతూ కేసీఆర్ ను చూడ్డానికి రావట్లేదు.
ఆయన రోజు న్యూస్ పేపర్ చదువుతున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావు ఎప్పటిలాగే కేసీఆర్ కి అన్నీ అందిస్తున్నారు. రోజు విడిచి రోజు హరీష్ రావు ఆయన్ని కలిసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వివరిస్తున్నారు. టీవీలో న్యూస్ చూడ్డానికి మాత్రం కేసీఆర్ పెద్దగా ఇష్టపడటం లేదట. బహుశా టీవీలో రేవంత్ రెడ్డి ముఖం చూడ్డానికి మనసు అంగీకరించకపోయి ఉండొచ్చు. వీలున్నప్పుడల్లా లోక్ సభ ఎన్నికల గురించి ముఖ్య నాయకులతో ఆయన చర్చిస్తున్నారు. తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఈ చర్చల్లో ఒక ముఖ్యాంశం. అసెంబ్లీలో కూర్చుని కాంగ్రెస్ నాయకుల్ని ఫేస్ చేయడం కంటే లోక్ సభకు వెళ్ళిపోవడమే గౌరవంగా ఉంటుందని కెసిఆర్ అనుకుంటున్నారట. మొత్తం మీద కేసీఆర్ జీవితం నాలుగు గోడలకు పరిమితం అయిపోయింది. క్రమంగా జనం కూడా కేసీఆర్ ను మర్చిపోతున్నారు. లోక్ సభ ఎన్నికలు వస్తే తప్ప.. పబ్లిక్ కి కేసీఆర్ దర్శనం ఉండదు. ఇప్పుడు ప్రజలకి కేసీఆర్ అవసరం లేదు. ఆయనకే ప్రజల అవసరం ఉంది.