FTL, బఫర్‌ జోన్‌ అంటే ఏంటి? త్వరలో హైడ్రా కూల్చబోయేది ఈ ఇళ్లే!

హైడ్రా.. ప్రజెంట్‌ హైదరాబాద్‌లో రియల్టర్లను కబ్జాదారులను వణికిస్తున్న పేరు ఇది. కనికరం లేకుండా కట్టడాలు కూల్చేస్తున్న వాళ్ల స్పీడ్‌ చూసి బిగ్‌షాట్స్‌ కూడా కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కొత్తగా ఇళ్లు కొనాలి అనుకునేవాళ్లు.. ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2024 | 06:13 PMLast Updated on: Sep 25, 2024 | 6:57 PM

What Is Ftl Buffer Zone Hydra Will Soon Demolish These Houses

హైడ్రా.. ప్రజెంట్‌ హైదరాబాద్‌లో రియల్టర్లను కబ్జాదారులను వణికిస్తున్న పేరు ఇది. కనికరం లేకుండా కట్టడాలు కూల్చేస్తున్న వాళ్ల స్పీడ్‌ చూసి బిగ్‌షాట్స్‌ కూడా కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కొత్తగా ఇళ్లు కొనాలి అనుకునేవాళ్లు.. ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. లేక్‌ సైడ్‌లో ఇల్లు కొనేసుకున్నవాళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో.. ఇల్లు FTLలో పరిధిలో ఉందని ఎప్పుడు కూల్చేస్తారో తెలియని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వాళ్ల ఇళ్లు సేఫ్‌ జోన్‌లో ఉన్నాయా లేదా అని చేసుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ FTL లిమిట్స్‌లో తాము ఉన్నామా లేదా అనేది చాలా మంది భయం.

అసలు FTL, బఫర్‌ జోన్‌ అంటే ఏంటి. వాటిని ఎలా చెక్‌ చేసుకోవాలి అనేదే ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. ప్రాంతం ఏదైనా ప్రతీ చెరువుకు ఫుల్‌ ట్యాంక్‌ లిమిట్‌ ఉంటుంది. అంటే.. వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఆ చెరువులో నీళ్లు పూర్తి స్థాయిలో ఏ ప్రాంతం వరకు నిండుతాయో ఆ లిమిట్‌ను ఫుల్‌ ట్యాంక్‌ లిమిట్‌ అంటారు. అదే మనం మాట్లాడుకుంటున్న FTL. ఈ FTL పరిధిని ఆయా ప్రాంతంలోని రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తారు. ఇలా ప్రతీ చెరువుకు, కాలువలకు కూడా FTL పరిధి ఉంటుంది. ప్రతీ చెరువు ప్రాంతాన్ని మూడు భాగాలుగా డివైడ్‌ చేస్తారు. ఒకటి చెరువు శకం. ఇది పూర్తిగా చెరువు లోపలి ప్రాంతం. అది దాటిని తరువాత చెరువు విస్తీర్ణాన్ని బట్టి దాదాపు 50 మీటర్ల వరకూ FTLగా నిర్ణయిస్తారు. ఇది కాకుండా మరో 30 మీటర్ల విస్తీర్ణాన్ని చెరువు బఫర్‌ జోన్‌గా నిర్ణయిస్తారు. ఈ బఫర్‌ జోన్‌ దాటిన తరువాత ఉన్న భూమి సాధారణ భూమి.

ఇక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కేవలం చెరువులకే కాదు.. కాలువలకు కూడా FTL పరిధి ఉంటుంది. 10 మీటర్ల లోపు ఉన్న కాలువలకు 9 మీటర్ల మేర్ల FTLగా నిర్ణయిస్తారు. 10 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే కాలువలకు చెరువులతో సమానంగా 30 మీటర్ల మేర FTLగా నిర్ణయిస్తారు. చెరువు శిఖం, FTL, బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపట్టడం పూర్తిగా నిషేదం. లేక్‌ వ్యూ పేరుతో కొందరు ఇలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి నిర్మాణాలనే ఇప్పుడు హైడ్రా కూల్చేస్తోంది. మరి ఇలాంటి FTL, బఫర్‌ జోన్‌లో భూములను ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు అంటే.. ఆ భూముల్లో కేవలం నిర్మాణాలు మాత్రమే చేపట్టకూడదు. పంటలు వేసుకోవచ్చు. వ్యవసాయ భూములుగా పనిగణించి వాటిని రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తారు.

చాలా గ్రామాల్లో ఇలాంటి చెరువులను నీటితోనే చాలా మంది వ్యవసాయం చేసేవాళ్లు. కానీ ఇప్పుడు కొందరు రియల్టర్లు కాసుల కక్కుర్తితో FTL,బఫర్‌ జోన్‌లో కూడా నిర్మాణాలు చేస్తున్నారు. వీటివళ్ల చెరువులు నిండిన సమయంలో వరదలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం. ఒకప్పుడు లేక్‌ సిటీగా పేరున్న హైదరబాద్‌లో ఇప్పుడు లేక్స్‌ అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కాస్త వర్షానికే నగరంలో వరదలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితికి కారణం FTL, బఫర్‌ జోన్‌లను కబ్జాలు చేసి ఇళ్లు కట్టడమే. ఇప్పుడు వీటిని టార్గెట్‌ చేసే హైడ్రా తరువాతి కూల్చివేతలు చేపట్టబోతోంది.