అసలేం జరుగుతోంది…? “ఎన్టీఆర్ లెటర్.. లోకేష్ ఢిల్లీ టూర్”, మధ్యలో ప్రశాంత్ కిషోర్
నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో పెద్దగా ఎవరూ రాణించడం లేదు. ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణ అలాగే బాలకృష్ణ రాజకీయాల్లో కాస్త సందడి చేశారు.
నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో పెద్దగా ఎవరూ రాణించడం లేదు. ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణ అలాగే బాలకృష్ణ రాజకీయాల్లో కాస్త సందడి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ నందమూరి కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే టైంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రావాలని నందమూరి అభిమానులు కోరుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ 2009 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. 2018 తెలంగాణ ఎన్నికల్లో తన సోదరి నందమూరి సుహాసిని పోటీ చేసినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు.
అయితే రాజకీయాలపై ఆసక్తి లేకపోవడం దీనికి కారణం అనే ఒపీనియన్ కూడా ఉంది. ఇక నారా కుటుంబంతో ఎన్టీఆర్ కు గొడవలు కూడా ఉన్నాయి. అయితే ఏపీలో టీడీపీ ఇదిలా ఉంటే లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రకటన సినీ వర్గాలతో పాటుగా రాజకీయ వర్గాల్లో కూడా సెన్సేషన్ అవుతుంది. సినిమా సర్కిల్స్ లో దీని గురించి పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉంది అనే ఒపీనియన్ గట్టిగా వినపడుతోంది. త్వరలోనే తన అభిమానులతో నిర్వహించే సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రకటన చేస్తాడా అనేదానిపైనే సర్వత్ర ఆసక్తి నెలకొంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా సరే బలోపేతం చేయాలని ఆ పార్టీ అధిష్టానం పట్టుదలగా ఉంది. అందుకోసమే తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. లోకేష్ ఢిల్లీ వెళ్ళిన వెంటనే ఎన్టీఆర్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు దారితీస్తుంది.
త్వరలోనే ఎన్టీఆర్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ఒపీనియన్ గట్టిగా వినపడుతోంది. ఎన్టీఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించడానికి చంద్రబాబు కూడా సిద్ధమవుతున్నారని, కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని బిజెపి పట్టదలగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ టైంలో ఎన్టీఆర్ ను తెలంగాణలో ప్రయోగించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో పాటుగా బిజెపి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
దానికి తోడు తెలంగాణలో భారీగా కార్యకర్తలు ఉండటంతో కచ్చితంగా ఎన్టీఆర్ ను ప్రయోగిస్తే అది కలిసి వచ్చే అవకాశం ఉంటుందని… రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా తమకు కలిసొస్తుందని భావనలో బిజెపి పెద్దలు ఉన్నారు. ఎన్టీఆర్ కూడా ఈ మధ్య నందమూరి కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా మాత్రం ఎన్టీఆర్ రియాక్ట్ కాలేదు.