H బ్లాక్ ప్లాన్ అంటే ఏంటి? బోట్లను ఎలా తీస్తారు?

ఆరు నుంచి ఏడు టన్నుల బరువు ఉండే యాంగ్లర్ లతో H ఆకారంలో ఒక స్ట్రక్చర్ సిద్ధం చేసుకుంటారు.. ఆ H బ్లాక్ ను రెండు భారీ ఇసుక పడవల ను కలుపుతూ వెల్డింగ్ చేసుకుని అమరుస్తారు.. ఆ రెండు పడవల మధ్య మరో భారీ పడవను నడప గలిగేటంత దూరం ఉండేలా ఏర్పాటు చేస్తారు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 17, 2024 | 11:26 AMLast Updated on: Sep 17, 2024 | 11:26 AM

What Is H Block Plan How To Remove The Boats

ఆరు నుంచి ఏడు టన్నుల బరువు ఉండే యాంగ్లర్ లతో H ఆకారంలో ఒక స్ట్రక్చర్ సిద్ధం చేసుకుంటారు.. ఆ H బ్లాక్ ను రెండు భారీ ఇసుక పడవల ను కలుపుతూ వెల్డింగ్ చేసుకుని అమరుస్తారు.. ఆ రెండు పడవల మధ్య మరో భారీ పడవను నడప గలిగేటంత దూరం ఉండేలా ఏర్పాటు చేస్తారు.. ఆ రెండు పడవలను సమాంతరంగా H బ్లాక్ అమరిక మారకుండా పెద్ద సైజు ప్లేట్లతో మధ్యలో వెల్డింగ్ చేసారు.. దీనివల్ల భారీ స్ట్రక్చర్ పూర్తవుతుంది.. ఆ రెండు బోట్లనూ కదుపుతూ వాటి మధ్యలోకి నీట మునిగిన బోటు వచ్చేలా తీసుకెళ్ళారు.. అలా తెచ్చిన బోటు కు 10 పుల్లీలు, 10 లింక్లు సిద్ధం చేసుకున్నారు.. ముందుగా రెండు భారీ ఇసుక బోట్లలో 4 మీటర్ల వరకూ నీటిని నింపారు..

అనంతరం భారీ పుల్లీలను నీట మునిగిన బోటుకు కనెక్ట్ చేసి, ఒకొక్క పుల్లీ 20 టన్నులు వెయిట్ పడేలా .. దాదాపు 200 టన్నుల వెయిట్ పడేలా లోడ్ సిద్ధం చేసారు. పూర్తిగా నీట మునిగిన బోటును పుల్లీలు, లింక్ లతో బలంగా లాక్ చేసాక.. భారీ పడవలలోని నీటిని తోడేసారు.. అలా తోడేసిన తరువాత విధానం ప్రకారం నీట మునిగిన బోటు పైకి తేలాలి.. కానీ ఇవాళ ప్రకాశం బ్యారేజి వద్ద నీట తేలాల్సిన బోటు తేలకపోవడంతో H బ్లాక్ ఆపరేషన్ కు బ్రేక్ పడింది.. ఒకవేళ నీట మునిగిన బోటు తేలినట్టయితే.. ఆ బోటును నీటిలో ఉండగానే మోసుకుంటూ ఒడ్డుకు తీసుకు వెళతాయి ఈ బోట్లు.. గతంలో తుపాకుల గూడెంలో జరిగిన ఇదే ఆపరేషన్ సక్సెస్ కావడంతో.. కచ్చితంగా ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందని ఆశించారు.. అయితే తుది అంకం చేరుకున్నాక నీట మునిగిన బోటు కదలకపోవడంతో ఇంజనీర్లు దాదాపు ఈ ఆపరేషన్ వాయిదా వేసారనే తెలుస్తోంది…