పోసాని ఫ్యూచర్ ఏంటి.. కృష్ణ ‘మురళి’ వాయిస్తారా.. కెరీర్ ఉందా లేదా..?

ఏపీ రాజకీయాలల్లో ముందు నుంచి కూడా సినిమా వాళ్ళ ప్రభావం ఎక్కువగానే ఉంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సినిమా వాళ్ళు చాలామంది రాజకీయాలు చేస్తున్నారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2025 | 02:50 PMLast Updated on: Feb 28, 2025 | 2:50 PM

What Is Posanis Future

ఏపీ రాజకీయాలల్లో ముందు నుంచి కూడా సినిమా వాళ్ళ ప్రభావం ఎక్కువగానే ఉంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సినిమా వాళ్ళు చాలామంది రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. జయసుధ, నటుడు ఆలీ, యాంకర్ శ్యామల, పోసాని కృష్ణ మురళి, కృష్ణుడు, రామ్ గోపాల్ వర్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రాజకీయాలలో కూడా యాక్టివ్ గానే ఉన్నారు. వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు. ఎవరు పడితే వారిని.. ఏది పడితే అది నోటికొచ్చినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటి ప్రభావం ఇప్పుడు వీళ్ళ మీద పడుతుంది. జగన్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని మరి టార్గెట్ చేస్తున్నట్టు ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అర్థం అవుతుంది.

తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసులు పెట్టారు. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా వచ్చింది. రెండు మూడు సార్లు పోలీసులు ఇంటికి వచ్చారు. ఆయన పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లొచ్చాడు. ఇప్పుడు లిస్టులో నెక్స్ట్ పోసాని కృష్ణ మురళి బుక్ అయ్యాడు. తాజాగా హైదరాబాదులో అరెస్టు చేయడంతో ఏపీలో మరోసారి రాజకీయాలు బాగా వేడెక్కాయి. రాయచోటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ తరుణంలో పోసానికి సంబంధించిన పలు బూతు వీడియోలను టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. గతంలో అతడు చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలం వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. తాను తప్పుగా మాట్లాడినట్టు నిరూపిస్తే ఏం చేయడానికి అయినా సిద్ధమని పోసాని అనడంతో.. ఇప్పుడు ఆయన గతంలో మాట్లాడిన బూతు మాటలు బయటకు తీసుకొచ్చి ఇందులో ఆడుకుంటున్నారు టిడిపి జనసేన అనుచరులు.

జగన్ అండ చూసుకొని ఏది పడితే అది మాట్లాడవు కదా.. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు అంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చాడు పోసాని కృష్ణ మురళి. ఆయన తప్పుకున్నా కూడా గతంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కులాల పేరుతో దూషించాడు అంటూ ఆయన మీద కేసులు బుక్ చేశారు. ప్రస్తుతం ఉన్న వేడి చూస్తుంటే పోసాని మరిన్ని చిక్కుల్లో పడడం ఖాయంగా కనిపిస్తుంది. అప్పట్లో చాలామంది వైసిపి అండ చూసుకొని జనసేన టిడిపి నాయకులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వాళ్ళందర్నీ మెల్లమెల్లగా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ లిస్టులో నెక్స్ట్ కమెడియన్ ఆలీతో పాటు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.