KCR speech : కేసీఆర్ స్పీచ్ లో దమ్ము ఏది ..? కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచడమే లక్ష్యం..!

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రసంగాలు చూస్తే... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్సుంది కాబట్టే... ఆ పార్టీపై విమర్శలు చేస్తున్నారన్న టాక్ జనంలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనీ... ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు వస్తాయన్న బూచీ చూపిస్తున్నారు. అందుకే రిస్క్ తీసుకోవద్దు... తెలంగాణను ఢిల్లీ లీడర్లకు అప్పగించవద్దు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 19, 2023 | 07:04 PMLast Updated on: Nov 19, 2023 | 7:04 PM

What Is The Guts In Kcrs Speech The Goal Is To Increase Opposition To Congress

ఒకప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడితే అట్రాక్షన్. ఈసారి ఏం విమర్శలు చేస్తారో అని ప్రతి మీటింగ్ లో ఎదురు చూసే వాళ్ళు. ఓ వైపు తెలంగాణ సెంటిమెంట్ రగుల్చుతూనే ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తి పోసేవారు. కానీ ఇప్పుడెందుకో సీఎం కేసీఆర్ ప్రసంగాల్లో అంత దమ్ములేదనిపిస్తోంది. ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ నడుస్తోందని టాక్ రావడంతో … ఆ పార్టీపై విమర్శలతోనే కేసీఆర్ కాలక్షేపం చేస్తున్నారు. ప్రతి ప్రసంగంలోనూ రైతుబంధు కావాల్నా వద్దా… 24 గంటల కరెంట్ ఉండాల్నా వద్దా… ధరణిని కాంగ్రెస్ బంగాళాఖాతంలో వేస్తానంటోంది… ఉండాల్నా వద్దా… ఇలాంటి ప్రశ్నలతోనే ప్రసంగం ముగుస్తోంది.

PRIYANKA GANDHI : కేసీఆర్ సర్కార్ తప్పులు… బీజేపీ పట్టించుకోదు : ప్రియాంక

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రసంగాలు చూస్తే… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్సుంది కాబట్టే… ఆ పార్టీపై విమర్శలు చేస్తున్నారన్న టాక్ జనంలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనీ… ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు వస్తాయన్న బూచీ చూపిస్తున్నారు. అందుకే రిస్క్ తీసుకోవద్దు… తెలంగాణను ఢిల్లీ లీడర్లకు అప్పగించవద్దు… మాకే ఇవ్వండి అని అడుగుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఒకవైపు ఆరు గ్యారంటీలు… 60 హామీలు అంటూ కాంగ్రెస్ ప్రచారంలో ఊదరగొట్టేస్తోంది. కానీ బీఆర్ఎస్ లీడర్ల వ్యవహారం చూస్తే… కారు పార్టీకి అసలు మేనిఫెస్టో ఉందా… ఈ ఎన్నికల్లో అది ప్రకటించిందా లేదా… అన్న అనుమానాలు వస్తున్నాయి. అసలు తమ మేనిఫెస్టోని ప్రకటించుకోలేని పరిస్థితుల్లో… కేవలం కాంగ్రెస్ పై విమర్శలకే పరిమితం అవుతున్నారు ఆ పార్టీ లీడర్లు.

బీఆర్ఎస్ పెద్ద లీడర్లు కాంగ్రెస్ సెంట్రిక్ గా రాజకీయం చేస్తుంటే… నియోజకవర్గాల్లోని అభ్యర్థులు, ద్వితీయ శ్రేణి నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. రైతుబంధు, ఆసరా ఫించన్లు పెంచుకుంటూ పోతామని కేసీఆర్ తన సభల్లో ప్రకటిస్తున్నారు. కానీ గ్యాస్ సిలెండర్ 400 లకే ఇస్తామని హరీష్ తప్ప… సీఎం కేసీఆర్ సహా ఎవరూ గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఓటు ప్రాధాన్యం తెలుసుకోండి… వేరే పార్టీలను చూసి గాబరా పడొద్దు అంటూ సీఎం కేసీఆర్ స్పీచ్ చప్పగా సాగుతోందనే చర్చ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతోంది.

పదేళ్ళుగా BRS తెలంగాణలో అధికారంలో ఉంది. సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. పైగా నిరుద్యోగులైతే పీకల్లోతు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ తమ మేనిఫెస్టోలో పోటా పోటీగా ఉద్యోగాల భర్తీపై వరాలు కురిపించాయి. కాంగ్రెస్ అయితే ఏకంగా గ్రూప్ 1,2,3,4 కేటగిరీలకు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు ఇస్తామో… డేట్స్ తో సహా ప్రకటించింది. కానీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత… ఇలా ఎవరూ కూడా నిరుద్యోగుల ఊసే ఎత్తడం లేదు. కేటీఆర్ మాత్రం… డిసెంబర్ 3 తర్వాత TSPSCని ప్రక్షాళన చేస్తామని అన్నారు. అవును తప్పు జరిగింది అని హరీష్ రావు ఒప్పుకున్నారే తప్ప… అసలు బీఆర్ఎస్ వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తారా… చేస్తే ఎన్ని చేస్తారు… అన్నది చెప్పడం లేదు.
ఇక కాంగ్రెస్ నే BRS ఎందుకు టార్గెట్ చేస్తోంది అంటే… సీఎం కేసీఆర్ కి కూడా ఈ వేవ్ పై సర్వేలు వచ్చే ఉంటాయి. అందుకే దాన్ని బ్రేక్ చేయడానికే జనాన్ని హిప్నటైజ్ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. కాంగ్రెస్ కి ఓటేద్దాం అని పొరపాటు కూడా ఆలోచన రావొద్దని హెచ్చరిస్తున్నారు సీఎం కేసీఆర్.