పుష్ప డైలాగ్ కు జగన్ కు లింక్ ఏంటీ…? ఇలా ఉన్నారెంట్రా

సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా చిన్న క్లూ దొరికితే చాలు జనాలకు పండగ. సినిమాల్లో ఉండే డైలాగ్స్, సీన్స్, రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఇలా అన్నీ ఏదోక రూపంలో వైరల్ చేస్తూనే ఉంటారు. లేని విషయాన్ని పెద్దదిగా చేసి చూపిస్తూ ఉంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 18, 2024 | 07:48 PMLast Updated on: Nov 18, 2024 | 7:48 PM

What Is The Link To Puspa Dialogue And Jagan

సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా చిన్న క్లూ దొరికితే చాలు జనాలకు పండగ. సినిమాల్లో ఉండే డైలాగ్స్, సీన్స్, రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఇలా అన్నీ ఏదోక రూపంలో వైరల్ చేస్తూనే ఉంటారు. లేని విషయాన్ని పెద్దదిగా చేసి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా అంతే. ట్రైలర్ ను గ్రాండ్ గా పాట్నాలో రిలీజ్ చేసి… ప్రమోషన్స్ ను పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ట్ చేసింది పుష్ప టీం. ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక బాలీవుడ్ హీరోలకు మించి అక్కడ జనాలు వచ్చారు.

బన్నీకి పాన్ ఇండియా స్టార్ అనే గుర్తింపు పుష్ప పార్ట్ 1 తోనే వచ్చింది. ఇక పార్ట్ 2 తో… పాన్ వరల్డ్ స్టార్ అని ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు ఆరేళ్ళ పాటు బన్నీ కష్టపదతంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. అందుకోసం దాదాపు 300 కోట్ల వరకు బన్నీ చార్జ్ చేసాడు అనే వార్తలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫిగర్ కు మంచి పాపులారిటీ వచ్చింది. ఇండియాలో ఏ హీరో కూడా అలా తీసుకోలేదు. తమిళ స్టార్ హీరో విజయ్ మాత్రమే 275 కోట్లు తీసుకున్నాడు.

ఇక పుష్ప 2 ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది అనే చెప్పాలి. ఒక్కో డైలాగ్ కు ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ప్రతీ డైలాగ్ ను పక్కా లెక్కతో ఉండేలా ప్లాన్ చేసాడు సుకుమార్. ఇదే ట్రైలర్ లో ఓ డైలాగ్ మాత్రం ఇప్పుడు యమా వైరల్ అవుతోంది. అదేంటి అంటే… శ్రీవల్లి నా పెళ్ళాం… పెళ్ళాం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచాకానికి చూపిస్తా అంటూ పుష్ప నోటి నుంచి ఓ డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ చాలా మంది లేడీ ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చిన మాట వాస్తవం.

ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాతో పాటుగా మెగా ఫ్యాన్స్ దానిని జగన్ కు లింక్ చేస్తున్నారు. భారతి మాట విని జగన్ ఓడిపోయాడు అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. 5 ఏళ్ళ పాటు పాలన మొత్తం ఆమెనే చేసారు… అందుకే జగన్ కు ఈ పరిస్థితి అంటూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. ఇక మరికొందరు అయితే… బన్నీ తన భార్య స్నేహా రెడ్డికి ఇచ్చిన వాల్యూ… అది అని… తన భార్య సలహాలతోనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగుడుతున్నారు.