Top story: భూమి ఎవరిది ? తప్పు ఎవరిది ?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు వివాదమేంటి. ఈ భూమి నిజంగా ప్రభుత్వానిదేనా.. లేక యూనివర్సిటీ భూమిని ప్రభుత్వ లాక్కోవాలని ప్రయత్నిస్తోందా.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు వివాదమేంటి. ఈ భూమి నిజంగా ప్రభుత్వానిదేనా.. లేక యూనివర్సిటీ భూమిని ప్రభుత్వ లాక్కోవాలని ప్రయత్నిస్తోందా. ఎందుకు యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాస్ట డిటెయిల్‌గా చూసే ప్రయత్నం చేద్దాం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివాదం ఏంటో అర్థం కావాలంటే.. యూనివర్సిటీ చరిత్ర కూడా మనకి తెలియాలి. ముల్కి నియమాలకు వ్యతిరేకంగా జై ఆంధ్రా ఉద్యమం జరుగుతున్న సమయంలో రెండు తెలుగు ప్రాంతాల ప్రజలకు లాభం జరిగేలా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 6 పాయింట్ ఫార్ములా తీసుకువచ్చారు. ఆ 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా ఏర్పడిందే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనిరవర్సిటీ. జాతీయ స్థాయి ప్రమాణాలతో 1974లో కేంద్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ యూనివర్సిటీ HRD అండర్‌లోనే పని చేస్తోంది.
ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పడు ప్రభుత్వం యూనివర్సిటీకి 2300 ఎకరాల భూమిని కేటాయించింది. భవిష్యత్తులో యూనివర్సిటీ ఎక్స్‌పాండ్ చేసినా కూడా సమస్య రాకుండా ముందే భారీ స్థాయిలో భూములు కేటాయించింది. ఈ యూనివర్సిటీ భూమి నుచి 1987లో మొదటిసారిగా ప్రభుత్వ అవసరాల కోసం భూమిని కేటాయించారు. అప్పటిం నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వానికి అవసరం ఉన్న ప్రతీ సారి యూనివర్సిటీ నుంచి భూమి తీసుకుంటూనే ఉన్నారు. ఇలా దాదాపు 1000 ఎకరాల యూనివర్సిటీ భూమిని ప్రభుత్వాలు ఇప్పటి వరకూ తీసుకున్నారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటు కోసం చేసిన యాక్ట్ నెంబర్ 39లో చాలా క్లియర్‌గా చెప్పారు.
యూనివర్సిటీ భూములు నాన్ అకడమిక్ పర్పస్‌కు వాడొద్దని. కానీ ప్రభుత్వం మాత్రం ఈ భూమికి ఉన్న వాల్యూ దృష్ట్యా అవసరం ఉన్న ప్రతీసారి భూమిని వాడుతూనే వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2003లో IMG భారత్ అనే సంస్థకు అప్పటి ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అలోకేషన్‌ను రద్దు చేసింది. దీంతో IMG భారత్ అనే సంస్థ కోర్టుకు వెళ్లింది అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉండి.. రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు గెలిచి ఆ భూమి మళ్లీ వెనక్కి వచ్చింది. ఆ వెనక్కి వచ్చిన భూమినే ఇప్పుడు IT డెవలప్‌మెంట్ కోసం వాడతామని చెప్తోంది ప్రభుత్వం. అయితే భూమిని వాడుకోడానికి తెలంగాణ ప్రభుత్వానికి హక్కు ఉందా అంటే 200% హక్కు ఉంది. ఎందుకంటే 1974లో యూనివర్సిటీ స్థాపించినప్పుడు కేటాయించిన భూమిని కేంద్ర ప్రభుత్వం పేరు మీద కానీ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద కానీ రిజిస్టర్ చేయలేదు. ఈ ఒక్క రీజన్ వల్లే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భూమి మాది అని తెగేసి చెప్తోంది.
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే భూమి వాడుకోక తప్పదు ఇస్తే తప్పేంటి అని వాదించేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది కేవలం HUC సమస్య మాత్రమే కాదు.
యావత్ హైదరాబద్ సమస్య. ఎందుకంటే హైదరాబద్ సిటీ లోపల ఉన్న అతిపెద్ద చెట్ల సముదాయాలు ఒకటి కేబీఆర్ పార్క్ రెండు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలోనే భూమినే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటోంది. అంటే హైదరాబాద్‌కు ఉన్న రెండు ఊపిరితిత్తుల్లో ఒకదాన్ని తీసేస్తాం అంటోంది.ఈ భూమిలో పులులు సింహాలు జీవరాశులేం లేవు.. అన్నీ గుంట నక్కలు చేరి ఇలా చేస్తున్నాయని సీఎం ఏకంగా అసెంబ్లీలో అన్నారు. ప్రభుత్వం మీద పోరాడ్డానికి ఇక్కడ గుంటనక్కలు లేకపోవచ్చు కానీ అమాయకంగా బతికే అనేక లేళ్లు ఉన్నాయి నెమళ్లు ఉన్నాయి అరుదైన తాబేళ్లు ఉన్నాయి వందల రకాల పక్షులు ఉన్నాయి అన్నిటికీ మించి హైదరాబాద్‌కు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే చెట్లు ఉన్నాయి.
రాజకీయ నాయకులకు ఇది చిన్న సమస్యే కావచ్చు. కానీ ఢిల్లీ లాంటి స్టేట్‌నుంచి వచ్చిన వాళ్లకు తెలుస్తుంది. గాలి ఎంత విలువైనదో. ఢిల్లీ తరవాత హైదరాబాద్ కూడా ఎయిర్ పొల్యూషన్‌లో టాప్‌లోకి వెళ్తోంది. ఇలాంటి సమయంలో వీలైనంత చెట్లను పెంచాలి కానీ నరికేయడం ఎంత వరకూ కరెక్ట్. గత ప్రభుత్వాలు చేశాయి కదా అంటే వాళ్లు చేశారు కాబట్టే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అదే తప్పు చేస్తే రేపు మీరు కూడా ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుంది.
చెరువు పక్కన ఇల్లు కట్టుకున్నాడని కూలి పని చేసుకునేవాడి ఇల్లు కూల్చి చెరువులను కాపాడిని సీఎం రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్‌కు ఇంత ఆక్సిజన్ అందించే వేల చెట్లను నరకాలని ఎందుకు అనిపిస్తుందో అర్థం కావడంలేదు. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే ఢిల్లీ నుంచి HCUకు వచ్చిన రాహుల్ గాంధీకి 400 ఎకరాలు పోతుంటే ఎందుకు రియాక్ట్ అవ్వడంలేదో అర్థం కావడంలేదు.. మాట్లాడితే నేను అడవి బిడ్డని అని చెప్పుకునే మంత్రి సీతక్క ఈ విషయంలో సైలెంట్‌గా ఎందుకు ఉంటున్నారో అర్థం కావడంలేదు.. NSUI లో ఎదిగి MLC అయిన వెంటక బల్మూర్.. అదే NSUI తప్పు అని చెప్తున్న విషయాన్ని వినకుండా ప్రభుత్వాన్ని సపోర్ట్‌గా ధర్నాలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి. ఇదే యూనివర్సిటీలో చదివిన డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు యూనివర్సిటీ భూముల్లో రియల్‌ఎస్టేట్ చేస్తామంటే ఎలా ఒప్పుకున్నారంటే ఇదేనా మీరు చెప్పినా మార్పు. అభివృద్ధి మనకు అవసరమే.. కానీ ప్రకృతి మనకు ప్రాణంతో సమానం… వెన్ ది లాస్ట్ ట్రీ కట్.. వెన్ ది లాస్ట్ యానిమల్ డెడ్.. దెన్ వీ విల్ రియలైజ్.. వీ కాంట్ ఈట్ మనీ… సేవ్ HCU..