Top story పవన్ కి ఏమైంది? ఆ మాటల వెనక మర్మం ఏమిటి?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలనం సృష్టించారు. తన ప్రభుత్వంపై తానే విమర్శలు చేశారు. ఏపీ హోం మంత్రి అనిత ఏం చేస్తోందని ఆగ్రహంతో ఊగిపోయారు? నీకు చేతకాకపోతే తప్పుకో అన్నారు? నేను హోం మంత్రి అయితే పరిస్థితి మరోలా ఉంటుంది అంటూ ఎద్దేవా చేశారు?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలనం సృష్టించారు. తన ప్రభుత్వంపై తానే విమర్శలు చేశారు. ఏపీ హోం మంత్రి అనిత ఏం చేస్తోందని ఆగ్రహంతో ఊగిపోయారు? నీకు చేతకాకపోతే తప్పుకో అన్నారు? నేను హోం మంత్రి అయితే పరిస్థితి మరోలా ఉంటుంది అంటూ ఎద్దేవా చేశారు? రాష్ట్రంలో ఇన్ని రేప్ లు జరుగుతుంటే మీరంతా ఏం పీకుతున్నారు అని పోలీసులనీ ప్రశ్నించారు? పవన్ ఆవేశం… ఆగ్రహం వెనక కారణం ఏమిటి? పవన్ వ్యూహాత్మంగా మాట్లాడారా? చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారా? అసలు ఏపీ గవర్నమెంట్ లో ఏం జరుగుతోంది?
తిరుమల లడ్డు వివాదం తర్వాత మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ వారం రోజులుగా చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియాలో పవన్ పై వైసిపి దళాలు ఎదురు దాడి చేస్తున్నాయి. ఏపీలో గడచిన ఐదేళ్లలో 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పావు కదా ఆ 30000 మందిని వెనక్కి తీసుకురా… వాళ్ళు ఎవరో చెప్పు అంటూ సోషల్ మీడియాలో నిలదీయడం మొదలుపెట్టారు. మరోవైపు వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న మానభంగాలు… మహిళలపై దాడులు ప్రభుత్వాన్ని ముఖ్యంగా హోం మంత్రి అనిత ని ఇరకాటంలో పెట్టాయి. పిఠాపురం లో జరిగిన ఒక రేప్ కేసు ఇప్పటివరకు తేలలేదు. మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో మూడేళ్ల బాలికను రేప్ చేసి చంపేశాడు ఒక నీచుడు. గడిచిన నాలుగు నెలలు లో దాదాపు ఇలాంటివి 20 సంఘటనలు జరిగాయి. ఎన్నికల ముందు కూటమి నేతలు ఏ ఆయుధాలు అయితే ప్రయోగించా రో ఇప్పుడు అవే ఆయుధాల్ని వైసీపీ నేతలు ప్రయోగిస్తున్నారు. ఐదు నెలలుగా రాష్ట్రంలో జరిగిన రేప్ సంఘటనలన్నిటిని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు.
సహజంగానే సెన్సిటివ్ అయిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా చలించి పోయారు. సోషల్ మీడియాలో పవన్ కుటుంబాన్ని కూడా కొందరు చిల్లర గాళ్లు టార్గెట్ చేశారు. అలాంటి వాళ్లపై ఏపీ సర్కార్ కేసులు కూడా పెట్టింది. జరుగుతున్న పరిణామాలకి ఒక్కసారిగా చలించిపోయారు, సహనం కోల్పోయారు పవన్ కళ్యాణ్. ముందు రోజు వైసిపి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ తొక్కి నార తీస్తానని… హెచ్చరించారు. అది జరిగిన కొన్ని గంటల్లోనే మరో రేప్ సంఘటన బయటపడింది. సోషల్ మీడియాలో దీనిని ఎదుర్కోవడం కూటమినేతలకు… ముఖ్యంగా జనసేనకు చాలా కష్టంగా ఉంది. అందుకే ఒక్కసారిగా పవన్ సమయమనం కోల్పోయారు. తన ప్రభుత్వం పైనే తాను విమర్శలు చేశారు. హోం మంత్రిని నేరుగా టార్గెట్ చేశారు. చేతకాకపోతే తప్పుకోవాలి అని చెప్తూ… అంతే ఘాటుగా హోం మంత్రి అనితను చెడుగుడు ఆడుకున్నారు. అత్యాచారానికి కులానికి సంబంధం లేదని… ఏ కులం వాడినైనా సరే లోపల వేయాలంటూ పోలీసులకు సూచించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి తరహాలో వ్యవహరించాలని కోరారు. అయితే ఇప్పుడు చర్చ అంతా పవన్ కళ్యాణ్ మాటలు చుట్టూ తిరుగుతుంది.
ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ప్రభుత్వాన్ని నిందించడం చూస్తే… దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఈ వైఫల్యంలో పవన్ కళ్యాణ్ కూడా భాగమే కదా. క్యాబినెట్లో నో, ముఖ్యమంత్రితో ముఖాముఖి కూర్చున్నప్పుడు చెప్పాల్సిన మాటలు ఇలా బహిరంగ సభలో జనం ముందు మాట్లాడితే ఈ ప్రభుత్వం పరువు ఏం కావాలి.? అసలు ఈ మాటలు బహిరంగ సభలో మాట్లాడే మాటలేనా? గతంలో ఎవరైనా ఇలా మాట్లాడి ఉన్నారా? పవన్ కళ్యాణ్ తిట్టింది సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళ నా? లేక తన ప్రభుత్వంలో మంత్రుల్ని ?పోలీసులు నా? మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాటలు వైసీపీకి పెద్ద వాయిస్ నిచ్చాయి. డిప్యూటీ సీఎం స్వయంగా హోమ్ మంత్రిని తిడుతుంటే ఇక వైసిపి వాళ్ళు ఊరుకుంటారా? ఒక్కసారిగా ప్రభుత్వంపై మాటల దాడి ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే అన్నా రో…. వ్యూహాత్మకంగా అన్నారకానీ చంద్రబాబు కూటమి సర్కార్ పవన్ మాటలతో ఇరుక్కున పడింది. పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా చంద్రబాబుపై అసహనంతో ఉన్నారా? ఆ అసహనాన్ని ఇప్పుడు వెళ్ళగక్కారా?
అన్నది జనంలో చర్చ జరుగుతుంది. తన ప్రభుత్వానికి తానే వార్నింగ్ ఇవ్వడం అంటే ప్రభుత్వాన్ని అస్థిర పరచడం కాదా? బహిరంగంగా బయటకొచ్చి హోం మంత్రిని, ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా పవన్ చంద్రబాబుకి ఏం చెప్పాలనుకున్నారు? ఇది పవన్ సొంత గొంతేనా లేక బిజెపి పవన్ చేత ఇలా మాట్లాడిస్తుందా? ఇలా అనేక అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజం. చంద్రబాబు కూటమి సర్కారు లో అంతా బయటికి చెప్తున్నట్లుగా సక్రమంగా ఏమీ లేదు. అంతర్గతంగా మూడు పార్టీలు మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమస్య చంద్రబాబు నాయుడు పరిధిని దాటి వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివాడు. అది శత్రువుల గుండెల్ని చీల్చడానికే కాదు ,ఒక్కసారి సొంత కంటాన్ని నరకడానికి కూడా వెనకాడదు. ఆ విషయం చంద్రబాబుకి త్వరలోనే తెలిసి రావచ్చు.