కాంగ్రెస్.. హిట్టా.. ఫట్టా ? చెప్పింది కొండంత.. చేసింది గోరంత.. ఏడాదిలో కాంగ్రెస్ చేసింది ఇదీ..
రేవంత్ రెడ్డి అనే నేను.. ఈ మాటకు ఏడాది. మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలిన కాంగ్రెస్ సూరీడు.. హస్తం పార్టీని అధికారానికి దగ్గర చేశారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకు వద్దామని.. సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. కాంగ్రెస్ పోటీనే కాదు, పోటీలోనే లేదని.. బీఆర్ఎస్ సర్కార్ తీసివేసినట్లు మాట్లాడినా.. ఆ మాటలను తట్టుకున్నారు.
రేవంత్ రెడ్డి అనే నేను.. ఈ మాటకు ఏడాది. మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలిన కాంగ్రెస్ సూరీడు.. హస్తం పార్టీని అధికారానికి దగ్గర చేశారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకు వద్దామని.. సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. కాంగ్రెస్ పోటీనే కాదు, పోటీలోనే లేదని.. బీఆర్ఎస్ సర్కార్ తీసివేసినట్లు మాట్లాడినా.. ఆ మాటలను తట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెచ్చిన పార్టీగా పేరున్నా.. పదేళ్లు అధికారానికి దూరమై.. చెల్లాచెదురుగా మారిన పార్టీని.. ఆ ఒక్కడు ఏకం చేశారు. తూటాల్లాంటి తన మార్క్ మాటలతో రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపారు. కట్ చేస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. సీనియర్ల లాబీయింగ్, అలకలను దాటుకొని.. సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి అనే నేను అంటూ 2023 డిసెంబర్ ఏడున ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేస్తే.. ఆ రీసౌండ్ తెలంగాణ అంతా వినిపించింది. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. ఆరు గ్యారంటీల అమలుపై… అదే వేదికపై తొలి సంతకం చేశారు రేవంత్. ఎన్నికల ప్రచారంలో 66 హామీలను ప్రకటించిన కాంగ్రెస్.. మేనిఫెస్టో కంటే ఎక్కువగా.. ఆరు గ్యారంటీలను ప్రచారం చేసింది. మహిళలు, రైతులు, యువత, పేదలు, వృద్ధులు.. ఇలా వివిధ వర్గాల కోసం ఆరు గ్యారంటీలను రూపొందించింది.
ఆరు గ్యారంటీల్లో అత్యంత కీలకమైనది.. ఒకరకంగా గేమ్‌ఛేంజర్‌లాంటిది.. మహాలక్ష్మీ పథకం. ఈ స్కీమ్ కింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు.. 5వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు 25వందల రూపాయల సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే.. డిసెంబర్ 9న మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేశారు. ఐతే ఈ ఉచిత బస్సుపై రకరకాల విమర్శలు ఉన్నాయ్. ఫ్రీ బస్సుతో ఆటోలకు గిరాకీ పడిపోయింది. ఆందోళనలు జరిగాయ్ కూడా ! ఇక మహాలక్ష్మీ పథకంలోని మరో కీలక హామీ.. 5వందలకే గ్యాస్ సిలిండర్. ఈ స్కీమ్ అమలవుతున్నా.. పూర్తి స్థాయిలో జరగడం లేదనే విమర్శ ఉంది. ఇక మహిళలకు నెలకు 25వందల సాయం గురించి ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. రెండోది రైతు భరోసా. ఈ స్కీమ్ కింద ఏటా రైతులు, కౌలు రైతులకు 15వేల ఆర్థిక సాయం.. వ్యవసాయ కూలీలకు 12వేలు… వరికి 5వందలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధును రైతుభరోసాగా మార్చిన రేవంత్ సర్కార్.. ఈ పథకం కింద 15వేల ఆర్థిక సాయాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. జనవరిలో అమలు చేస్తామని చెప్తున్నారు. ఇక వ్యవసాయ కూలీలకు 12వేల హామీ ఇంకా అమల్లోకి రాలేదు.
ఐతే వరికి 5వందల బోనస్ ఇస్తామని చెప్పిన హామీ అమల్లోకి వచ్చింది. ఇక మూడో కీలక హామీ.. గృహజ్యోతి. ఈ పథకం కింద 2వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తారు. ఈ పథకాన్ని ప్రారంభించినా.. చాలా విమర్శలు ఉన్నాయ్. డిస్కంల లెక్కల ప్రకారం తెలంగాణలో 1.08 కోట్ల మంది వినియోగదారులు 2వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడుతుంటే.. కేవలం 50 లక్షల మంది వినియోగదారులకే పథకం వర్తిస్తోంది. ఇక మరో కీలక హామీ.. ఇందిరమ్మ ఇళ్లు. ఈ స్కీమ్ కింద ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అని హామీ ఇచ్చారు. మొదటి ఏడాది పాలన పూర్తవుతున్న సమయంలో.. ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఇంకో కీలక హామీ.. యువ వికాసం. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కింద 5 లక్షల విలువైన కార్డు. ప్రతి మండలంలో అంతర్జాతీయ స్కూల్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండూ ఇప్పటికీ అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్. అయితే, ఐతే ఏడాది కాలంలో 55వేల 143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు సర్కార్ చెప్తోంది. ఐతే ఈ ఉద్యోగాలన్నీ గత బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లే అనేది ప్రధాన విమర్శ. మరో కీలక హామీ చేయూత. ఈ పథకం కింద నెలకు వృద్ధులకు 4 వేల పింఛను, వికలాంగులకు 6 వేల పింఛన్.. రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా 10లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితి 10 లక్షలకు పెంచుతూ అమల్లోకి తెచ్చిన సర్కార్.. పింఛన్ల పెంపుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక అత్యంత ప్రముఖమైన హామీ.. రైతు రుణమాఫీ. 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
25లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం చెప్తుంటే.. మాఫీ కాలేదని చాలామంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయ్. వీటితో పాటు అమలు చేయని పథకాలు ఇంకా చాలా ఉన్నాయ్. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ అమరవీరుల తల్లి లేదా తండ్రి లేదా భార్యకు 25 వేలు నెరవారీ గౌరవ పింఛను, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం… అమలు కాలేదు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి, 250 గజాల ఇళ్ల స్థలాల కేటాయిస్తామన్న హామీపై క్లారిటీ లేదు. ప్రతి విద్యార్థి, విద్యార్థినికి ఉచిత వైఫై సౌకర్యం.. పత్తాకు లేదు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ విధానం అమలు… దీనిపైనా స్పష్టతలేదు. ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి 12వేల ఆర్థిక సాయం, 18ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల హామీపై ఎలాంటి కదలిక లేదు. ఇక నిరుపేద హిందూ, మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే లక్షతోపాటు.. ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం అందజేత… ఇది ఇంకా అమలు కాలేదు. ఇది రేవంత్ సర్కార్ కార్నర్ అయ్యేలా చేస్తోంది. ఇలా అమల్లోకి వచ్చిన పథకాలు పూర్తిగా అమలు కావడం లేదు.. చేస్తామని చెప్పిన హామీలు అమలు కావడం లేదు. ఇదే బీఆర్ఎస్‌కు ఆయుధంగా మారింది.