Top story: ఆమె ఏం చెప్తే.. మోదీ అదే చేస్తాడు…!

పర్సనల్ సెక్రటరీ జాబ్ అంటేనే చాలా కష్టం. బాస్ ఏం చెప్తున్నారో సరిగా అర్థం చేసుకోవడం.. దానికి తగినట్లు ప్లాన్‌ చేయడం.. సూచనలు ఇవ్వడం..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2025 | 05:50 PMLast Updated on: Apr 04, 2025 | 5:50 PM

Whatever She Says Modi Does The Same

పర్సనల్ సెక్రటరీ జాబ్ అంటేనే చాలా కష్టం. బాస్ ఏం చెప్తున్నారో సరిగా అర్థం చేసుకోవడం.. దానికి తగినట్లు ప్లాన్‌ చేయడం.. సూచనలు ఇవ్వడం.. కాస్త అటు ఇటు అయినా.. మొదటికే మోసం వస్తది. అలాంటి బాస్ ప్రధానమంత్రి అయితే ! ఇంకెంత ప్రెషర్ ఉంటుంది. అలాంటి బాధ్యతకు సెలక్ట్ అయ్యారు నిధి తివారి. పేరుకు తగినట్లు నిజంగా.. ఆమె జ్ఞాన నిధి.. ఆమె జీవితం ఆదర్శం.. ఆమె లైఫ్‌ చాలామందికి ఇన్‌స్పిరేషన్‌. ఐఎఫ్‌ఎస్‌గా అయిన నిధి తివారిది.. వారణాసి. ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ప్రధాని డెయిలీ లైఫ్ ప్లాన్ చేయడం అంటే మాములు విషయం కాదు.. వివిధ శాఖల అధికారులు వస్తుంటారు.. దేశవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. చాలా సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం చూపించాలి.. ముఖ్యమంత్రుల నుంచి రాజకీయ నేతల వరకు.. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతీరోజు చాలామంది వస్తుంటారు. వాళ్లందరిని మీటింగ్‌ను షెడ్యూల్‌ చేయాలి.. ఎవరు వచ్చారు.. ఎందుకు వచ్చారనే ప్రతీ విషయాన్ని.. ప్రధానికి అందించాలి.

అన్నింటిని కోఆర్డినేట్‌ చేసతూ.. ప్రధాని ప్రాధాన్యతలు గమనించి.. పీఎం డెయిలీ ప్రోగ్రామ్‌ డిజైన్ చేయాల్సి ఉంటుంది. చెప్తుంటేనే అమ్మో అనిపిస్తుంది కదా.. నిధి తివారీ నెరవేర్చబోయేది ఇప్పుడు అలాంటి బాధ్యతే ! 2022 నవంబర్‌ నుంచి ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న నిధి.. ఇప్పుడు ప్రధాన వ్యక్తిగత కార్యదర్శిగా ప్రమోట్‌ అయ్యారు. వారణాసిలోని మెహమర్‌గంజ్‌లో పుట్టి పెరిగిన ఆమె… బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేశారు. ఆ యూనివర్సిటీలోనే పరిచయమైన సుశీల్‌ జైస్వాల్‌ను 2006లో పెళ్లి చేసుకున్నారు. సివిల్‌ సర్వీసెస్‌లో చేరి దేశానికి సేవ చేయాలనేది చిన్ననాటి నుంచి నిధి లక్ష్యం. పెళ్లి తర్వాత కూడా కష్టపడి చదివి.. వారణాసిలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఉద్యోగం సాధించారు. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కి సిద్ధం అయ్యారు. కొడుకు పుట్టినా.. తన లక్ష్యం వీడలేదు. 2013 సివిల్స్‌ ఫలితాల్లో 96వ ర్యాంకు సాధించారు. ఐఎఫ్‌ఎస్‌ అధికారిణిగా 2016లో శిక్షణలో ఉన్న సమయంలోనే… ఆమె చూపిన ప్రతిభకు గుర్తింపుగా అంబాసిడర్‌ విమల్‌ సన్యాల్‌ స్మారక పతకం అందుకున్నారు. మోదీ ప్రధాని అయ్యాక… 11ఏళ్లలో వ్యక్తిగత కార్యదర్శులుగా వివేక్‌ కుమార్, హార్దిక్‌ సతీష్‌, చంద్ర షా.. విధులు నిర్వహించారు.

ప్రస్తుతం ఆ స్థానంలో నిధి తివారీ మొదటి మహిళగా నియమితులయ్యారు. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఆమెకు నెలకు లక్షా 44వేల జీతంతో పాటు.. మిగతా సదుపాయాలు అందుతాయ్‌. ప్రధాని కార్యాలయంలో పని చేయడానికి ముందు.. నిధి తివారీ విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేశారు. రాజస్థాన్‌కు చెందిన పలు అంశాలపైనా పనిచేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఆధ్వర్యంలో ఆమె చూపిన ప్రతిభ… ఆమెపై గౌరవాన్ని పెంచింది. దేశ భద్రత, అణుశక్తి, విదేశీ వ్యవహారాల వంటి అంశాలను చాకచక్యంగా నిర్వహించగలదన్న నమ్మకం కుదిరింది. ఆ తర్వాత 2023లో భారత్‌లో తొలిసారి జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో నిధి తివారీ చురుకుదనం, వ్యవహార శైలి, దీక్ష, పట్టుదలపై ప్రధానికి ఆమె మీద విశ్వాసం పెంచింది. ఇప్పుడు వ్యక్తిగత కార్యదర్శిగా మార్చింది. టాలెంట్ ఉండాలే కానీ.. స్త్రీల శక్తిని అడ్డుకునే వారు ఉండరు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు అనడానికి నిధి తివారీ జీవితం ఎగ్జాంపుల్ అంటూ ఇప్పుడు ప్రతీ ఒక్కరు ప్రశంసలు గుప్పిస్తున్నారు.