Top story: ఏంటి ఈ H1B వీసాల గొడవ? అమెరికాలో బతకాలంటే H1B తప్పనిసరా…!

అమెరికా మొత్తం ఇప్పుడు అల్లకల్లోలం... ట్రంప్ గెలుపుతో సరికొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. H1B వీసా చుట్టూ ట్రంప్ క్యాంప్‌లోనే వార్ నడుస్తోంది. ఆ వీసాలు ఇవ్వాలనేవారు, వద్దనేవారు రెండు వర్గాలుగా విడిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 4, 2025 | 01:40 PMLast Updated on: Jan 04, 2025 | 1:40 PM

Whats This Fuss About H1b Visas Is H1b A Must To Live In America

అమెరికా మొత్తం ఇప్పుడు అల్లకల్లోలం… ట్రంప్ గెలుపుతో సరికొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. H1B వీసా చుట్టూ ట్రంప్ క్యాంప్‌లోనే వార్ నడుస్తోంది. ఆ వీసాలు ఇవ్వాలనేవారు, వద్దనేవారు రెండు వర్గాలుగా విడిపోయారు. వాళ్లూ వాళ్లూ కొట్టుకు చస్తూ మన వాళ్ల పీకలమీదకు తెస్తున్నారు. ఇంతకీ వీసాలు ఇస్తారా ఇవ్వరా…? ఇవ్వాలంటోంది ఎవరు…? వద్దంటోంది ఎవరు..? H1B లేకుండా అమెరికాలో ఉండలేమా…? మనవాళ్లకు ఇక రోజూ నరకమేనా…?

H1B వీసా…అవకాశాల స్వర్గం అమెరికాలో ఉండాలనుకునే విదేశీయుల పాలిట వరం… ఫారినర్స్ ఎవరు అక్కడ ఉద్యోగం చేయాలన్నా ఇది మస్ట్.. లేకపోతే తన్ని తగలేస్తారు. లాటరీలో ఆ వీసా దక్కితే ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషం… రాకపోతే కథ కంచికి చేరినట్లే. అందుకే ఆ వీసా కోసం అంత పోటీ… అమెరికాలో మన వాళ్లందరి పాలిట మహాలక్ష్మి ఈ వీసానే… అలాంటి వీసాలపై ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చే నడుస్తోంది. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ క్యాంప్‌ ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది. DOGE vS MEGA అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, మరియు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్.. ఈ రెండు వర్గాలు H1Bవీసాలు ఉండాలా వద్దా అన్నదానిపై తన్నుకు చస్తున్నాయి. మస్క్, వివేక్ రామస్వామి వంటి వారు ఈ వీసాలు ఉండాలని కాకపోతే కొన్ని మార్పులు చేయాలని వాదిస్తున్నారు. ఇక ట్రంప్ AI అడ్వైజర్‌గా అపాయింట్ అయిన శ్రీరామ్ కృష్ణన్ అయితే వీసాల సంఖ్యను పొడిగించాలని డిమాండ్ చేశారు. అయితే రైట్ వింగ్ మాత్రం ఈ వీసాలు ఉండకూడదంటోంది. నిక్కీహేలీ వంటి వారు వీరికి తోడయ్యారు. వీసాలు ఇస్తే ఊరుకోబోమంటున్నారు. ఈ వార్‌లోకి ఎంటరైన ట్రంప్…. తాను వీసాలకు వ్యతిరేకం కాదన్నారు. కానీ అందులో మార్పులు తప్పవని సంకేతాలిచ్చారు. పరిస్థితి చూస్తుంటే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే H1B వీసాల్లో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. అది మనవాళ్లను ముంచేదిలాగానే ఉంటుందని తేలిపోయింది. పైగా వివేక్ రామస్వామి అమెరికా కల్చర్‌పై చేసిన వ్యాఖ్యలు మరింత నిప్పు రాజేశాయి. అమెరికా బెస్ట్ ఇంజనీర్లను ఉత్పత్తి చేయలేదన్నట్లు ఆయన మాట్లాడారు. ఓ రకంగా అక్కడి కల్చర్‌ను తప్పుపట్టారు. ఇది అమెరికన్లకు కోపం తెప్పించింది. దీంతో ట్రంప్ క్యాంప్‌లోని చాలామంది ఆయన్ను టార్గెట్ చేశారు. ఇదంతా అటు తిరిగి ఇటు తిరిగి తమ మెడకు చుట్టుకుంటుందేమోనని మనవాళ్లు భయంతో వణికి చస్తున్నారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కంటే ముందు ఓ బిజినెస్‌మెన్. ఈ వీసాలు ఉండటం వల్ల అమెరికాకు ఎంత మేలు జరుగుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి వీసాలను పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం మాత్రం చేయరు. అమెరికా ఎకానమీకి ఈ వీసాలున్న వాళ్లు చేస్తున్న కంట్రిబ్యూషన్ అంతా ఇంతా కాదు. అసలు అమెరికా అభివృద్ధికి ఎక్కువభాగం తోడ్పడింది మన ఇండియన్స్ లాంటి వారే. ఈ నిజం ప్రెసిడెంట్‌కు బాగా తెలుసు. కాబట్టి పూర్తిగా ఎత్తివేయకుండా మెరిట్ బేస్డ్ వీసాలివ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దాని విధివిధానాలేంటన్నది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. మస్క్, వివేక్ రామస్వామి వంటి వారు కూడా ఇదే సూచిస్తున్నారు. ప్రస్తుత వీసా ప్రోగ్రామ్‌లో చాలా లోపాలున్నాయి కాబట్టి దాన్ని మార్చాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. దాని ప్రకారం చూస్తే ప్రస్తుతం లాటరీ పద్దతిలో ఇస్తున్న H1Bవీసాలను ఇకపై మెరిట్ బేస్‌తో ఇవ్వాలంటున్నారు. ప్రస్తుతం ఏటా 85వేలమందికి H1B వీసాలు ఇస్తున్నారు. అయితే వాటి సంఖ్యను బాగా తగ్గించాలన్నది రిపబ్లికన్ల డిమాండ్. దీంతో నేటివ్ అమెరికన్లకు ఎక్కువ అవకాశాలు దొరుకుతాయని వారు వాదిస్తున్నారు. ఫస్ట్ టర్మ్‌లో అమెరికన్ ప్రెసిడెంట్‌గా వీసాల సంఖ్యలో కోత పెట్టారు ట్రంప్. చివరి ఏడాదిలో అసలు ఈ ప్రోగ్రామ్‌నే ఎత్తేయాలని ప్రయత్నించారు. ఈ లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ మన వాళ్ల గుండెల్లో బాంబులు పేలుస్తున్నాయి. చాలామంది భారతీయులు ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఇలా కీలక పోస్టుల్లో ఉన్నారు. వీరిలో చాలామంది ఈ H1B వీసాలపైనే ఉంటున్నారు. ఇప్పుడు వారందరికీ ఇది లైప్ అండ్ డెత్ ఇష్యూగా మారింది. వీసాల విధానంలో తీసుకొచ్చే మార్పులు వారినే కాదు వారి భావితరాలను కూడా ప్రభావితం చేయబోతున్నాయి. దీంతో తమ భవిష్యత్తు అర్థం కాక బెంగపడుతున్నారు. చాలాకాలంగా అక్కడ ఉంటున్న వారితో పాటు ఇటీవల అమెరికాకు వెళ్లి అక్కడ చదువుకుని అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్న వేలమంది యువకులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఎప్పుడు తమను పొమ్మంటారో తెలియక భయంతో గజగజలాడిపోతున్నారు. అప్పు చేసి అమెరికా వస్తే ఇప్పుడిలా అయిపోయిందన్నది వారి ఆవేదన. ట్రంప్ గెలిస్తే కాస్త కఠినంగా ఉంటారని తెలిసినా మరీ ఈ స్థాయిలో రచ్చ జరుగుతుందని వారు అనుకోలేదు. పైగా ఇప్పుడు ట్రంప్ క్యాంప్ రెండుగా విడిపోయింది. అవునన్నా కాదన్నా ట్రంప్ మేక్ అమెరికా ఎగైన్ మద్దతుదారులను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ఇది వేలమంది భారతీయ యువకుల కలలను చిదిమేసేలా ఉంది.

H1B వీసా లేకుండా అమెరికాలో ఉండలేమా అంటే ఉండలేమనేచెప్పాలి. వేరే వీసాలపై అమెరికా వెళ్లొచ్చు. కానీ H1B వీసా లేకుండా మాత్రం అక్కడ ఉద్యోగాలు చేయలేం. 1990 అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం హైలీ స్పెషలైజ్డ్ రంగాల్లో విదేశీ నిపుణులను నియమించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకువచ్చారు. ఏటా 85వేల వీసాలు మించకూడదని అందులో 20వేలు అక్కడ చదువుకున్న విద్యార్థులకు ఇవ్వాలన్నది రూల్. అయితే దీనిపై చాలానే విమర్శలున్నాయి. అమెరికన్ కంపెనీలు తక్కువ ఖర్చుతో పనిచేసే భారతీయుల వంటివారికి జాబ్‌లు ఇచ్చి అమెరికన్లను పక్కన పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. చాలామంది భారతీయులు ఈ వీసాలోని లొసుగులను అడ్డం పెట్టుకుని అడ్డదారిలో వాటిని పొందారు. అమెరికన్ ఉద్యోగులతో సరిసమానంగా మన వారికి కూడా జీతాలు ఇవ్వాలి. అయితే ఎంప్లాయర్లు మన వారి అవసరాన్ని అడ్డుపెట్టుకుని జీతంలో కొంతమొత్తాన్ని వారే తీసుకునేవారు. అవసరం మనది కనుక వచ్చినదాంతో మనవాళ్లు సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వీసాల సంఖ్య తగ్గించినా కాస్త కఠినంగా వ్యవహరించినా అమెరికన్ సంస్థలు మనవారిని తీసుకోవడానికి వెనకాడతాయి. దీంతో ఎన్నో వేలమంది నిరుద్యోగులవుతారు. ఉద్యోగం లేకపోతే H1B వీసా ఉండదు.. అది లేకపోతే అక్కడ ఉండలేం. ఇదీ ప్రస్తుతం మన వాళ్ల పరిస్థితి. అమెరికాలో ఉండలేం… ఇండియాకు తిరిగిరాలేం ఇప్పుడు దారేది దేవుడా అని ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టడానికి మరో రెండు వారాల టైమ్ మాత్రమే ఉంది. కాబట్టి అప్పటివరకూ ఈ టెన్షన్‌తో ఎదురు చూడాల్సిందే. ఆ తర్వాతే కొత్త ప్రభుత్వ ఆలోచనలేంటన్నది తెలుస్తాయి.