రోజా కోసం వెతుకుతున్న జనం… వైసిపి క్యాడర్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 6, 2024 | 07:29 PMLast Updated on: Aug 06, 2024 | 7:29 PM

Where Is Rk Roja

ఒకప్పుడు రోజు… ప్రెస్ మీట్లతో, వివాదాస్పద కామెంట్లతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కించిన మాజీ మంత్రి, వైసిపి నాయకురాలు రోజా ఎక్కడా కనిపించడం లేదు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఆమె పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వచ్చి కలిశారు. ఆ తర్వాత మళ్లీ జనం ముందుకు రాలేదు, జిల్లా రాజకీయాలను పట్టించుకోలేదు. కనీసం తన నియోజకవర్గం నగరిని కూడా ఆమె పలకరించలేదు. హఠాత్తుగా రోజా ఒక పొట్టి గౌన్ వేసుకుని ఇటలీలో తిరుగుతుండగా
బయటకొచ్చిన ఫోటో ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది.

2019 నుంచి 24 వరకు ఐదేళ్లపాటు మాజీ మంత్రి రోజా చెలరేగిపోయిన తీరు గుర్తొస్తే ఇప్పటికీ చాలామంది నోరేళ్ళ పెడతారు.
ఫైర్ బ్రాండ్ అని పొగిడించుకోవాలనుకున్నారో, నిజంగానే తాను ఫైర్ బ్రాండ్ అని అనుకున్నారో కానీ…. రోజా నోటికి అడ్డు అదుపు ఉండేది కాదు. ఎవరినైనా ఎంత మాటైనా అనేసేవారు ఆమె. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా పన్నెత్తి మాటంటే పార్టీలో మిగిలిన నాయకులు అందరికంటే ముందే పోటీపడి మరి… ప్రత్యర్థులని మాటలతో చీల్చి చెండాడేవారు. మంత్రి అయ్యాక ఇంకా చెలరేగిపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎన్ని రకాలుగా కించపరచాలో అన్ని రకాలుగానూ కించపరిచారు ఆమె .మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని వెక్కిరిస్తూ, ఎద్దేవా చేస్తూ రోజా చేసిన కామెంట్లు చాలాసార్లు వివాదానికి దారి తీసాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఆయన కుమారుడు లోకేష్ ని తిట్టాలంటే రోజా తర్వాతే ఎవరైనా.

చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను రోజా మాటలతో ఆడుకుంటుంటే వైసిపి అధినేత జగన్ ఎంజాయ్ చేసేవాడు. కానీ రోజా మాటలే జగన్ కొంపముంచాయి. అడ్డు అదుపు లేకుండా , నోరు పారేసుకుని రోజా పరోక్షంగా జగన్ ఓటమికి కారణమయ్యారు. రోజా పవన్ కళ్యాణ్ ని తిట్టిన తిట్లు కాపులకు, పవన్ ఫ్యాన్స్ కు, ముఖ్యంగా మహిళలకు కోపం తెప్పించాయి. రోజా నిర్లజ్జగా ,నిస్సిగ్గుగా మాట్లాడే మాటలు మొత్తం జగన్ పార్టీ నే తుడిచి పెట్టేసేయ్. జగన్ని సంతోషపెట్టడం కోసం…. అధినేతకు ఆనందం కలిగించడం కోసం రోజా చేసిన ఎక్స్ట్రాలు చివరికి ఆమె పొలిటికల్ కెరీర్ ని ముగించే పరిస్థితి తీసుకొచ్చాయి. అసలు రోజాకి టికెట్ రావడమే కష్టమైంది. నగరిలో వైసిపి నాయకులు ఎవరు ఎన్నికల్లో రోజాకు సహకరించడానికి ససేమిరా అన్నారు.

చివరికి జగన్ వాళ్లందరికీ వార్నింగ్ ఇచ్చి, ఒప్పించి రోజాని నగరి నుంచి బరిలోకి దింపారు. కానీ ఎన్నికల్లో ఆమెకు ఎవ్వరు సహకరించలేదు .పైగా అందరూ రోజా కి వ్యతిరేకంగానే చేశారు. అంతగా ఆమె తన నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ నాయకులనుంచి వ్యతిరేకత కూడగట్టుకుంది. అంతేకాదు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కి రోజా ఎదురెళ్లి తోడ గొట్టింది. పెద్దిరెడ్డిని కాదని తన సొంతంగా వ్యవహారాలు నడిపింది. మంత్రిగా ఉంటూ భారీ అవినీతికి పాల్పడిందని, బెంజ్ వాహనాలు బహుమతులుగా స్వీకరించిందని రోజా మీద సొంత పార్టీ నాయకులే ఆరోపణలు చేశారు. వీటికి ఆమె తలవంచలేదు. ఒకానొక సమయంలో రోజాపై బ్లూ ఫిలిం ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటిని మాటలతోనే ఎదుర్కొన్నారు రోజా.

కానీ ఆమెకు తన గెలుపు చాలా కష్టమని, అసాధ్యమని స్పష్టంగా తెలుసు. అందుకే ముందే అన్ని సర్దుకున్నారు. ఆస్తులు వ్యవహారాలు అన్నీ ఎక్కడికి అక్కడ సెట్ చేసుకున్నారు. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు చేయలేదని సొంత పార్టీ నేతలే రోజాపై ఆరోపించారు. ఏపీలో కూటమి వేవులో రోజా కూడా ఓడిపోయారు. ఒకవేళ వైసిపి గెలిచి ఉన్న ….. రోజా మాత్రం కచ్చితంగా ఓడిపోయి ఉండేవారిని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు అంటారు. మొత్తానికి వైసిపి దారుణ ఓటమికి రోజా నోటి దూల కూడా ఒక ప్రధాన కారణం అనేది అందరూ అనుకునే మాట. అంతే కాదు మంత్రిగా ఉన్నప్పుడు రోజా చేసిన అతి వేషాలు, అతి చేష్టలు వైసీపీని దారుణంగా డామేజ్ చేశాయి. అందుకేనేమో ఈ వైఫల్యం నుంచి తప్పించుకోవడానికి తెలివిగా ఎన్నికల ఫలితాలు తర్వాత జనంలో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు రోజా. నిజానికి ఎన్నికల తర్వాత కూడా చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత పెద్దిరెడ్డి చుట్టూ హాట్ హాట్ రాజకీయాలు జరుగుతున్నాయి. రోజు వివాదాస్పద అంశాలు తెరమీదకు వస్తున్నాయి.

తన పార్టీకి చెందిన ఒక సీనియర్ నేతని రక్షించాల్సింది పోయి అసలు మాట వరసకైనా ఖండించలేదు రోజా. అసలు ఆమె ఎక్కడుందో కూడా గడచిన నెల రోజుల నుంచి ఎవరికి తెలియదు. కుటుంబంతో రోజా యూకే పర్యటనకు వెళ్ళినట్టు ఇటీవల బయటకు వచ్చింది. మామూలు రోజుల్లో అయితే ఆమె ఎక్కడున్నా రాజకీయ ప్రత్యర్థుల్ని మాటలతో చెండాడుతూ ఉండేది. ఇప్పుడు పాపం పూర్తిగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. రోజా చిన్న గౌన్ ఏసుకుని తన కుటుంబ సభ్యులతో ఇటలీలో తిరుగుతుండగా ఉన్న ఫోటో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఇక టిడిపి సోషల్ మీడియా వింగ్ ఊరుకుంటుందా ?.

ఒకప్పుడు చుడీదార్ వేసుకున్నందుకు భూమా అఖిలప్రియ ను రోజా ఎంత దారుణంగా అవమానించిందో గుర్తు చేస్తూ పాత వీడియోలన్నీ తీసి సుప్పిని… సుద్ధ పూసని అని వెక్కిరిస్తూ ఆ ఫోటో వైరల్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు పొట్టి గౌను వేసుకొని … ఇటలీ రోడ్లపై ఎలా తిరుగుతున్నావు ?అంటూ వెక్కిరించారు టిడిపి నేతలు. నవ్వి పోదురు గాక …నాకేటి సిగ్గు అనుకుందేమో రోజా కనీసం కామెంట్స్ కి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. మొత్తం మీద రెండు నెలలుగా కనిపించని రోజా ఇటలీ విహారయాత్రలో జనానికి కనిపించి నేనున్నాననిపించింది. కానీ చిత్తూరు రాజకీయాల్లో మాత్రం రోజా క్రమంగా కనుమరుగైపోయినట్లే అనిపిస్తోంది.