Janata ka mood survey : ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందంటే.. జనతా కా మూడ్ సర్వే సంచలనం..
తెలంగాణ ఎన్నికలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ బలం పుంజుకోవడం.. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద అంతో ఇంతో వ్యతిరేకత ఉండడంతో.. ఓటరు మనసులో ఏముంది.. ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. టెన్షన్ ఈ లెవల్‌లో ఉంటే.. రోజుకో సర్వే అంటూ వస్తున్న ఫలితాలు.. మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ బలం పుంజుకోవడం.. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద అంతో ఇంతో వ్యతిరేకత ఉండడంతో.. ఓటరు మనసులో ఏముంది.. ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. టెన్షన్ ఈ లెవల్ లో ఉంటే.. రోజుకో సర్వే అంటూ వస్తున్న ఫలితాలు.. మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. లేటెస్ట్‌గా జనతా కా మూడ్ అనే సంస్థ తన సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. మొత్తం సీట్లలో 72 నుంచి 75 సీట్లతో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్ పార్టీ పవర్ లోకి రానుందని తెలిపింది. కాంగ్రెస్ 31 నుంచి 36 సీట్లకే పరిమితమై రెండో స్థానంలో నిలవనుందని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష 20 వేల శాంపిల్స్, ప్రతీ నియోజకవర్గంలో 11 వందల శాంపిల్స్ సేకరించి సర్వే చేసినట్టు జనతా కా మూడ్ తెలిపింది. కర్నాటకలో పార్టీ ఓటమి, బీజేపీ స్టేట్ చీఫ్‌గా బండి సంజయ్ తొలగింపు కారణంగా.. తెలంగాణలో కమలం పార్టీ గ్రాఫ్ పడిపోయిందని వివరించింది.
ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు 41శాతం ఓట్ షేర్ రానుందని.. కాంగ్రెస్‌కు 34శాతం, బీజేపీకి 14 శాతం, ఎంఐఎం 3శాతం ఓట్ షేర్ తెచ్చుకుంటాయని సర్వేలో తేలింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కేవలం 4 నుంచి 6 సీట్లు గెలవనుందని సర్వే తెలిపింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్, బీజేపీ మధ్య అంత భారీగా కాకపోయినా.. ఓ మోస్తరుగా చీలుతోందని తెలుస్తోంది. దీంతో మళ్లీ పవర్ లోకి రావడానికి కావల్సిన సీట్లు బీఆర్ఎస్‌కు రాబోతున్నాయని వెల్లడవుతోంది. ఇక తెలంగాణ ఎన్నికలపై విడుదలవుతున్న సర్వేలు ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ పార్టీలైతే తమకు అనుకూలంగా లేని సర్వేలను ఫేక్ సర్వేలని కట్టి పడేస్తున్నాయి. ఏ పార్టీకి సర్వే అనుకూలంగా ఉంటే ఆ పార్టీయే సర్వే చేయించిందని నేతలు ఆరోపిస్తున్నారు. ఓటర్ల మైండ్‌ను ప్రభావితం చేసేందుకు కొన్ని పార్టీలు సర్వేలు చేయించి సోషల్ మీడియాలోకి వదులుతున్నాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.