ఆ పైలెట్స్ ఎవరు? 144 మంది ప్రాణాలు ఎలా కాపాడారు? బెల్లీ లాండింగ్ అంటే ఏంటి?
ఎయిరిండియా విమానం AXB 613 తిరుచ్చి నుంచి షార్జాకు శుక్రవారం సాయంత్రం 5.20 నిమిషాలకు బయలుదేరింది. విమానంలో 141 మంది ప్రయాణికులతో ఇతర సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు పైలట్లు గుర్తించారు.
ఎయిరిండియా విమానం AXB 613 తిరుచ్చి నుంచి షార్జాకు శుక్రవారం సాయంత్రం 5.20 నిమిషాలకు బయలుదేరింది. విమానంలో 141 మంది ప్రయాణికులతో ఇతర సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు పైలట్లు గుర్తించారు. గాల్లో ఉండగా పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించడం ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ విషయాన్ని ఏటీసీకి తెలియజేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఏటీసీ అధికారులు అనుమతిచ్చారు. హైడ్రాలిక్ వ్యవస్థ పనిచేయడం లేదని ఏటీసీకి వివరించారు. రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత…ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇంధనం తగ్గించడానికే గాల్లో చక్కర్లు
తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన వెంటనే…ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమయింది. హైడ్రాలిక్ వ్యవస్థ ఫెయిలైనట్లు గుర్తించిన పైలెట్, కో పైలెట్…చాకచక్యంగా వ్యవహరించారు. విమానంలో ఉన్న ఇంధనాన్ని నిర్దేశిత స్థాయిలో తగ్గిస్తే…సేఫ్ ల్యాండ్ చేయోచ్చన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే విమానాన్ని గాల్లోనే రెండు గంటల పాటు చక్కర్లు కొట్టించారు. విమానంలో ఇంధనం ఎక్కువగా ఉంటే…బరువు ఉంటుంది. దీంతో సేఫ్ ల్యాండ్ చేయడానికి ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. ఈ కారణంతోనే పైలెట్, కో-పైలెట్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తిరుచ్చి ప్రాంతంలోనే రెండు గంటల పాటు చక్కర్లు కొట్టడంతో….విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 141 మంది ప్రయాణికులు సేఫ్ గా ల్యాండ్ అవుతుందా ? ప్రాణాలతో బతికి ఉంటామా ? అన్న టెన్షన్ లో పడిపోయారు. అయితే ఎవరికి చిన్న గాయం లేకుండా పైలెట్, కో-పైలెట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. అప్పటికే అంబులెన్స్ లు, మెడికల్ సిబ్బందిని సిద్ధం చేశారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఊపిరిపీల్చుకున్నారు.
బెల్లీ ల్యాండింగ్ తో ప్రయాణికులు సేఫ్
విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ల్యాండింగ్ గేర్ అనేది ప్రధానం. ఇది విమాన చక్రాలు, స్ట్రట్స్, షాక్ అబ్సార్బర్స్ తో అనుసంధానమై పని చేస్తుంది. ఇందులో సమస్య ఏర్పడి చక్రాలు తెరుచుకోని పరిస్థితుల్లో బెల్లీ ల్యాండ్ చేస్తారు. అంటే విమానాన్ని చక్రాల ద్వారా కాకుండా విమానం మధ్య భాగాన్ని నేలకు తాకేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే విమానం బెల్లీ భాగాన్ని నేలకు తాకిస్తారు. ఎలాంటి ఆప్షన్లు లేని సమయంలోనే బెల్లీ ల్యాండింగ్ ను వినియోగిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా…కొంచెం తేడా జరిగినా…ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు ఉంటుంది. అందుకే చివరి నిమిషంలో పైలెట్, కో-పైలెట్ దీన్ని లాస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటారు.
పైలెట్, కోపైలెట్ సమయస్ఫూర్తి
ఎయిరిండియా విమానం AXB 613ని సేఫ్ ల్యాండ్ చేయడంలో పైలెట్, కోపైలెట్ చాకచక్యంగా వ్యవహరించారు. ఒక్క ప్రయాణికుడికి చిన్న గాయం కాకుండా జాగ్రత్తగా బెల్లీ ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 141 మంది ప్రయాణికులు, ఇతర సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పైలెట్, కోపైలెట్ సమయస్ఫూర్తిని కొనియాడారు. సోషల్ మీడియాలోనూ పైలెట్, కో-పైలెట్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డీజీసీఏ విచారణకు ఆదేశం
ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం హైడ్రాలిక్ ఫెయిల్ అవడంపై కేంద్ర విమానయాన శాఖ విచారణకు ఆదేశించింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని…వారి భద్రతే తమకు ప్రాధాన్యమన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసిన పైలెట్, కోపైలెట్ పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి సైతం విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంపై పైలెట్, కోపైలెట్ ను అభినందించారు.