తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎవరు గుర్తించడం లేదా ? పదే పదే ముఖ్యమంత్రికి అవమానాలు జరుగుతున్నాయా ? సొంత కేబినెట్ మంత్రులు పట్టించుకోవడం లేదా ? ప్రపంచ తెలుగు సమాఖ్య సదస్సులోనూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించారు ? ఇదే కార్యక్రమంలో నటి జయసుధ...కనీసం నమస్కారం పెట్టలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి...వరుస అవమానాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనే కాదు...తెలంగాణలోనూ ఆయన్ను సీఎంగా గుర్తించే వారు కరువయ్యారు. అటు రాజకీయాల్లో...ఇటు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా ఆయనకు ప్రాధాన్యత దక్కడం లేదు. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సీఎం కావడాన్ని సొంత పార్టీ నేతలే కాదు...టాలీవుడ్ జనాలు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన్ను పదే పదే అవమానించేలా వ్యవహరిస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి మర్యాద ఇవ్వకపోతే ఏమవుతుంది ? మనల్ని ఏం చేయలేరు...కాదు కాదు...ఏం పీకలేరు అన్న ఫీలింగ్ కి వచ్చేశారు. పుష్ప-2 మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడిన అల్లు అర్జున్...టికెట్ల ధరల పెంపునకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యమంత్రి...ముఖ్యమంత్రి...ఆ...ఉ...అంటూ రెండు సార్లు చెప్పిన తర్వాత...మాట మార్చేశాడు. మాట్లాడి మాట్లాడి గొంతు మారిపోయిందంటూ కవరింగ్ ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ప్రస్తావించాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు తెలియకుండా యాక్టర్ ఎలా అయ్యావంటూ....సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను చెడుగుడు ఆడుకున్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాల్లోనూ...రేవంత్ రెడ్డి ఘోర అవమానం జరిగింది. యాంకరింగ్ చేస్తున్న వ్యక్తి...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుకు బదులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో ఆహ్వానం పలికారు. తర్వాత గొంతు సవరించుకొని...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్టేజ్ పైకి ఆహ్వానించారు. అయితే ఇదంతా రేవంత్ రెడ్డిని అవమానించడానికే ఇలా వ్యవహరిస్తున్నారా ? లేదంటే కావాలనే చేస్తున్నారా ? అన్నది మాత్రం తెలియడం లేదు. ఇదే సదస్సులో స్టేజ్ పైన ఆశీనులయ్యారు రేవంత్ రెడ్డి. యాంకర్ సహజ నటి జయసుధకు ఆహ్వానం పలికారు. ఆమె స్టేజ్ ఎక్కగానే అక్కడున్న వారికి నమస్కారం పెట్టింది. రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లే సరికి...చూసిచూసినట్లు పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఢిల్లీలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతిమయాత్రలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. వాహనంలో బయలుదేరే ముందు...మన్మోహన్ పార్థీవదేహం వద్ద నిల్చున్నారు. రేవంత్ రెడ్డిని మన్మోహన్ సింగ్ రెండో కుమార్తె గుర్తు పట్టలేకపోయారు. మీరు ఎవరు అంటూ ఆమె ప్రశ్నించడంతో..మొదట షాక్ అయ్యారు. ఆ తర్వాత అసలు విషయాన్ని చెప్పారు రేవంత్ రెడ్డి. మన్మోహన్ సింగ్ కుమార్తె విదేశాల్లో ఉండటంతో రేవంత్ రెడ్డి గురించి తెలియకపోవచ్చు అనుకుందాం. మరి సొంత కేబినెట్ మంత్రులకు ఏమైంది...వాళ్లు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదా ? లేదంటే తాము సీనియర్లు అన్న ధోరణితో ఉన్నారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో పాటు సీఎస్, ఐఏఎస్ లు వచ్చారు. వారంతా కూర్చున్నారు. కొంత ఆలస్యంగా వచ్చారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిసినా..చూసినా...ఎవరు పట్టించుకోలేదు. సీఎం వస్తే లేచి నిలబడాలి...నమస్కారం పెట్టాలన్న ధ్యాసే లేదు.[embed]https://www.youtube.com/watch?v=DxrUhV7SL0A[/embed]