ఎవరీ జయ కిషోరి ? ఎందుకింత ఫ్యాన్ ఫాలోయింగ్
జయ కిషోరి శర్మ. ఈమె పేరు చాలా మందికి తెలియకపోవొచ్చు కానీ ఫేస్ తెలియనివాళ్లు మాత్రం ఉండరు. ఎందుకంటే ఈమె షోషల్ మీడియాలో అంత ఫేమస్. ఆధ్యాత్మిక భోదనలు, భక్తి గీతాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు జయ కిషోరి.
జయ కిషోరి శర్మ. ఈమె పేరు చాలా మందికి తెలియకపోవొచ్చు కానీ ఫేస్ తెలియనివాళ్లు మాత్రం ఉండరు. ఎందుకంటే ఈమె షోషల్ మీడియాలో అంత ఫేమస్. ఆధ్యాత్మిక భోదనలు, భక్తి గీతాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు జయ కిషోరి. సోషల్ మీడియాలో ఆమెకు మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉంటారు. ఆమె ఏం మాట్లాడిని క్షణాల్లో కోట్ల మందికి ఆ మెసేజ్ రీచ్ అవుతుంది. ఆమె మీటింగ్ పెడుతోంది అంటే ఎగబడి మరీ టికెట్లు కొనుక్కుని ఆమె మాటలు వినేందుకు ప్రజలు వస్తారు. ఆధ్యాత్మికత విభాగంతో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అంటే ఆవిడ చాలా ఎజ్డ్ పర్సన్ అనకుంటుంన్నారేమో.. తప్పు.. ఆమె ఏజ్ జస్ట్ 29 ఇయర్స్.
1995 జులైలో రాజస్థాన్‌లోని సుజన్ ఘడ్‌లో జన్మించింది జయ కిషోర్. వాళ్లది చాలా ఆధ్యాత్మిక కుటుంబం. అందుకే చిన్న తనంలోనే అటువైపు అడుగులు వేసింది కిషోరి. కేవలం ఏడేళ్ల వయసులోనే ఆధ్యాత్మిక బోధనలు ఇవ్వడం ప్రారంభిచింది. స్కూల్‌లో ఉన్న సమయంలో దైవ గీతాలకు డాన్స్ ప్రదర్శనలు ఇచ్చేది. మహాదేవి బిర్లా వల్డ్ అకాడమీ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆధ్యాత్మిక పాఠాలు చెప్తూనే కలకత్తా శ్రీ శిక్షాయతన్ విద్యా నికేతన్ నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మొదట్లో జయ కిషోరికి అంతా గుర్తింపు లేదు. కేవలం రాజస్థాన్ పరిధిలో మాత్రమే ఆమెను గుర్తు పట్టేవాళ్లు. కానీ తరువాత జయ కిషోరి ఆల్బమ్స్ చేయడం ప్రారంభించింది. దాదాపు 20కి పైగా ఆధ్యాత్మికతకు సంబంధించిన ఆల్బమ్స్ చేసింది.
వీటిలో శివస్తోత్ర, సుందరాకాండ్, లగన్ తుమ్‌సే లగా, ఠాగూర్ జీ ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా జయ కిషోర్ పేరు మార్మోగిపోయింది. ఆమె పాఠలకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఎంటర్ అవ్వడంతో జయ కిషోర్ ఫేమ్‌కు తిరుగులేకుండా పోయింది. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్స్‌ను కిషోరి సంపాదించుకుంది. ఆధ్యాత్మిక విభాగంలో కిషోరి చేసిన సేవలకు గానూ ఆమెకు ఆదర్శ్ యువ ఆధ్యాత్మిక గురు పురస్కారం, సమాజ్ రతన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌లు వచ్చాయి. ఇంత ఫేమ్ సంపాదించుకున్న జయ కిషోర్ రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో 2 లక్షలు విలువ చేసే క్రిస్టియన్ డియోర్ బ్యాగ్‌తో కనిపించడం వివాదాస్పదంగా మారింది. ఆద్మాత్మిక బోధనలు చేసే కిషోర్ ఇంత లగ్జరీ బ్యాగ్‌తో కనిపించడం.. అందులోని ఆ బ్యాగ్ దూడల చర్మంతో తయారు చేసే బ్యాగ్ అవ్వడంతో అంతా కిషోరి విమర్శించారు. కానీ తాను సాధ్విని కాదని.. డబ్బు సంపాదించొద్దని తాను ఎప్పుడూ ఎవరికకీ చెప్పలేదని క్లారిటీ ఇచ్చాన కిషోర్. ఆధ్యాత్మికంగా బతకలం అంటే డబ్బుకు దూరంగా బతకడం కాదని క్లారిటీ ఇచ్చారు.