TOP STORY: ఎవడు ఈ రాజ్ పాకాల?
జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరోసారి రాజ్ పాకాల పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. ఎవరు ఈ రాజ్ పాకాల? అంత ప్రముఖుడా? తెలంగాణ ఉద్యమ వీరుడా? విద్యార్థి ఉద్యమాలు చేశాడా? రాజకీయ నాయకుడా? సోషల్ వర్క్ రా ?ఏం చేస్తుంటాడు? ఎందుకు ఇతని గురించి ఇంత చర్చ?
జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరోసారి రాజ్ పాకాల పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. ఎవరు ఈ రాజ్ పాకాల? అంత ప్రముఖుడా? తెలంగాణ ఉద్యమ వీరుడా? విద్యార్థి ఉద్యమాలు చేశాడా? రాజకీయ నాయకుడా? సోషల్ వర్క్ రా ?ఏం చేస్తుంటాడు? ఎందుకు ఇతని గురించి ఇంత చర్చ? హైదరాబాదులో డ్రగ్స్ ,పబ్స్ ఈ రెండు తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా రాజ్ పాకాల ఎవ డో చెప్తారు. 2014 నుంచి 24 వరకు హైదరాబాదులో చాలా అసాంఘిక కార్యక్రమాలకు తెర వెనక చక్రం తిప్పిన ఈ రాజ్ పాకాల… బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్వయానా బావమరిది.
జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మద్దూరి విజయ్ కి డ్రగ్స్ ఇచ్చింది పాకాల ఏనని తెలిసిపోయింది. ఆడ మగ కలిపి 35 మందితో మందు పార్టీ నిర్వహిస్తున్న రాజ్ పాకాల ఫారెన్ విస్కీ తోపాటు, అనుమతి లేని ఇతర రాష్ట్రాల లిక్కర్ ని కూడా ఈ పార్టీలో పెట్టేసాడు. అసలు ఈ పార్టీకి ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. ఇంకా తన బావ ,మామ తెలంగాణకు చక్రవర్తులుగానే ఉన్నారనే భ్రమలో ఉండిపోయాడు రాజ్ పాకాల.
తెలంగాణ వచ్చిన తర్వాత 2014… 24 మధ్య టిఆర్ఎస్ లీడర్లు చెలరేగిపోయారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ,లిక్కర్ బిజినెస్, బార్లు, పబ్బులు, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫార్మా , మైన్స్ అన్నిటిలోనూ గల్లా పట్టుకొని వాటాలు గుంజుకున్నారు. ప్రతి దాంట్లోనూ ఆదాయాన్ని సమకూర్చుకున్నారూ. కేటీఆర్, కెసిఆర్, సంతోష్ రావు, హరీష్ రావు, కవిత ఈ ఐదు పేర్లు చెప్పి అన్ని రంగాల్ని అల్లాడించారు. అలాంటి వారిలో రాజ్ పాకాల ఒకరు. కెసిఆర్ వియ్యంకుడు పాకాల హరినాధరావు కొడుకు, కేటీఆర్ బామ్మర్ది, కేటీఆర్ భార్య షాలిమా సోదరుడు ఈ రాజ్ పాకాల.2014లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజ్ పాకాల మొదట రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూరాడు. దాంతోపాటు ఐటీ కంపెనీ పెట్టాడు. అయితే ఇవి కేవలం పైన కనిపించే బిజినెస్ లు మాత్రమే.
రాజ పాకాల చేసిన అసలైన వ్యాపారం హైదరాబాదులో లిక్కర్, పబ్బులు ,క్లబ్బులు. ఆయన సొంతంగా, భాగస్వామిగా నాలుగు పబ్బులు నిర్వహించేవాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఫాస్ట్, రోడ్ నెంబర్ 36 లో 800 తోపాటు మరికొన్ని పబ్స్ లో రాజ్ పాకలకు వాటాలు ఉన్నాయి. అలాగే సంతోష్ రావు, మరికొందరు బినామీలతో కలిసి జూబ్లీహిల్స్ లో టానిక్ అనే పెద్ద లిక్కర్ మార్ట్ ని కూడా రాజ్ పాకాల నడిపాడు. హైదరాబాదులో ఏ పబ్బు పెట్టాలన్న మొదట పాకాలని కాంటాక్ట్ చేయాల్సిందే. అలాగే ఏ పబ్లో గొడవ అయినా అతనికి ఫోన్ కాల్ వెళ్లాల్సిందే. రాజ్ పాకల నుంచి ఫోన్ వస్తే ఆ రోజుల్లో పోలీసులు ఆ పబ్ ని ,క్లబ్ ని, బార్ ని యదేచ్చగా వదిలేసేవారు. కొన్ని పబ్స్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, వాటి వెనక రాజ పాకాల ఉన్నాడు అనేది బాగా వినిపించేది ఆరోజుల్లో. రాజ్ పాకాల ఈవెంట్స్ నౌ అనే సంస్థను కూడా స్థాపించాడు.
తెలంగాణలో ప్రభుత్వ లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ లో ఏ పెద్ద ఈవెంట్ జరిగినా అది ఈవెంట్స్ నౌ సంస్థకి కి ఇచ్చేయాల్సిందే. ప్రో కబడ్డీ గానీ, క్రికెట్ మ్యాచ్లు గాని, ఐపీఎల్ గాని ఇది ఏ కార్యక్రమం అయినా వాటినీ ఈవెంట్స్ నవ్వే నిర్వహించేది. ఆ కార్యక్రమం టికెట్లు అన్నీ అమ్ముకునేది. రాజ్ పాకాలను దాటి మరి ఎవరు ఆ ఈవెంట్లను కైవసం చేసుకునే సాహసం చేసేవారు కాదు. అంతగా హవా నడిపించాడు రాజ్ పాకాల. హైదరాబాదులో ఈ టి జి గ్లోబల్ సర్వీసెస్ అనే డిజిటల్ కంపెనీని కూడా పాకాల నడుపుతున్నాడు. కేటీఆర్ మినిస్టర్ గా ఉన్న పదేళ్లు బామ్మర్ది రాజ్ పాకాల పట్టిందల్లా బంగారం అయింది. కేటీఆర్ పేరు చెప్పి యదేచ్చగా ఐటీ రంగంలోనూ, ఎక్సైజ్ లో దందాలు చేశాడని ఆరోపణ ఉంది. కేటీఆర్ చలవతోనే తెలంగాణలో అంతర్జాతీయ ఈవెంట్లన్నీ రాజ్ పాకాలన్నే నిర్వహించాడు. ఆయన దగ్గర సబ్ కాంట్రాక్టులు చేసుకొని బతికేవి పెద్ద పెద్ద కంపెనీలు.
సిటీలో బిజినెస్మేన్లంతా రాజ్ పాకాల పరిచయం కోసం, షేక్ అండ్ ఇవ్వడం కోసం తహతహలాడిపోతుండేవారు. మధ్యతరగతి కి చెందిన పాకాల హరినాధరావు కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వియ్యంకుడు పేరు చెప్పి బయట చిన్నాచితక వసూళ్లు చేస్తుండేవాడు. ఇది తెలిసి కెసిఆర్ ఆయన నీ బాగా కంట్రోల్ చేశాడు. కానీ కేటీఆర్ మాత్రం తన బావమరుదులు రాజ్ పాకాల , శైలేంద్ర లను మాత్రం తెలంగాణను దున్నుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు . సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లతో పరిచయాలు, వాళ్లతో ఈవెంట్లు నిర్వహించడం, పబ్బులకి ఆహ్వానించడం, అల్లు అర్జున్ లాంటి వాళ్ళతో పార్ట్నర్షిపులు కలవడం ఒకటి కాదు రాజ పాకాల గడచిన పదేళ్లలో చేసి నిర్వాకాలు. సిటీలో ఏ పబ్ కి పర్మిషన్ రావాలన్నా ముందు రాజ పాకాల అని కాంటాక్ట్ చేయాల్సిందే.
ప్రభుత్వం మారిన తర్వాత కూడా పాకాల వ్యవహారాలు అలాగే కొనసాగాయి. ఒకప్పుడు నెల జీతంతో బతికిన పాకాల కుటుంబం ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫామ్ హౌస్ కొనుక్కోగలిగింది. చాలా కంపెనీల్లో డైరెక్టర్లుగా కూడా అయిపోయారు. వాటాల సంపాదించారు. ఇవన్నీ కెసిఆర్ కేటీఆర్ చలవే. ఇప్పుడు కూడా డ్రగ్స్ కేసులో రాజ్ పాకాలను నిందితుడిగా చేయడం అంతా తేలిక కాదు. ప్రతి విషయానికి తెలంగాణ ట్యాగ్ లైన్ ని తగిలించే కెసిఆర్ కుటుంబం ఇప్పుడు ఇప్పుడు డ్రగ్స్ కేసులో రాజ పాకాల ఉండటాన్ని కూడా తెలంగాణని అవమానించడమేనని చెప్తారేమో