కొడాలి నానీకి సర్జరీ చేసే పాండా ఎవరు..?
మాజీ మంత్రి కొడాలి నానీకి గుండె ఆపరేషన్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంతో యాక్టివ్ గా కనపడే కొడాలి నానీకి ఇటీవల గుండె ఆపరేషన్ జరగడం, ఆయన ప్రత్యేక విమానాశ్రయంలో ముంబై తరలించడం వంటివి జరిగాయి.

మాజీ మంత్రి కొడాలి నానీకి గుండె ఆపరేషన్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంతో యాక్టివ్ గా కనపడే కొడాలి నానీకి ఇటీవల గుండె ఆపరేషన్ జరగడం, ఆయన ప్రత్యేక విమానాశ్రయంలో ముంబై తరలించడం వంటివి జరిగాయి. దీనితో ఆయన అభిమానులతో పాటుగా, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఆయన సర్జరీ చేసే వైద్యుడు ఎవరూ అంటూ జనాలు సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు. ఆయన ఎవరో, ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం.
ఆయన పేరే డాక్టర్ రమాకాంత పాండా, ఇండియాలోనే ఫేమస్ కార్డియాక్ సర్జన్. కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జరీకి చీఫ్ కన్సల్టెంట్. ముంబైలోని బాంద్రా -కుర్లా కాంప్లెక్స్ లో ఆసియన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలోని స్పెషాలిటీ కార్డియాక్ కేర్ హాస్పిటల్ కూడా ఆయనకు ఉంది. అలాగే ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ . 2002లో, అతను దేశంలో ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్‌ను స్థాపించారు. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. దాదాపు 30,000 విజయవంతమైన కార్డియాక్ సర్జరీలను నిర్వహించారు.
వీటిలో 2,000 కంటే ఎక్కువ.. వేరే వైద్యులు చేసి సగంలో ఆపేసిన సర్జరీలు ఉండగా.. 6,000 పైగా హై-రిస్క్ సర్జరీలు ఉన్నాయి. ఆయనకు 2010లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా ప్రధానం చేసింది. బైపాస్ సర్జరీలో 99.8% సక్సెస్ రేటుతో, ఆయనను ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ కార్డియాక్ సర్జన్‌గా చెప్తారు. 2009లో, అప్పటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజయవంతంగా సర్జరీ చేసిన టీంని పాండా లీడ్ చేసారు. లాలూ ప్రసాద్ యాదవ్, తరుణ్ గొగోయ్, నరసింఘ మిశ్రా, డి రాజా, రాజీవ్ శుక్లా, పలువురు రాజకీయ నాయకులకు ఆయన ఆపరేషన్లు నిర్వహించారు.
రమాకాంత్ పాండా.. ఓడిస్సాలోని జాజ్‌పూర్ జిల్లాలోని దామోదర్‌పూర్ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక రైతు. జాజ్‌పూర్‌లోని ప్రీతిపూర్‌లో బినోద్ బిహారీ హైస్కూల్‌లో చదువుకున్నారు. కటక్ లోని SCB మెడికల్ కాలేజీలో MBBS చదివారు. 1980 – 1985 మధ్య AIIMS ఢిల్లీలో శస్త్రచికిత్స, గుండె సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. ఆ తర్వాత అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రాక్టీస్ చేసారు. యూకేలో హేర్‌ఫీల్డ్ హాస్పిటల్ లో కార్డియాక్ సర్జన్ ఫ్లాయిడ్ లూప్, ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ మాగ్డి యాకౌబ్ కింద ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు.