నిత్యానంద ఆస్తులు ఎవరికి..?
పముఖ స్వయం ప్రకటిత స్వామీజీ.. నిత్యానంద విషయంలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అత్యాచారం మరియు లైంగిక వేధింపుల ఆరోపణల నేపధ్యంలో 2019 లో దేశం నుండి పారిపోయిన నిత్యానంద మరణించాడని ఇప్పుడు వార్తలు

పముఖ స్వయం ప్రకటిత స్వామీజీ.. నిత్యానంద విషయంలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అత్యాచారం మరియు లైంగిక వేధింపుల ఆరోపణల నేపధ్యంలో 2019 లో దేశం నుండి పారిపోయిన నిత్యానంద మరణించాడని ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆయన మరణించినట్టు అధికారికంగా ఏ వార్త బయటకు రాలేదు. నిత్యానంద మేనల్లుడు శ్రీ నిత్య సుందరేశ్వరానంద నిన్న రోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఆధ్యాత్మిక ప్రసంగంలో దిగ్భ్రాంతికరమైన ప్రకటన చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
హిందూ ధర్మాన్ని కాపాడటానికి నిత్యానంద తన జీవితాన్ని త్యాగం చేశాడని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం ఆయన అనుచరులను ఆందోళనకి గురి చేసిందని వెల్లడించారు. నిత్యానంద నిజంగా చనిపోతే… ఆయన రూ. 10,000 కోట్ల సంపదను ఎవరు పొందుతారు అనే దానిపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఆయన ఆస్తులను రంజిత క్లెయిమ్ చేస్తుందా లేదా మరొకరు ఎవరైనా ముందుకు వస్తారా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆయన ప్రస్తుత ఆచూకీ ఇంకా తెలియలేదు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో జనవరి 1, 1978న జన్మించిన 47 ఏళ్ళ నిత్యానంద ప్రస్తుతం కైలాసంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 2019 లో ఆయన దేశం నుంచి పారిపోగా ఆ తర్వాత కైలాసం అనే దేశాన్ని స్తాపించినట్టు వార్తలు వచ్చాయి.