ఎవరీ ర్యాట్ హోల్ మైనర్స్ ? ఏం చేస్తారు?
ఉత్తరఖండ్ లోని ఉత్తర కాశీలోని సొరంగంలో...41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారందర్ని బయటకు తీసుకొచ్చేందుకు...ఎన్ని ప్రయత్నాలు చేయాలో...అన్ని చేసింది అక్కడి సర్కార్.

ఉత్తరఖండ్ లోని ఉత్తర కాశీలోని సొరంగంలో…41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారందర్ని బయటకు తీసుకొచ్చేందుకు…ఎన్ని ప్రయత్నాలు చేయాలో…అన్ని చేసింది అక్కడి సర్కార్. గంటలు, రోజులు, వారాలు ఇలా… 17 రోజులు పూర్తయ్యాయి. 41 మంది కార్మికులు టన్నెల్ లోపలే చిక్కుకుపోయారు. వాళ్లంతా ప్రాణాలోనే ఉన్నారా ? ఎంత మంది చనిపోయి ఉంటారా ? కొందరైనా ప్రాణాలతో బతికే ఉంటారా అన్న ప్రశ్నలు వచ్చాయి. బాధితుల కుటుంబాలు…క్షణమొక యుగంలా గడిపారు. విదేశీ నిపుణులను రప్పించారు. వాళ్లు ట్రై చేశారు. కానీ 41 మంది కార్మికులను మాత్రమే తీసుకురాలేకపోయారు. ప్రభుత్వంతో పాటు బాధిత కుటుంబాలు ఆశలు వదులుకున్నాయి.
ఉత్తరాఖండ్ టన్నెల్ లోపల చిక్కుకుపోయిన వారి కోసం ప్రభుత్వం అనేక మార్గాలు అనుసరించింది. సొరంగంలోని కూలీలను రెండు వారాలు బయటకు తీసుకురాలేకపోయారు. అయితే ర్యాట్ హోల్ మైనింగ్‌తో ఒక్క రోజులోపే ఫలితం వచ్చేసింది. ప్రభుత్వం ఆశలు వదులుకున్న సమయంలో…ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగారు. ప్రాణాలకు తెగించి 41 మందిని కాపాడేందుకు రెండున్నర కిలోమీటర్ల సోరంగం లోపలికి వెళ్లారు. 24 గంటల్లో ఆపరేషన్ విజయవంతం చేశారు. 41 మందికి రెండున్నర కిలోమీటర్ల సొరంగం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చప్పట్లు, జేజేలు, ప్రశంసలు కురిపించారు. ఉత్తరాఖండ్ ఘటనలో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన వాళ్లే…ర్యాట్ హోల్ మైనర్స్.
తాజాగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దింపింది. ప్రత్యేక విమానంలో వీరిని రప్పించింది. ఆరుగురితో కూడిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందంలో…నసీం, ఖలీల్ ఖురేషీ, మున్నా, మహమ్మద్ రషీద్, ఫిరోజ్ ఖురేషీ, మహమ్మద్ ఇర్షాద్‌లు ఉన్నారు. 4 అడుగుల వెడల్పు మించని ప్రదేశంలో…బొగ్గు గనుల్లో సన్నటి మార్గాలను తవ్వడంలో ర్యాట్ హోల్ మైనర్స్ నిపుణులు. ఒక్కరు మాత్రమే పట్టే సోరంగంలో బొగ్గు లేయర్‌ను చేరుకున్నాక.. సొరంగం తవ్వడం ర్యాట్ హోల్ మైనర్స్ స్పెషాలిటీ. ఇది ఎలుకలు తవ్వే కందకాలను పోలి ఉంటుంది. అందుకే వీరికి ర్యాట్ హోల్ మైనర్స్ అనే పేరు పెట్టారు. బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక రంధ్రాలు తవ్వినట్లు.. భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీయడాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ జీవనోపాధి కోసం వేల మంది ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తున్నారు. జార్ఖండ్, బీహార్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ర్యాట్ హోల్ మైనర్స్…బొగ్గును తవ్వడం వీరి ప్రత్యేకత. పర్యావరణ కోణంలోనూ ర్యాట్ హోల్ మైనర్స్ పై నిషేధం విధించింది.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. 13.5 కిలోమీటర్ల వరకు సహాయ బృందాలు వెళ్లాయి. మరో అర కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడ్డాయి. అడ్డంకులను అధిగమించి ఘటనాస్థలికి చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. 11 కిలోమీటర్ల నుంచి 3 అడుగుల మేర వరకు నీరు నిలిచిపోవడంతో సహయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. నీటి ఉద్ధృతికి 80 మీటర్ల వెనక్కి టన్నెల్ బోరింగ్ మిషన్ వచ్చిందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. టీబీఎం వెనక్కి రావడంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడిందని అంటున్నారు. ఈ 200 మీటర్ల గ్యాప్‌లోనే 8 మంది చిక్కుకున్నారని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. చిక్కుకున్న వారిని పిలుస్తూ స్పందన కోసం ఈ బృందాలు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెస్క్యూ బృందాలకు టీబీఎం వెనుక భాగం కనిపించింది. పైకప్పు కూలడంతో మట్టితో టీబీఎం కూరుకుపోయింది. టీబీఎంకు ముందు భాగంలో 8 మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. ఇద్దరు ఇంజినీర్లు, టీబీఎం ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఇందులోనే చిక్కుకున్నారు.