CHANDRABABU NAIDU: టీడీపీకి బాలకృష్ణే దిక్కా..? పార్టీని నడిపించేదెవరు..?
చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగిస్తూ కోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపు రెండువారాలపాటు ఆయన బయటికి రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో టీడీపీని నడిపించే నాయకుడే కరువయ్యారు.
CHANDRABABU NAIDU: ప్రస్తుతం టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సరైన నాయకుడు అవసరం. అందుకే పార్టీ బాధ్యతలను నారా, నందమూరి కుటుంబాలు కలిసి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగిస్తూ కోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపు రెండువారాలపాటు ఆయన బయటికి రాకపోవచ్చు.
ఈ నేపథ్యంలో టీడీపీని నడిపించే నాయకుడే కరువయ్యారు. దిశానిర్దేశం చేసే వాళ్లెవరూ లేరు. వ్యూహాలు రచించడంలో చంద్రబాబు దిట్ట. ఏదో ఒక కార్యక్రమం ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తారు. ప్రత్యర్థులకు ధీటుగా వ్యూహాలు రచిస్తారు. అయితే, చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో ఆయన స్థాయిలో పార్టీని నడిపించే వాళ్లే లేకుండాపోయారు. లోకేష్‌కు కొంత ఆదరణ ఉన్నా.. ఇప్పుడిప్పుడే రాజకీయంగా పరిణతి చెందుతున్నారు. లోకేష్‌కు ఇంకా పూర్తిస్థాయి అనుభవం, అవగాహన లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలకృష‌్ణ అయితే కొంత వరకు మాస్ ఇమేజితో నడిపించగలడు. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీకి బాలకృష‌్ణ స్టార్ క్యాంపెయినర్‌గా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ.. బాలకృష్ణపైనే ఆశలు పెట్టుకుంది.
ఆయన ప్రచారం చేస్తే పార్టీకి అంతో ఇంతో కలిసొచ్చే అవకాశం ఉంది. ఏపీలోనూ సరైన నేత లేరు కాబట్టి.. ఆ బాధ్యతలు అటు నారా లోకేష్, బాలకృష్ణతోపాటు, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి తీసుకున్నారు. సోషల్ మీడియాను బ్రాహ్మణి పర్యవేక్షిస్తున్నారు. నారా భువనేశ్వరి త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో చంద్రబాబు అరెస్టుతో కుటుంబమంతా రాజకీయాలు చేయాల్సి వస్తోంది.