YSRCP: ఇదేంటి జగన్.. ప్రజల సొమ్ముతో పార్టీ ప్రచారమా..? ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విచిత్ర వైఖరి..
ప్రజల సొమ్ముతో YCP.. పార్టీ ప్రచారాన్ని నిర్వహించుకుంటోందని టీడీపీ, జనసేన మండిపడుతున్నాయి. అందులో తప్పేముంది..? ప్రభుత్వం, పార్టీ వేరు కాదని, గవర్నమెంట్ అడ్వైజర్ సజ్జల రామకృష్ణా రెడ్డి సమర్ధించుకోవడం విమర్శలకు దారితీస్తోంది.
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. Why Ap needs Jagan అనే ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులు వైసీపీ జెండాలు ఎగరవేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజల సొమ్ముతో YCP.. పార్టీ ప్రచారాన్ని నిర్వహించుకుంటోందని టీడీపీ, జనసేన మండిపడుతున్నాయి. అందులో తప్పేముంది..? ప్రభుత్వం, పార్టీ వేరు కాదని, గవర్నమెంట్ అడ్వైజర్ సజ్జల రామకృష్ణా రెడ్డి సమర్ధించుకోవడం విమర్శలకు దారితీస్తోంది.
CM KCR: గజ్వేల్‌లో భారీగా నామినేషన్లు.. కేసీఆర్‌ను ఓడిస్తామంటున్న బాధితులు
Why Ap needs Jagan పేరుతో ఏపీ సర్కార్ ఈమధ్యే ఓ ప్రోగ్రామ్ చేపట్టింది. ఇది చూడగానే ఎవరైనా వైసీపీ కార్యక్రమం అనుకుంటారు. కానీ ఇది ప్రభుత్వ కార్యక్రమమే అని అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో వైసీపీ లీడర్లు పాల్గొంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసులపై వైసీపీ జెండాలు ఎగరవేస్తున్నట్టు మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏపీకి మళ్ళీ జగన్ ఎందుకు కావాలి అనే కాన్సెప్ట్ లో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ ని అధికారులతో నిర్వహించడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో పెద్ద ఎత్తున పబ్లిక్ మనీ వేస్ట్ చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
జగన్ బొమ్మను ముద్రించి పెద్ద ఎత్తున పాంప్లేట్స్, టోపీలు, సంచులు ప్రింట్ చేయించారనీ అందుకోసం వందల కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపిస్తున్నారు. వైసీపీ సొంతంగా కార్యక్రమం చేసుకుంటే వైసీపీ నేతలే పాల్గొనాలి. కానీ అధికారులను ఎందుకు ఇన్ వాల్వ్ చేస్తున్నారు..? ప్రభుత్వ సొమ్ముతోనే పార్టీ ప్రచారం చేసుకోవడం ఏంటని టీడీపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. బటన్ నొక్కే మీటింగ్స్ లోనూ సీఎం జగన్.. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. పేరుకే ప్రభుత్వ సభలు. పూర్తిగా వైసీపీ ప్రచార సభలుగా మారాయని టీడీపీ లీడర్లు మండిపడుతున్నారు. ఈమధ్య ఐ ప్యాక్ కోసం ఓ అధికారిని రిక్రూట్ చేయడానికి మార్కెంటింగ్ శాఖ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని కూడా తప్పుబట్టారు.
Karnataka Power politics : కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ..? కుమారస్వామి విమర్శలతో కొత్త రచ్చ
ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రోగ్రామ్ ను సమర్థించుకోవడం మరీ విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం, YCP వేర్వేరు కాదని ఆయన అనడం విమర్శలకు దారితీస్తోంది. అసలే అప్పుల ఊబిలో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇలా పార్టీ కార్యక్రమాలకు ప్రజల సొమ్ము ఖర్చుపెట్టడాన్ని జనం ప్రశ్నిస్తున్నారు.