పవన్ ఇలా అయిపోయాడేంటి? ఆ పొట్ట చూసి ఫ్యాన్స్ ఆవేదన.
కుంభమేళా.... గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తూ.... హారతీస్తున్న పవన్ కళ్యాణ్ ని చూసి సంతోష్ పడాల్సింది పోయి ఫ్యాన్స్ అంతా హర్ట్ అయిపోయారు.

కుంభమేళా…. గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తూ…. హారతీస్తున్న పవన్ కళ్యాణ్ ని చూసి సంతోష్ పడాల్సింది పోయి ఫ్యాన్స్ అంతా హర్ట్ అయిపోయారు. ఏంటి పవన్ కళ్యాణ్ ఎలా అయిపోయాడు?ఆ పొట్ట ఏంటి? ఆ చాతి ఏంటి? ఆ ఫేస్ ఏంటి? ఎలాంటి పవన్ కళ్యాణ్ ఎలా మారిపోయాడు? ఒకప్పుడు సన్నగా తీగల… ఉండేవాడుఎందుకిలా అయిపోయాడు…?. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు అందరూ ఇదే చర్చ.
అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి, బద్రి, ఖుషి మూవీస్ చూస్తే అప్పటి పవన్ కళ్యాణ్ కి ఇప్పటి పవన్ కళ్యాణ్ కి ఎంత తేడా అనిపిస్తుంది. సన్నగా వెదురుబద్దలా…. ఉండే పవన్ కళ్యాణ్, మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించిన పవర్ స్టార్… ఇప్పుడు ఇలా ముద్దపప్పుల అయిపోవడం చూసి ఫ్యాన్స్ అంతా ఆవేదం చెందుతున్నారు. ఈ బాడీతో మిగిలిన మూడు సినిమాలు ఎలా కంప్లీట్ చేస్తాడు? ఆ తర్వాత ఫ్యూచర్లో సినిమాలు చేయగలడా…. ఇంత వెయిట్ ఎలా పెరిగిపోయాడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫాన్స్ మధ్య జరుగుతున్న చర్చ ఇదే.
పవన్ కళ్యాణ్ మొదటి నుంచి సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయకపోయినా బాడీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండేవాడు. ఆయనకు హైదరాబాద్ బిర్యానీ చాలా ఇష్టమైన… ఎప్పుడో గాని తినేవాడు కాదు. భోజనం విషయంలో చాలా లిమిట్ గా ఉంటాడు.
అలాగే రోజువారి వర్కౌట్ చేయడం ద్వారా రెండు దశాబ్దాలుగా తన బాడీ వెయిట్ పెరగకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. బద్రి, ఖుషి, జానీ సినిమాల్లో మరీ బక్క పల్చగా ఉండేవాడు. కానీ వయసుతోపాటు కొద్దిగా వెయిట్ పెరిగినప్పటికీ…. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, సినిమాలు తర్వాత కూడా బరువు విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు.పెద్దగా భోజన ప్రియుడు కాకపోవడం కూడా పవన్ కు అడ్వాంటేజ్. అలాంటి పవన్ కళ్యాణ్ కుంభమేళాలో స్థూల కాయంతో దర్శనం ఇవ్వడం జనానికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన పూర్తిగా వర్కౌట్స్ వదిలేసినట్లుగా అర్థమవుతుంది.
ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడే రోజువారి దినచర్యలు దెబ్బతిన్నట్లు ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు…. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు… పార్టీ కార్యక్రమాలు… జనంలో తిరగడం వీటన్నిటితో పవన్ పూర్తిగా తన శరీరంపై ధ్యాస వదిలేసినట్లు ఆయన బాడీ చూస్తే అర్థమవుతుంది. సినిమాల్లో ఉన్నప్పుడు షూటింగులు లేని సమయంలో ఒకటి రెండుసార్లు వెయిట్ పెరిగినప్పటికీ…. వెంటనే అప్రమత్తమై డైట్ , ఎక్ససైజ్ తో ఆయన వెయిట్ కంట్రోల్ చేశాడు. ఇప్పుడు రాజకీయాల్లో పడిపోయి… అటు పాలన వ్యవహారాలు చూస్తూ పూర్తిగా శరీరాన్ని గాలికి వదిలేసాడు అనేది అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం పొట్ట బెలూన్ లో వేలబడిపోయింది, చాతి బాగా పెరిగిపోయింది. పవన్ వయసు ఇప్పుడు 56 ఏళ్ళు. సహజంగానే బాడీ మెటబాలిజం లో వచ్చే మార్పులు వల్ల వెయిట్ పెరుగుతారు. కానీ యోగ, ఎక్సర్సైజ్ ద్వారా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు చిరంజీవిని చూసి యంగ్ హీరోలు కూడా ఆశ్చర్య పడుతున్నారు. వెయిట్ కంట్రోల్ విషయంలో చిరంజీవి చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. అన్నగారు అంత స్లిమ్ గా మారిపోతే… తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం ఊహించని విధంగా ఊబకాయంతో దర్శనమిచ్చాడు జనానికి. పవను చూసి ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆందోళన చెందుతున్నారు కూడా. చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇలా ఉంటే ఆ సినిమాలు పూర్తి చేయగలుగుతాడా? అలాగే ఫ్యూచర్లో సినిమాలు పరిస్థితి ఏంటి? అసలు నటుడుగా కొనసాగుతాడా? అంత పొట్టతో ఉన్న పవన్ కళ్యాణ్ నీ జనం అసలు చూస్తారా…. అని చర్చించుకుంటున్నారు.ప్రతిపక్ష నేత జగన్ 52 ఏళ్ళ వయసులో చాలా ఫిట్ గా ఉన్నాడు.
ఆయన రోజు గంటన్నర పాటు వ్యాయామం చేస్తాడని పార్టీ వర్గాలు చెప్తుంటాయి. ఇక చంద్రబాబు సంగతి సరేసరి. తెల్లారి 4:30 కి లేచి యోగాతోనే ఆయన జీవితం మొదలవుతుంది.76 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు సూపర్ ఫిట్ గా ఉన్నారు. ఆయన భోజన అలవాట్లు గురించి దేశంలో పొలిటిషన్ అంతా చర్చించుకుంటూ ఉంటారు. ఇక స్థూలకాయంతో బాధపడిన లోకేష్ కూడా నానా తంటాలు పడి బాడీని తగ్గించుకొని ఫిట్టుగా తయారయ్యారు.పాలిటిక్స్ లోను… అడ్మినిస్ట్రేషన్ తోనూ బిజీ అయిపోయిన పవన్ ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసాడని కొందరు ఆవేదన చెందుతున్నారు. పవర్ స్టార్ మీరు హెల్త్ పై కాస్త దృష్టి పెట్టాలి. మరీ సిక్స్ ప్యాక్ చేయకపోయినా…. రోజువారి ఆరోగ్యాన్ని కచ్చితంగా మీరు మెరుగుపరచుకోవాలి…. పొట్ట తగ్గించాలి అని ట్వీట్లు చేస్తున్నారు ఫాన్స్.