హైడ్రాకు విస్తృత అధికారాలు ఎందుకు? షాక్ ఇచ్చిన హైకోర్ట్

హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రాకు అసలు విస్తృతాధికారాలు ఎందుకు కల్పించారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణా హైకోర్ట్ ఆదేశించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2024 | 11:41 AMLast Updated on: Oct 26, 2024 | 11:41 AM

Why Does Hydra Have Such Broad Powers Shocked High Court

హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రాకు అసలు విస్తృతాధికారాలు ఎందుకు కల్పించారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణా హైకోర్ట్ ఆదేశించింది. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ పై హైకోర్ట్ లో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాస రావుల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శులకు హైకోర్ట్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే సమయానికి వివరణ ఇస్తూ కౌంటర్ లు జారీ చేయాలని ఆదేశించింది. అనంతరం విచారణను మూడు వారాలు వాయిదా వేసింది సర్కార్. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 4ను సవాలు చేస్తూ మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమని, దాన్ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిల్ దాఖలు చేసారు.