పవన్ పై ప్రకాష్ రాజ్ కోపం ఏంటీ…? ఈ రెండు కారణాలేనా…?

“పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే కలెక్షన్ అంత ఉండదు నీ బడ్జెట్” మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు లక్ష్యంగా... సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్ ఇది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయం మొత్తం ప్రకాష్ రాజ్ గడిపింది మెగా ఫ్యామిలీతోనే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 7, 2024 | 01:59 PMLast Updated on: Oct 07, 2024 | 1:59 PM

Why Prakash Raj Serious On Pawan Kalyan

“పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే కలెక్షన్ అంత ఉండదు నీ బడ్జెట్” మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు లక్ష్యంగా… సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్ ఇది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయం మొత్తం ప్రకాష్ రాజ్ గడిపింది మెగా ఫ్యామిలీతోనే. అలాంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు బుసలు కొడుతున్నారు, పవన్ కళ్యాణ్ పై ట్వీట్ల కాట్లు వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ ఏం చేసినా తప్పే అన్నట్టు ఉంది ప్రకాష్ రాజ్ వైఖరి.

అసలు ఈ ఇద్దరికీ ఎక్కడ చెడింది అంటే… ఎవరికీ క్లారిటీ లేదు. ప్రకాష్ రాజ్ ఓటమి తర్వాత మెగా ఫ్యామిలీకి ఎందుకో దూరమయ్యారు. అది… జనసేన పార్టీ… బిజెపి పొత్తు పెట్టుకోవడం నచ్చకనా…? లేక మరేదైనా కారణమా అనే దానిపై క్లారిటీ లేదు. కాని పవన్ ను మాత్రం ప్రకాష్ రాజ్… లడ్డు వ్యవహారం తర్వాత దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు అర్ధం కాని పవన్… ప్రకాష్ రాజ్ కు నేరుగా కౌంటర్ ఇచ్చారు. అదే మీడియా సమావేశంలో సినిమా వాళ్లకు కూడా పవన్ నుంచి వార్నింగ్ వెళ్ళింది. ఆ తర్వాత తమిళ హీరో కార్తీ… పవన్ కు క్షమాపణలు చెప్పారు.

అది కూడా ప్రకాష్ రాజ్ కి నచ్చలేదు. దానిపై కూడా పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు నాలుగు రోజుల నుంచి పవన్ ను అదే పనిగా విమర్శిస్తూ ఎక్స్ లో ఘాటు పోస్ట్ లు పెడుతున్నారు. “పవన్ ఫుట్ బాల్ లాంటి వారు, పాలిటిక్స్ లో పవన్ ను ఎవరైనా ఉపయోగించుకుంటారు. పవన్ చెబుతున్నట్టు సనాతన ధర్మం, హిందూ ధర్మం ప్రమాదంలో లేవు. బీజేపీ మాత్రమే ఇబ్బందుల్లో ఉంది. సినిమాలు, రాజకీయాలు వేర్వేరని పవన్ తెలుసుకోవాలి. ఒక స్థిరమైన ఆలోచన ఉండాలి అని తాజాగా పవన్ పై ఎక్స్ లో పోస్ట్ చేసారు.

ఈ కామెంట్ చూసిన ఎవరికి అయినా… పవన్ కళ్యాణ్… బిజెపితో కలిసి వెళ్ళడం ప్రకాష్ రాజ్ కు నచ్చలేదు అనేది అర్ధమవుతుంది. 2019 ఎన్నికల సమయం నుంచి ప్రకాష్ రాజ్ వర్సెస్ బీజేపిగా ఉంది వాతావరణం. ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ రాకపోయినా ప్రకాష్ రాజ్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రకాష్ రాజ్ పై బిజెపి సోషల్ మీడియా వింగ్ కూడా గట్టిగానే రియాక్ట్ అవుతూ వస్తోంది. సినిమా వాళ్ళు ఇప్పుడు కాస్త సైలెంట్ గానే ఉన్నారు. కాని ప్రకాష్ రాజ్ మాత్రం వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నారు.

అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో బలమైన మెగా ఫ్యామిలీ కూడా తనను గెలిపించలేదు, వాళ్లకు బలం లేదు అనుకున్న ప్రకాష్ రాజ్… ఆ ఫ్యామిలీని లైట్ తీసుకుని నందమూరి ఫ్యామిలీకి దగ్గరవుతున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. మెగా హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ప్రకాష్ రాజ్ నో చెప్తున్నారనే టాక్ కూడా ఉంది. ఇటీవల నిర్వహించిన దేవర సినిమా కార్యక్రమంలో ప్రకాష్ రాజ్… ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసారు. ఓ వైపు పవన్ ను టార్గెట్ చేయడం మరో వైపు ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తడం అన్నీ కూడా సంచలనంగానే ఉన్నాయి మరి. ఇదే సమయంలో కాంగ్రెస్, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల సోషల్ మీడియా వింగ్స్ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే అంశం.