చిన్న దెబ్బకు ఇంత షో ఎందుకు? పవన్‌పై రెచ్చిపోయిన పూనం!
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రం మీద ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేసే పూనమ్ కౌర్ ఇప్పుడు మరోసారి సైలెంట్ పంచ్ వేసింది. కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు.. కర్మకి ఏం చేయాలో తెలుసు.. అంటూ పోస్టులు వేసింది.

ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రం మీద ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేసే పూనమ్ కౌర్ ఇప్పుడు మరోసారి సైలెంట్ పంచ్ వేసింది. కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు.. కర్మకి ఏం చేయాలో తెలుసు.. అంటూ పోస్టులు వేసింది. ఇక ఆ వెంటనే మరో పోస్ట్ ఇన్ స్టా స్టోరీలో పెట్టింది. అందులోనూ ఇలానే సంబంధం లేకుండా టాపిక్ ఏంటో చెప్పకుండా పెట్టింది. ఈ పోస్టులన్నీ చూస్తే ఇదంతా పవన్ కళ్యాణ్ కొడుకు ఇన్సిడెంట్ మీదే పరోక్షంగా స్పందించినట్టుగా కనిపిస్తోంది. చిన్న గాయాలకు ఏమో నగరం అంతా ఉలిక్కి పడుతోంది.. పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం మౌనంగా ఉంటోంది.. ఎవ్రీథింట్ అబౌట్ బెనిఫిట్స్ అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది. అసలు పూనమ్ కౌర్ ఇలాంటి పోస్టులు అలాంటి టైంలో ఎందుకు పెడుతోంది? ఆమె ఉద్దేశం ఏంటి? అన్నది మాత్రం అర్థం కావడం లేదు.
గతంలోనూ ఇలానే ఆమె పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల మీద పరోక్షంగా ట్వీట్లు వేస్తూనే ఉండేది. బెత్తం దెబ్బలు అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను వాడి పూనమ్ కౌర్ సెటైర్లు వేసింది. రాజకీయ నాయకుడు అంటే అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ కౌంటర్లు వేస్తూ ఉండేది. ఇక రీసెంటుగా అయితే ఏకంగా త్రివిక్రమ్ పేరు పెట్టి నేరుగానే ట్వీట్లు వేస్తోంది పూనమ్ కౌర్. కానీ ఇంత వరకు ఎక్కడా కూడా తనకు జరిగిన అన్యాయం ఇదీ అని నోరు విప్పి చెప్పినట్టుగా కనిపించడం లేదు. కానీ టార్గెట్ చేసే వ్యక్తులు విషయంలో మాత్రం ప్రతీ ఒక్కరికీ క్లారిటీ ఉంది. ఇప్పుడు అలానే పవన్ టార్గెట్ చేసినట్టు పోస్ట్‌లు పెట్టింది పూనం. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా పూనంను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. చేతులకు బ్యాండేజీలతో మార్క్ శంకర్ ఉన్న ఫొటోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఐసీయూ నుంచి మార్క్‌ను జనరల్ వార్డ్‌కు కూడా తరలించారు. మార్క్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కుటుంబంతో కలిసి పవన్ హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది.