బలూచిస్తాన్‌ ఇండియాలో విలీనం? పాక్‌తో బలూచిస్తాన్‌ వివాదం ఇదే

బలూచిస్తాను చేపట్టిన తిరుగుబాటు చర్యతో పాకిస్థాన్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. రీసెంట్‌గా పాకిస్థాన్‌లో BLA చేసిన ట్రైన్‌ హైజాక్‌తో పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌ మధ్య పోరు ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2025 | 02:55 PMLast Updated on: Mar 17, 2025 | 2:55 PM

Will Balochistan Merge With India This Is The Balochistan Dispute With Pakistan

బలూచిస్తాను చేపట్టిన తిరుగుబాటు చర్యతో పాకిస్థాన్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. రీసెంట్‌గా పాకిస్థాన్‌లో BLA చేసిన ట్రైన్‌ హైజాక్‌తో పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌ మధ్య పోరు ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే పాకిస్థాన్‌ మీద ఇంత ద్వేశంలో ఉన్న బలూచిస్థాన్‌ ఒకప్పుడు ఇండియాతో కలిసేందుకు ప్రయత్నించింది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే నిజంగా బలూచిస్తాన్‌ ఇండియాలో కలవాలి అనుకుందా.. అసలు బలూచిస్తాన్‌ చరిత్ర ఏంటి.. పాకిస్తాన్‌తో ఎందుకు ఇంత ద్వేశం అనేది ఇప్పుడు వైరల్‌గా మారింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో వీకే మేనన్ భారతదేశ విభజన తర్వాత ‘స్టేట్ ఆఫ్ కలాత్’.. అంటే బలూచిస్తాన్ దాదాపు 227 రోజుల పాటు స్వతంత్ర, సార్వభౌమ రాజ్యంగా ఉంది. బలూచిస్తాన్ తొలుత పాకిస్తాన్లో విలీనం కావాలని అనుకోలేదు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఇందుకు అంగీకరించారు. కానీ, బ్రిటిషర్లు వెళ్లిపోయిన తర్వాత ఇటు భారత్, అటు పాకిస్తాన్లోని సంస్థానాలు స్వతంత్రంగా ఉండలేకపోయాయి. బలూచిస్తాన్లో ఎక్కువ భాగం శీతల ఎడారి ఉంటుంది.

ఇది ఇరాన్ పీఠభూమికి తూర్పు అంచున ఉంది. ప్రస్తుత బలూచిస్తాన్‌ మూడు భాగాలుగా విభజించారు. ఇందులో పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్, ఇరాన్ సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్, అఫ్గానిస్తాన్లో ఒక చిన్న భాగంగా విభజించారు. పాకిస్తాన్ ఏర్పాటైనప్పటి నుంచి బలూచిస్తాన్‌లో తిరుగుబాటు స్వరం మొదలైంది. బలూచిస్తాన్‌లోకి చైనా ప్రవేశించినప్పటి నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. బలూచిస్తాన్‌కు చెందిన గ్వాదర్ ఓడరేవును చైనాకు పాకిస్తాన్ కట్టబెట్టింది. దీనికి వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం తమ అంతర్గత వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకూడదనే షరతు మీద పాకిస్తాన్‌లో భారత సంస్థానాల విలీనం జరిగిందని. కానీ, క్రమంగా ఈ రాచరిక సంస్థానాల ప్రతిపత్తి పూర్తిగా రద్దు అయింది. దీంతో అనేక రాజ్యాల ప్రాథమిక గుర్తింపు మసకబారడం మొదలైంది. ఇలాంటి సంస్థానాల్లో బలూచిస్తాన్ కూడా ఒకటి.

బలూచిస్తాన్ అసలు పాకిస్తాన్లో విలీనం అవ్వాలని అనుకోలేదు. కానీ, పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాను స్వాధీనం చేసుకుంది. కలాత్ స్వతంత్రంగా ఉండాలని ఖాన్ ఆఫ్ కలాత్ కోరుకున్నారు. కానీ, పాకిస్తాన్ అలా అనుకోలేదు. 1947లో బుస్తీ నవాబ్, ఖాన్ ఆఫ్ కలాత్తో జిన్నాకు ఉన్న సంబంధాలు తర్వాత చాలా మారిపోయాయి. ఆ తర్వాతే ఆయన మనసు మారింది. అప్పుడే బలూచిస్తాన్ను బలవంతంగా పాకిస్తాన్లో కలిపారు. స్టేట్ ఆఫ్ కలాత్‌ను అక్కడి నవాబు, భారత్‌లో కలపాలని ప్రతిపాదించారు నేది పూర్తిగా అబద్ధమని చెప్తున్నారు చరిత్రకారులు. కలాత్ రాజ్యం, భారత్లో విలీనం అవ్వాలని కోరుకున్నట్లుగా ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఖాన్ ఆఫ్ కలాత్ తన రాజ్యానికి ప్రత్యేక హెూదాను కోరుకున్నారు. దీని గురించే ఇరాన్, బ్రిటిష్ సామ్రాజ్యం, పాకిస్తాన్, భారత్లతో చర్చలు జరిపారు. కలాత్ కోసం ప్రత్యేక వర్గాన్ని సృష్టించడం ఆయన లక్ష్యం. మిగతా అంతా సృష్టి మాత్రమే.