కొడాలి నాని, అవినాశ్ ను అరెస్టు చేస్తారా ? జగన్ కామెంట్స్ వెనుక ఉద్దేశమేంటి ?

వైసీపీ హయాంలో విర్రవీగిన నేతలకు వణికిపోతున్నారు. తమను ఎప్పుడు అరెస్టు చేస్తారోనన్న టెన్షన్ లో పడిపోయారు. వల్లభనేని వంశీని అరెస్టు చేసిన తర్వాత మిగిలిన నేతల్లో ఏదో తెలియని భయం మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2025 | 11:23 AMLast Updated on: Feb 21, 2025 | 11:23 AM

Will Kodali Nani And Avinash Be Arrested What Is The Intention Behind Jagans Comments

వైసీపీ హయాంలో విర్రవీగిన నేతలకు వణికిపోతున్నారు. తమను ఎప్పుడు అరెస్టు చేస్తారోనన్న టెన్షన్ లో పడిపోయారు. వల్లభనేని వంశీని అరెస్టు చేసిన తర్వాత మిగిలిన నేతల్లో ఏదో తెలియని భయం మొదలైంది. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…చేసిన వ్యాఖ్యలకు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. వంశీ జైలుకు వెళ్లాడు. మరి నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి కొడాలి నానియేనా ? లేదంటే దేవినేని అవినాషా ? ఇంతకు వారు చేసిన ఘనకార్యాలు ఏంటి ?

విజయవాడ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బయటకు వచ్చాక… ఏవేవో కామెంట్స్ చేశారు. కమ్మ సామాజికవర్గంలో ఎదుగుతున్న వంశీని తొక్కేయడానికే…చంద్రబాబు, లోకేశ్‌ అరెస్టు చేయించారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. త‌న కుటుంబం త‌ప్పా…సామాజికవ‌ర్గంలో ఎవ‌రు ఎదిగినా ఓర్వ‌లేరని విమర్శించారు. ఇప్పుడు క‌క్ష‌పూరితంగా అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు వంశీని అరెస్టు చేశారు…రేపే మాపో కొడాలి నాని, అవినాశ్ ను కూడా అరెస్టు చేస్తారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ను ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటున్నారు.

కొడాలి, అవినాశ్ ను అరెస్టు చేస్తారని…జగన్మోహన్ రెడ్డి కాకతాళీయంగా అన్నారా ? లేదంటే పక్కా సమాచారంతోనే కామెంట్స్ చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది. నిజం ముమ్మాటికీ కొడాలి నాని, అవినాశ్ జైలుకెళ్ల‌బోతున్నారు. ఈ విషయం జగన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్ అండ చూసుకుని వారిద్దరు చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయి. వారిపై చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో వారు అరెస్టు కాక తప్పదని కూటమి పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. అరెస్టుల నుంచి ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయడానికి జగన్ ఇలా మాట్లాడారని కొందరు…అరెస్టులపై సమాచారం ఉందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు.

వైసీపీ హయాంలో కొడాలి నాని, దేవినేని అవినాశ్…రెచ్చిపోయారు. వీధి రౌడీల్లా కామెంట్స్ చేశారు. అరెస్టులకు భయపడననీ, మూడు కాదు ముఫ్ఫై కేసులు పెట్టుకున్నా భయపడేది లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అయితే వంశీ అరెస్టుతో కొడాలి నానిలో భయం మొదలైందని…ఏ క్షణంలో జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న టెన్షన్ లో ఉన్నారనీ ఆయన సన్నిహితులే చెబుతున్నారు. మొత్తం మీద జగన్ మాటలు విని బూతులతో రెచ్చిపోయిన కొడాలి…ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం చేయడం లేదు. అరెస్టు చేస్తారన్న భయం లేకపోతే…ప్రభుత్వ వైఫల్యాలను ఎందుకు ప్రశ్నించడం లేదు. మునుపటిలా దూకుడుగా ఎందుకు ఉండలేకపోతున్నారు ? జైల్లో పెడతారనే భయమా ? లేదంటే సైలెన్స్ ఈజ్ బెటర్ థింగ్ అని అనుకుంటున్నారా ?

మరోవైపు దేవినేని అవినాశ్…జగన్ అండ చూసుకోని పట్టపగ్గాల్లేకుండా వ్యవహరించాడు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై దాడి ఘటనల్లో.. దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. గతేడాది దేవినేని అవినాష్‌ను…శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్‌ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇమ్మిగ్రేషన్ సమయంలో అవినాష్‌పై లుకౌట్ నోటీసులు ఉండటంతో…దేవినేని అవినాష్ విదేశీ ప్రయాణాన్ని అడ్డుకున్నారు. అప్పట్లో ఈ ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి వంటి వైసీపీ నేతలను అరెస్టు చేశారు. వీరిలో కొందరికి బెయిల్ కూడా వచ్చింది.