Top story : ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ బిల్డర్లు పడేస్తారా? వేలకోట్లు సిద్ధం చేస్తున్నారా?
తెలంగాణలో రేవంత్ సర్కార్ని పడేయమని రియల్ ఎస్టేట్ బిల్డర్లు , పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారు. అవసరమైతే అందుకు కావలసిన డబ్బులు ఇస్తామని చెప్తున్నారు.

తెలంగాణలో రేవంత్ సర్కార్ని పడేయమని రియల్ ఎస్టేట్ బిల్డర్లు , పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారు. అవసరమైతే అందుకు కావలసిన డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఈ మాట అన్నది ఏదో సాదాసీదా వ్యక్తి కాదు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన మేనల్లుడు హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు తెలంగాణ ప్రభుత్వాన్ని పడేస్తారా?. అందుకు కావలసిన వందల కోట్ల రూపాయల్ని సిద్ధం చేస్తున్నారా? ఏంటి దుర్మార్గం? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ బిల్డర్లు పడేగలరా? రియల్ ఎస్టేట్ డౌన్ లో ఉన్నంత మాత్రాన ఏకంగా ప్రభుత్వాన్నే పడేస్తారా.? పడేయ్యాలంటూ బి ఆర్ఎస్ లాంటి పార్టీలను కోరుతున్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగ్గా జరగకపోతే, వందల కోట్ల రూపాయలు చేతుల్లో ఆడకపోతే, బిల్డర్లు, రియల్టర్ల, మాట నడవకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్నమాట.
ఈ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి? ఎంత దమ్ము ఉండాలి? పొలిటికల్ లీడర్స్…. రియల్ ఎస్టేట్ బిల్డర్ల మధ్య ఉన్న అపవిత్ర బంధానికి కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలే ఒక ఉదాహరణ. కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న మాటలు అతని మాటలు కావు. అవి స్వయంగా కేసీఆర్ మాటలు. బి ఆర్ ఎస్ నేతల మాటలు.2014 నుంచి పదేళ్ల పాటు తెలంగాణను ఏలిన బి ఆర్ ఎస్….. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మాత్రమే అసలైన డెవలప్మెంట్ గా భావించింది. ఆ పదేళ్లపాటు కేవలం రియల్ ఎస్టేట్ బిల్డర్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపింది. ప్రభుత్వ విధానాలు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, రియల్టర్ల కి అనుకూలంగా రూపొందించబడ్డాయి. హైదరాబాదులో టవర్లను చూపించి అదే తెలంగాణ అభివృద్ధి అని జనాన్ని మభ్య పెట్టారు కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులు. అభివృద్ధి అంటే విద్య, వైద్యం, మంచినీరు, మంచి ఆహారం, రోడ్లు, వ్యవసాయ అభివృద్ధి, శిశు మరణాలు తగ్గించడం, చదువులు పెంచడం, నిరుద్యోగాన్ని నిర్మూలించడం, ఉద్యోగాలు కల్పించడం ఇవి కాదని కెసిఆర్ నమ్మకం. కేవలం రియల్ ఎస్టేట్ బాగుంటే చాలు,ఎకరం 100 కోట్లకు అమ్ముకుంటే చాలు. అదే అభివృద్ధి.
ఈ బ్రమ లోనే పదేళ్లు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు సాగిలబడిపోయి, వాటాలు తీసుకుని….. వాళ్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపించారూ కెసిఆర్, కేటీఆర్. ఇప్పుడు మళ్లీ వాళ్ల కోసమే ఏకంగా రేవంత్ సర్కార్ ని పడేస్తామంటున్నారు. రియల్టర్లు ప్రభుత్వాన్ని పడేయమంటున్నారు, డబ్బులు పెట్టుబడి పెడతాం అంటున్నారు అని ఓపెన్ గా చెబుతున్నారు. ఇంతకంటే దుర్మార్గం, దారుణం మరొకటి ఉంటుందా? .? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను వేల కోట్లు పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్ వాళ్లు కూల్చి వేస్తారా? ప్రజలకు బీఆర్ఎస్ ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రభుత్వం అంటే…. అది ఫినిక్స్, వంశీరాం బిల్డర్స్, అపర్ణ, సత్వ, మై హోమ్, రాజ పుష్ప లాంటి రియల్ ఎస్టేట్ సంస్థ లు మాత్రమేనా? ప్రభుత్వాలు రియల్టర్ల అడుగులకు మడుగులు ఒత్తుతూ…. వాళ్ళు చెప్పింది వింటూ, వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే పెడుతూ, వాళ్లకు అనుకూలంగా జీవోలు తెస్తూ ఉండాలా? రియల్ ఎస్టేట్ వాళ్లు తమకు ఇష్టమైన రేట్లు ఫిక్స్ చేసుకుంటూ ఉంటే దానిని ఆమోదించాలా? అలా చేయకపోతే ప్రభుత్వాన్ని పడేస్తారా? బి ఆర్ ఎస్ లాంటి రియల్ ఎస్టేట్ పార్టీలతో కుమ్మక్కై వ్యాపారవేత్తలు వేలకోట్లు ఇన్వెస్ట్ చేసి ప్రభుత్వాన్ని పడగొడతారా?
ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేస్తే…. ప్రజాస్వామ్యాన్ని పరిహసించినట్లే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని…. వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లు పడగొట్టేస్తే ఇంక ఓటుకు విలువ ఎక్కడ ఉంటుంది?ఈ విషయంపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి. కొత్త ప్రభాకర్ రెడ్డితో ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాం అన్న రియాల్టర్లు ఎవరో తేలాలి. నిజంగానే కాంగ్రెస్ సర్కార్ కి దమ్ముంటే…. కొత్త ప్రభాకర్ రెడ్డి పై కేసు పెట్టాలి. అంతేకాదు ఏ ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వాన్ని పడేయడానికి కుట్ర పన్నాయి,? ప్రభుత్వాన్ని కూల్ చేయడానికి కోట్లు డబ్బులు ఇస్తామని చెప్పాయి.?… ఈ వ్యవహారాన్ని మొత్తం బయట పెట్టాలి. బి ఆర్ ఎస్ అధికారం లేకుండా ఐదేళ్లు కూడా ఉండలేకపోతోంది. ప్రభుత్వం తప్పులు చేస్తే…. సర్కారు పొరపాట్లు చేస్తే ప్రతిపక్షం నిలదీయాలి.
ప్రభుత్వాన్ని దారిలో పెట్టాలి. అందుకు అవసరమైతే ఉద్యమించాలి. అంతేకానీ రియల్ ఎస్టేట్ సంస్థల లాభాల కోసం….. ఏకంగా ప్రభుత్వాన్నే పడేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించడమే.2014…. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల కొన్న కెసిఆర్ నుంచి ఇంతకంటే గొప్ప సంస్కారం ఆశించలేం . రేవంత్ సర్కార్ ఎప్పటికైనా మేనమేషాలు లెక్కించకుండా కొత్త ప్రభాకర్ రెడ్డి పై కేసు పెట్టి…… ఏ రియల్ ఎస్టేట్ బిల్డర్లు ప్రభుత్వాన్ని పడేస్తామని చెబుతున్నారు…. సర్కారుని కూల్చడానికి డబ్బు పంపిస్తాం అంటున్నారు .వాళ్లని బయటకు లాగాలి….. వాళ్లపై కేసులు పెట్టాలి. ఇది జరిగితేనే…. ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్స్ కు అడ్డుకట్టపడుతుంది. అంతేకాదు రియల్టర్లు…. వ్యాపారస్తుల కోసమే పార్టీలు ప్రభుత్వాలు నడుస్తున్నాయి అని వాదన తప్పని రుజువు అవుతుంది.