Lucky KCR: ఎన్నికల పోటీలో పెరుగుతున్న పార్టీలు.. కేసీఆర్‌కు అదృష్టం కలిసొస్తుందా ?
క్కువ పార్టీలు బరిలో ఉండడం వల్ల ఆ వ్యతిరేక ఓటు చీలిపోయి.. బీఆర్ఎస్‌కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయ్. గులాబీ పార్టీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్న పార్టీలు.. మరి ఈ విషయంలో ఎలాంటి స్ట్రాటజీలా ఫాలో అవుతాయ్ అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆవేశపడి ఏదో ఒకటి చేయడం కంటే.. ఏమీ చేయకపోవడమే కలిసివస్తుంది కొన్నిసార్లు ! అలాంటి అవకాశం కొన్నిసార్లు మాత్రమే దక్కుతుంది. అదే ఇప్పుడు కేసీఆర్‌కు కలిసొస్తుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో కనిపిస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయ్. అధికారం తమదే అని బీజేపీ నేతలు స్ట్రాంగ్‌గా చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో అలాంటి ఇప్పటికిప్పుడు పరిస్థితి లేదు అన్నది క్లియర్.
అధికారంలోకి రావాలంటే.. బీజేపీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడి పరిస్థితులకు అనుగుంగా వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ఇక అటు కాంగ్రెస్ కూడా దూసుకు వస్తోంది. దీంతో పాటు వైటీపీ, బీఎస్పీ.. ఇలా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీల సంఖ్య భారీగానే ఉంది. దీంతో కేసీఆర్‌కు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. అదృష్టవంతుడిని చెరిపేవారు.. దురదృష్టవంతుడిని బాగుచేసేవారు ఉండరు అంటారు.. కేసీఆర్‌కు ఈ మాట పక్కాగా సరిపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. తెలంగాణలో బీజేపీ పుంజుకున్నట్లు కనిపించినా.. కాంగ్రెస్‌తో కంపేర్ చేస్తే క్షేత్రస్థాయలో అంతగా బలం లేదు. ఒకసారి ఆ పార్టీ.. మరోసారి ఈ పార్టీ.. రేసులో ముందుకు వచ్చినట్లు కనిపిస్తున్నాయ్.
దీంతో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం ఏంటి అన్నది జనాలు తేల్చుకోలేని పరిస్థితి. ఈ రెండు పార్టీలకు తోడు బీఎస్పీ, వైటీపీ కూడా తమ స్థాయిలో ఓట్లను ప్రభావితం చేయగలవు. ఎన్నికల బరిలో పార్టీలు పెరిగినా కొద్దీ.. బీఆర్ఎస్‌కు రిస్క్ తగ్గే అవకాశాలు ఉంటాయ్. రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా.. జనాల్లో కచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. ఐతే ఎక్కువ పార్టీలు బరిలో ఉండడం వల్ల ఆ వ్యతిరేక ఓటు చీలిపోయి.. బీఆర్ఎస్‌కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయ్. గులాబీ పార్టీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్న పార్టీలు.. మరి ఈ విషయంలో ఎలాంటి స్ట్రాటజీలా ఫాలో అవుతాయ్ అన్నది ఆసక్తికరంగా మారింది.