Top story: ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఎండ్ కార్డ్ పడనుందా ? ఏ1 ప్రభాకరరావు అప్రూవర్ గా మారిపోయారా ?
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ దుమారం రేపింది. బీఆర్ఎస్ హయాంలో...ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం కలకలం రేపింది. ఫోన్లు ట్యాపింగ్ చేయడం కాకుండా బడా వ్యాపారులను బెదిరించి...కోట్ల రూపాయలు గుంజారు కొందరు పోలీస్ అధికారులు.
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ దుమారం రేపింది. బీఆర్ఎస్ హయాంలో…ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం కలకలం రేపింది. ఫోన్లు ట్యాపింగ్ చేయడం కాకుండా బడా వ్యాపారులను బెదిరించి…కోట్ల రూపాయలు గుంజారు కొందరు పోలీస్ అధికారులు. ప్రభుత్వం మారిపోవడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియాలోని సియోల్ లో పర్యటిస్తున్న తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వాళ్లయినా తప్పించుకోలేరని…సాక్ష్యాధారాలతో సహా ఫైళ్లన్నీ సిద్ధం అయ్యాయని అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు కోసం కాదని…సాక్ష్యాధారాలతోనే చర్యలు తీసుకుంటామని బాంబు పేల్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు ధరణిలో అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సాక్ష్యాధారాలు ఉన్నాయని…కీలక నేతల అరెస్టు తప్పదన్నారు. పొంగులేటి కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఫోన్ కేసులో ఏ1 నిందితుడు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకరరావును ఏ క్షణమైనా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు విదేశాల్లో ఉన్న ప్రభాకరరావు…హైదరాబాద్ కు చేరుకున్నట్లు నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఆయన సహకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విదేశాల్లో ఉన్న ప్రభాకరరావు…ఇండియాకు వచ్చి ఉంటే…ఎయిర్ పోర్టు అధికారులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఆయనపై తెలంగాణ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇండియాకు చేరుకున్న ప్రభకరరావును అరెస్టు చేయవద్దని…ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభాకరరావు హైదరాబాద్ వచ్చారని…అందుకే పొంగులేటి శ్రీనివాస రెడ్డి బాంబు పేల్చారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకరరావు స్టేట్ మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ లోని కీలక నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కీలక నేతలను అరెస్టు చేసేందుకు…మేజిస్ట్రేట్ ముందు ప్రభాకరరావు స్టేట్ మెంట్ ను రికార్డు చేసేందుకు సిట్ అధికారులు రెడీ అవుతున్నారు. ప్రభాకరరావే స్వయంగా వచ్చారా ? లేదంటే తెలంగాణ పోలీసులే వ్యూహాత్మకంగా రప్పించారా అన్న దానిపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే భుజంగరావు, వెంకన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్నలు అరెస్టయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అక్రమ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం సాగిందని ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రణీత్‌రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలాలను పోలీసులు సేకరించారు. ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే తాము ఈ అక్రమానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించారు. దీంతో కేసు దర్యాప్తు అంతా ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల విచారణ పైనే కేంద్రీకృతమైంది. వారిని విచారిస్తేనే దర్యాప్తు ముందుకు సాగడంతోపాటు పొలిటికల్ సంబంధాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా…15 రోజుల్లోనే 4,500కుపైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో నాలుగో నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై జరిగిన వాదనల సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. నవంబరు 15 నుంచి 30వ తేదీల మధ్యనే అన్ని ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి సహా ఇతర నేతలు, వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి…దాదాపు 340జీబీ సమాచారాన్ని పోలీసులు వెలికితీసినట్లు సమాచారం.