VEMIREDDY : నన్ను బెదిరిస్తారా… నా దమ్ము ఏంటో చూపిస్తా…
రాజ్యసభ ఎంపీ, నెల్లూరు వైసీపీలో కీలకనేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Chevireddy Baskar Reddy) పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పరిస్థితి బాలేదని... నెల్లూరు జిల్లాలో సగానికి పైగా ఎమ్మెల్యేలను మార్చాలని వేమిరెడ్డి చేసిన విజ్ఞప్తిని సీఎం జగన్ పట్టించుకోలేదు.
రాజ్యసభ ఎంపీ, నెల్లూరు వైసీపీలో కీలకనేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పరిస్థితి బాలేదని… నెల్లూరు జిల్లాలో సగానికి పైగా ఎమ్మెల్యేలను మార్చాలని వేమిరెడ్డి చేసిన విజ్ఞప్తిని సీఎం జగన్ పట్టించుకోలేదు. మాజీ మంత్రి అనిల్ యాదవ్ వల్ల జరిగిన నష్టం గురించి చెప్పినా వినలేదు. వీటన్నిటికీ తోడు… చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పంపి తనను బెదిరించడమే ఏమి రెడ్డి జీర్ణించుకోలేక పోయారు. వైసీపీలో ఉండకూడదని నిర్ణయానికి వచ్చేసారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ (YCP) మరో సంక్షోభంలో పడింది. ఇంతకాలం పార్టీకి పెద్ద దిక్కుగా, ఆర్థికంగా అండగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… వైసీపీకి దూరం కావడంతో నెల్లూరు జిల్లాలోని వైసీపీ నేతలు.. కార్యకర్తలు డీలా పడ్డారు. ప్రభాకర్ రెడ్డి లేని లోటును భర్తీ చేసేందుకు నేతలు తంటాలు పడుతున్నారట. పూర్తిగా వ్యాపార కార్యకలాపాలకే పరిమితమైన వేమిరెడ్డి… 2018లో జగన్ నెల్లూరు జిల్లాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా వైసీపీలోకి స్వాగతించారు. దీంతో ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అదే ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha Elections) లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీని గెలిపించేందుకు ఆయన వివిధ జిల్లాలను పర్యవేక్షించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… వేమిరెడ్డి కీలక నేతగా మారారు. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డికి టీటీడీ సభ్యురాలిగా అవకాశం కల్పించింది. ఆధ్యాత్మికత, భక్తిభావం అధికంగా ఉన్న వేమిరెడ్డి దంపతులు… ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి క్యాబినెట్లో స్థానం దక్కింది. జిల్లాలో పార్టీని నడిపించే బాధ్యతను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అప్పగించారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీ చేయాలని కోరడంతో అంగీకరించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ వచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత నెల్లూరు సిటీ ..కావలి.. ఉదయగిరి నియోజకవర్గాలలో వైసిపి అభ్యర్థులను మార్చాలని అధిష్టానానికి తెలియజేశారట. వేమిరెడ్డి ప్రతిపాదనలకు అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాలేదట. దీంతో అసంతృప్తి చెందిన ఆయన..వ్యాపార కార్యకలాపాల నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారు. పార్టీ నేతలు విజయ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయనతో చర్చలు జరిపారు. జగన్ తో సమావేశమై అన్ని విషయాలు చర్చిద్దామని చెప్పడంతో అందుకు ఆయన అంగీకరించారు.
అభ్యర్థులు బలంగా ఉన్నారని, ఎంపీగా ఈజీ గెలవొచ్చని సీఎం జగన్…వేమిరెడ్డికి చెప్పారట. కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ తో పాటు మరో యాదవ నేత పేరును తెర పైకి తీసుకువచ్చారు. తన లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీకి సంబంధించి సమాచారం ఇవ్వకుండా…అభ్యర్థులను ప్రతిపాదించడంపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారట. కందుకూరులో మహీధర్ రెడ్డినే కొనసాగించాలని చెప్పినా పట్టించుకోలేదట. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ను మార్చడంపై వేమిరెడ్డితో చర్చించలేదట. తాను కోరిన విధంగా అనిల్‌ను మార్చడంతో సంతృప్తి చెందిన వేమిరెడ్డి… నెల్లూరు సిటీలో గట్టి అభ్యర్థిని బరిలోకి దించాలని భావించారట. ఇంతలోనే అనిల్ అనుచరుడు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహమ్మద్‌ను నియమించడంతో విపిఆర్ వర్గం షాక్‌కు గురయింది. మంత్రి కాకాణి..ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై కలత చెందారట. మాజీ మంత్రి నారాయణకు పోటీగా బలహీనమైన అభ్యర్థిని దించితే వైసిపికి ఓట్లు తగ్గుతాయని, దాని ప్రభావం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపైనా ఉంటుందని అనిల్ వర్గం ప్రచారం చేసిందట. కందుకూరు అభ్యర్థిగా వంకి పెంచలయ్య యాదవ్ పేరును అధిష్టానం ప్రతిపాదించింది. పెంచలయ్య లేదా అతని కుమార్తె కందుకూరు నుంచి పోటీ చేస్తారని కూడా లీకులు ఇచ్చింది.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో సీఎం జగన్ భేటీ కావాలని భావించినా…ఆయన అందుబాటులోకి రాలేదు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న వేమిరెడ్డిని…ఆదాల ప్రభాకర్ రెడ్డి కలిశారు. వైసీపీలోనే కొనసాగాలని, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నచ్చచెప్పినా ఆయన స్పందించలేదట. పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయని, లోక్‌సభ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట. ఆదాల చెప్పిన వినకపోవడంతో…వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Baskar Reddy) ని విపిఆర్ వద్దకు పంపింది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని వేమిరెడ్డికి చెప్పినా…ఆయన ససేమిరా అన్నారట. పార్టీని వీడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వేమిరెడ్డికి చెవిరెడ్డి చెప్పారట. దీంతో మరింత అగ్రహించిన వీపీఆర్… పార్టీని వీడుతానని స్పష్టం చేశారట. వైసీపీకి వీపిఆర్ దూరమవుతారనే సమాచారం తెలియడంతో టిడిపి నేత మాజీ మంత్రి నారాయణ హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లి… విపీఆర్ తో భేటీ అయ్యారు. వేమిరెడ్డితో చర్చలు జరపడంతో టీడీపీలో చేరేందుకు ఒకే చెప్పారు.