ఇదేం దరిద్రంరా బై… తెలంగాణాకు ఆంధ్రా రాజకీయం

తెలంగాణ రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఇప్పుడు పొలిటికల్ బ్లాక్ బాస్టర్ మాదిరిగా మారారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేశారు ఇద్దరు నేతలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 13, 2024 | 02:16 PMLast Updated on: Sep 13, 2024 | 2:16 PM

Worst Politics Between Congress And Brs

తెలంగాణ రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఇప్పుడు పొలిటికల్ బ్లాక్ బాస్టర్ మాదిరిగా మారారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేశారు ఇద్దరు నేతలు. ఎంఎల్ఏలు అన్న సంగతి మర్చిపోయి ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. దీంతో మీడియా సైతం అరికేపూడి గాంధీ ఇటు కౌశిక్ రెడ్డి ఇంటికి పరుగులు తీస్తుంది. ఆరికేపూడి గాంధీ నివాసంకు వెళ్లి బిఆర్ఎస్ కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి ప్రకటించిన తరువాత వివాదం తెరపైకి వచ్చింది. దానికి కౌంటర్ గా తానే కౌశిక్ రెడ్డికి వస్తానని దమ్ముంటే కండువా కప్పాలని చూపించి అగ్గి రాజేసారు ఇద్దరు నేతలు. దీనితో సవాల్ విసిరిన కౌశిక్ రెడ్డి ఇంటికి నేరుగా వెళ్ళాడు అరికెపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో పాటు దాడులు ప్రతిదాడులతో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో కొత్తగా రాజకీయ ఉనికి కోసం దాడులు చేసుకునే సంస్కృతి తెరపై కొచ్చింది.

దీంతో ఇటు కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ వివాదం కాస్త కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ వివాదం లాగా మారింది.అయితే ఇద్దరి నేతల వ్యవహారి శైలి తెలంగాణలో పెద్ద చర్చకి కారణం కాగా ఇద్దరి వ్యవహారంపై తెలంగాణ ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కౌశిక్ రెడ్డి గాంధీ వివాదాల వల్ల నయా పైసా ప్రయోజనం లేదు కదా వీరిద్దరు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతూ నిత్యం వార్తల్లో ఉండి వివాదాల్లో తలదూర్చి తెరపైకి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం తెలంగాణా పరువు తీయడమే కదా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ చిల్లర పంచాయితీ ఏంటని నిలదీస్తున్నారు.

ఇద్దరు నేతల వివాదం వెనుక కేవలం ఉనికి కోసమే తప్పించి ప్రజా ప్రయోజనాల అంశమే లేదని, వీరిద్దరి వల్ల సాధారణ ప్రజలకు ఇటు అధికారులకు పోలీసులకు మీడియాకు పెద్దపని పెట్టినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. అరికెపూడి గాంధీ అయినా కౌశిక్ రెడ్డి అయినా ప్రస్తుతం నెలకొన్న ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం హైప్ కోసమే పడరాని పాట్లు పడుతున్నారనీ ఇద్దరు నేతలు కలిసి దాడులు ప్రతి దాడులు చేసుకొని తెలంగాణలో కొత్త సంస్కృతి తెరపైకి తెచ్చారని అటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకూ ఆంధ్రా రాజకీయలకే పరిమితమైన ఈ శైలి తెలంగాణాకు తెచ్చారని విమర్శిస్తున్నారు. వయసులో ఉన్న కౌశిక్ రెడ్డి రెచ్చగొడితే అంత అనుభవం ఉన్న గాంధీ రెచ్చిపోవడం ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మొదటి నుంచి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యక్తిగానే ముద్ర పడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్ లో చేరిన నాటి నుంచి ఎన్నికల ప్రచారంలో గెలిస్తే అసెంబ్లీకి వెళ్తాను గెలవకపోతే స్మశానానికి వెళ్తానని చేసిన ప్రకటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ సైతం తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో వివాదాస్పద వ్యక్తిగానే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అరికెపూడి గాంధీ విషయంలో గాజులు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలతో మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టుకున్నారు కౌశిక్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ మాత్రం అరికెపూడి గాంధీ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని ఇప్పటికే స్టేట్మెంట్ ఇస్తే బీఆర్ఎస్ మాత్రం ఈ వ్యవహారాన్ని భుజాన వేసుకొని నేరుగా బిఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దింపింది.మొత్తానికి కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను భస్టు పట్టించడమే కాకుండా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‍లో అలజడి సృష్టించింది. అటు తిరిగి ఇటు తిరిగి లా అండ్ ఆర్డర్ సమస్యగా మారుతోంది. నేతలు నోటి దూల తగ్గించుకోకపోతే మాత్రం కొత్త సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. చూడాలి మరి వివాదానికి ఇద్దరి నేతల్లో ఎవరు పుల్ స్టాప్ పెడతారో, వ్యక్తిగత వ్యవహారాన్ని కాస్త తెరపైకి తెచ్చి రెండు పార్టీల వ్యవహారంగా పొడిగిస్తారో.