“ఎమ్మెల్యే వినేష్ ఫోగాట్” గోల్డ్ మిస్ అయింది, కాని ప్రజల్లో గెలిచింది
అందరి అంచనాలకు తగ్గట్టే హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో అధికార బిజెపి వెనుకబడింది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 90 స్థానాల్లో 48 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
అందరి అంచనాలకు తగ్గట్టే హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో అధికార బిజెపి వెనుకబడింది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 90 స్థానాల్లో 48 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇంకా 8 నియోజకవర్గాలపై సమాచారం రావాల్సి ఉంది. ఇక హర్యానాలో కాంగ్రెస్ 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడే కాస్త అటు ఇటుగా ఫలితాలు మారుతున్నాయి.
హర్యానాలో కీలక నేతలు అందరూ కాంగ్రెస్ నుంచి విజయం సాధిస్తున్నారు. ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ మిస్ అయిన వినేష్ ఫోగాట్ ఈ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకు వెళ్తున్నారు. జూలానాలో ఆమె విజయం దాదాపుగా ఖాయం అయింది. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ లో 28 స్థానాల్లో బిజెపి లీడ్ లో ఉండగా… హర్యానాలో 25 స్థానాల్లో లీడ్ లో ఉంది.