యనమల కొంప ముంచిన.. కూతురు అల్లుడు..! బాబు ఎత్తుకు రామకృష్ణుడు చిత్తు..
యనమల రామకృష్ణుడు...తెలుగుదేశం పార్టీల సీనియర్ నేత. నాలుగు దశాబ్దాలకు పైగా టీడీపీలోనే కొనసాగుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్నారు.

యనమల రామకృష్ణుడు…తెలుగుదేశం పార్టీల సీనియర్ నేత. నాలుగు దశాబ్దాలకు పైగా టీడీపీలోనే కొనసాగుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్నారు. రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు. ఎమ్మెల్యేగా, మంత్రి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్సీగా …తెలుగుదేశం పార్టీలో విభిన్నపాత్రలు పోషించారు. ఆయనకు రాజకీయంగా వచ్చినన్నీ…కాదు కాదు ఇచ్చినన్నీ అవకాశంలో పార్టీలో మరే నేతకు దక్కలేదు. ఫ్యూచర్ లో దక్కదు కూడా. ఆయన కూతురు యనమల దివ్య తుని ఎమ్మెల్యే. అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్…ఏలూరు ఎంపీ. వియ్యంకుడు సుధాకర్ యాదవ్ మైదుకురు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ సారి మాత్రం ఆయనకు అవకాశం దక్కలేదు. ఇక్కడే యనమలలోని మరో మనిషి బయటకు వచ్చాడు. 40 ఏళ్లకుపైగా పార్టీలోనే కొనసాగుతున్న ఎన్నడు లేని విధంగా పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు. అది కూడా ఎమ్మెల్సీగా ఉంటూనే. కాకినాడ సెజ్, ఇతర పరిశ్రమల పేర్లతో అగ్రకులాలకు చెందిన వాళ్లు…బీసీల భూముల లాక్కున్నారని వారంతా పెద్దవాళ్లయ్యారని అన్నారు. అయితే బీసీలు ఇంకా ఎదగలేదని…వారి భూములు వారికి ఇప్పించాలంటూ లేఖాస్త్రం సంధించారు. ఆ లేఖలో ఆయన కొంత మంది కులాల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయా వ్యాపారవేత్తల పేర్లలో కులాల తోకల్ని జత చేశారు. దీంతో సహజంగానే యనమల రామకృష్ణుడు కుట్రపూరితంగా .. బ్లాక్ మెయిల్ కోసం ఈ లేఖ రాశారన్న అనుమానాలకు బీజం పడింది.
కాకినాడకు సెజ్, పరిశ్రమలు, ఫార్మా పరిశ్రమలకు వ్యతిరేకంగా భూపోరాటాలు జరిగినప్పుడు యనమల ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ఇక్కడ చాలా మందికి డౌట్ వచ్చింది. దాన్నే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసేందుకు ఆ లేఖ రాశారని అప్పట్లో మండిపడ్డారు. రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవి ఆశించి ఇలా రాజకీయం చేస్తున్నారని.. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసేందుకు ఇలా లేఖ రాశారన్న ప్రచారం జరిగింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని ఓడించడానికి ఆయన బంధువు తలసాని ఏపీపైకి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సైలెంటుగా గా ఉన్నారు యనమల. అప్పుడు కూడా టీడీపీ నేతలు ఆయన సిన్సియార్టీని సందేహించలేదు. కానీ ఒక్క లేఖతో ఆయన పరపతి అంతా క్యాడర్ లో పోగొట్టుకున్నట్లయింది.
కొన్ని నెలల క్రితం చంద్రబాబు…యనమలను రాజ్యసభకు పంపాలని భావించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో మండలికి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఆయన కూతురు, తుని ఎమ్మెల్యే దివ్య, అల్లుడు గోపీనాథ్…నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఎమ్మెల్సీల ఎంపికకు ముందు…దివ్య, ఆమె భర్త అవినీతి అక్రమాలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో దుమారం రేపింది. మద్యం షాపులు, బెల్టు షాపులు, అనుమతుల్లేని బార్లు, పేకాట క్లబ్బులు నిర్వాహకుల నుంచి యనమల దివ్య భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు పార్టీకి పక్కా ఆధారాలు దొరికాయి. మట్టి, గ్రావెల్ దందా నుంచి కోట్లు వెనుకేసుకుంటున్నట్లు తేలింది. ప్రతిపాదిత విమానాశ్రయం దగ్గరలోనే 3వందల ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ కు 12 కోట్లు బొక్కేసినట్లు పార్టీకి పక్కా సమాచారం దొరికింది. ఐఆర్ఎస్ అధికారి అయిన యనమల దివ్య భర్త గోపినాథ్…శని, ఆదివారాల్లో తునికి వచ్చి ఎక్కడెక్కడ ఎంతెంత వసూళ్లు చేయాలో గైడ్ చేస్తున్నారట. యనమల, ఎమ్మెల్యే దివ్య ఎక్కడా సీన్ లో కనిపించకుండా బంధువుల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. కొంతకాలం సహించుకుంటూ వచ్చారు చంద్రబాబు, లోకేశ్. యనమల కుటుంబం అవినీతి చిట్టా తెప్పించుకున్న చంద్రబాబు, లోకేశ్…జాగ్రత్తగా ఆ కుటుంబానికి చెక్ పెట్టారు.
యనమల రామకృష్ణుడు…టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. 1983లో తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ తొలి మంత్రివర్గంలో న్యాయ, పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించారు. 1985-89 మధ్య మంత్రిగా, 1989-94లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా, 1995-99లో శాసనసభ స్పీకర్‌గా కొనసాగారు. ఎన్టీఆర్‌ను దించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలో స్పీకరుగా ఉన్నారు. 1999-2003లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2004-08 మధ్య కాలంలో తిరిగి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. 1983 నుంచి నుంచి 2004 ఎన్నికల వరకు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఓటమి పాలయ్యారు. 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.